newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

షాద్‌నగర్ జంటహత్యల కేసు.. సుప్రీం సంచలన తీర్పు

25-07-201925-07-2019 14:47:54 IST
2019-07-25T09:17:54.760Z25-07-2019 2019-07-25T09:17:37.792Z - - 20-10-2019

షాద్‌నగర్ జంటహత్యల కేసు.. సుప్రీం సంచలన తీర్పు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సంచలనం సృష్టించిన షాద్ నగర్ జంట హత్యల కేసులో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కి ఊరట లభించింది. ఈ కేసుపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించింది. ఈ కేసును కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో 1990 డిసెంబర్ 6న హత్యకు గురైన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పెద్దనాన శంకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి. హత్యలో 11మందిపై కేసు నమోదు చేశారు.  కేసు విచారణ సాగుతుండగానే.. పొన్నపురెడ్డి శివారెడ్డి హత్యకు గురయ్యారు.

కాగా.. 2004లో రామసుబ్బారెడ్డికి జైలు శిక్ష పడింది.2006లో కేసును కోట్టి వేస్తూ తీర్పు ఇచ్చింది హైకోర్టు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు కు అప్పీలు చేసుకున్నారు శంకర్ రెడ్డి కుమారుడు శివనారాయణ రెడ్డి. తాజాగా ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో రామసుబ్బారెడ్డికి గొప్ప ఉపశమనం లభించినట్టయింది.

దీంతో 29ఏళ్ళ జమ్మలమడుగు జంట హత్యల కేసు సస్పెన్స్ కు తెరపడినట్టయింది. విచారణ అవసరం లేదంటూ కేసును కొట్టివేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. అత్యున్నత న్యాయస్థానంలో తీర్పు అనుకూలంగా రావడంతో రామసుబ్బారెడ్డి వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle