newssting
BITING NEWS :
*దిశ కేసులో నలుగురు నిందితులను షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు*దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ *దిశ ఘటన హెచ్చరిస్తోంది - పవన్ కళ్యాణ్ * నర పీడితులకు సరైన శిక్ష పడింది - మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ *దేశంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది, మీరు నిందితులను చంపకూడదు- ఎంపీ మేనకాగాంధీ * దిశకు తగిన న్యాయం జరిగింది - అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, నాని, పూరీజగన్నాధ్ * రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు *దిశ ఘటన తర్వాత దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది - కేజ్రీవాల్*కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్*రేపిస్టులపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.. రేపిస్టులపై దయ అవసరంలేదు.. నిందితులు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశమే ఉండకూడదన్న రాష్ట్రపతి *నిందితుల హత్యకేసుపై దిశ తల్లిదండ్రుల స్పందన.. మా బిడ్డకు తగిన న్యాయం జరిగిందని వ్యాఖ్య

షాకింగ్‌లో ఏపీ సచివాలయ ఉద్యోగులు..!

03-10-201903-10-2019 09:56:39 IST
2019-10-03T04:26:39.511Z03-10-2019 2019-10-03T04:26:37.543Z - - 06-12-2019

షాకింగ్‌లో ఏపీ సచివాలయ ఉద్యోగులు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉద్యోగం వచ్చిందని సంతోషపడాలా..? ఏపీ ప్రభుత్వం ఇచ్చిన షాక్‌కు బాధపడాలో అర్థకాని స్థితిలో సచివాలయ ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. అదేంటి సచివాలయం ఉద్యోగం సాధిస్తే సంతోషపడాలి కానీ బాధపడటం ఎందుకు అని అనుకుంటున్నారా...? ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు అలాంటి షాక్‌ను ఇచ్చింది మరి. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన షాక్‌తో ఉద్యోగుల దిమ్మతిరిగిపోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు వైకాపా ప్రభుత్వం కృషి చేస్తుంది. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే గ్రామాల వారిగా ఉద్యోగాలు కల్పిస్తూ నిరుద్యోగుల మన్ననలు పొదుతుంది. ఇటీవల జరిగిన సచివాలయ ఉద్యోగాల నియామకం చేపట్టగా లక్షలాది మంది ఉద్యోగం పొందారు. కాగా ఎంపికైన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్మోహన్‌రెడ్డి అపాయింట్‌ మెంట్‌ ఆర్డర్‌ ఇచ్చారు. ఉద్యోగులు ఈ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ను చూసి ఒక్కసారిగా కంగుతిన్నారట.

ఉద్యోగాలు పొందిన వారు రెండేళ్లు ప్రొబేషనరీ ఉంటుందని, ప్రతీ ఉద్యోగి మూడేళ్లు తప్పనిసరిగా పనిచేయాలని.. అనుకోని కారణాల వలన ఉద్యోగం మధ్యలో మానేస్తే వారికి అందించిన గౌరవ వేతనంతో పాటు శిక్షణకోసం ప్రభుత్వం చేసిన ఖర్చులు తిరిగి చెల్లించాలని ఆ అపాయింట్‌ మెంట్‌ ఆర్డర్‌లో పొందుపర్చి ఉండటాన్ని చూసి ఉద్యోగ ఆర్డర్‌ అందుకున్న వారు అవాక్కవుతున్నారు.

సచివాలయ ఉద్యోగాలు పొందిన వారిలో అత్యధిక మంది ఉన్నత చదువులు చదువుకొని ఖాళీగా ఉన్నవారే ఉన్నారు. ఎంబీఏ, డిగ్రీ, డిగ్రీ సమాన విద్యను అభ్యసించిన వారే ఎక్కువశాతం ఉన్నారు. ప్రొబేషనరీ పీరియడ్‌లోపు పెద్ద ఉద్యోగం వస్తే మా పరిస్థితి ఏంటని వారు వాపోతున్నారు. సీఎం జగన్‌కూడా జనవరిలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఉటుందని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే గ్రూప్‌ -2, 3 పరీక్షలు రాసిన వారు ఫలితాల్లో మంచి మార్కులొస్తే ఆ ఉద్యోగాలకు వెళ్లే అవకాశ ముంది.

ఈ నేపథ్యంలో అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌లో ఈ నిబంధనలు పెట్టడంతో సచివాలయం ఉద్యోగాలకు ఆర్డర్‌ పొందిన వారు ఏం చేయాలో అయోమయంలో ఉన్నారు. వార్డు, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చినట్లే ఇచ్చి ఇలాంటి కండీషన్‌ పెట్టడం పట్ల అభ్యర్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు వెలువడే నోటిఫికేషన్‌లకు తాము ప్రయత్నం చేయకుండా చేసినట్లుగా జగన్‌ తీరు ఉందని, ఇది ఏమాత్రం సమంజసంగా లేదని సచివాలయ ఉద్యోగాలు పొందిన వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జగన్‌ ఇచ్చిన షాక్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల ఆర్డర్‌లు పొందిన వారి పరిస్థితి అయోమయంగా మారింది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle