newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

షర్మిల బాణం వచ్చేసింది ..!

30-03-201930-03-2019 15:23:48 IST
Updated On 30-03-2019 15:24:12 ISTUpdated On 30-03-20192019-03-30T09:53:48.840Z30-03-2019 2019-03-30T09:53:45.350Z - 2019-03-30T09:54:12.166Z - 30-03-2019

షర్మిల బాణం వచ్చేసింది ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు అన్న సంధించిన బాణం వైఎస్ షర్మిల. ఇప్పటికీ అంతే వాడిగా ప్రత్యర్థులపై అటాక్ చేస్తున్నారు. కొడితే కుంభస్థలాన్నే దెబ్బ కొట్టాలన్న తలంపుతో లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ముందుగా రాజధానిలో భూములు కోల్పోయిన రైతుల అభిప్రాయాలను విని, ఆ తర్వాత ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. సింహం సింగిల్‌గానే వస్తుందన్న షర్మిల.. గుంపులు గుంపులుగా ఏమొస్తాయో తేల్చుకోండని జనానికే వదిలేశారు. వైఎస్సార్సీపీకి ఎలాంటి పొత్తులూ అవసరం లేదన్నారు. రుణమాఫీ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఐదేళ్లు గడుస్తున్నా ఆ మొట్టమొదటి హామీనే పూర్తిగా అమలు చేయలేకపోయారని షర్మిల అటాక్ చేశారు.

వైఎస్ తెచ్చిన ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పథకాలను చంద్రబాబు నీరుగార్చారని షర్మిల విమర్శలు గుప్పించారు. మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ప్రభుత్వాసుపత్రికి వెళ్తారా చంద్రబాబూ అంటూ సూటిగా ప్రశ్నించారు. రాజధానిలో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కూడా చంద్రబాబు కట్టలేదన్నారు. రైతుల ఉసురు చంద్రబాబుకు తప్పక తగులుతుందని ఆమె శాపనార్థాలు పట్టారు. గత ఎన్నికల్లో బాబు వస్తే జాబు వస్తుందన్నారు. కానీ బాబువల్ల జాబు వచ్చింది ఒక్క లోకేష్‌కూ మాత్రమేనన్నారు షర్మిల.

అంతేకాదు.. లోకేష్‌కు జయంతికీ, వర్ధంతికీ తేడా తెలియదనీ.. ఏం మేలు చేశారని లోకేష్‌కు అవార్డులు ఇచ్చారంటూ ప్రభుత్వాన్ని సూటిగా నిలదీశారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకొని ఈ సారి కాంగ్రెస్‌తో చేతులు కలిపిన చంద్రబాబుది రోజుకో వేషం పూటకో మాట అంటూ టార్గెట్ చేశారు. జగన్ చేసిన పోరాటాల వల్లే ప్రత్యేక హోదా అంశం సజీవంగా ఉందన్నారు షర్మిల. కేసులకు భయపడే చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి అమరావతికి వచ్చారని షర్మిల తీవ్రంగా ఆరోపించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే చేనేతలకు రూ. 3 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. మంగళగిరిలో షర్మిల ప్రసంగంలో ఎక్కువ భాగం చంద్రబాబు,లోకేష్‌లను నేరుగా ప్రశ్నిస్తూ ప్రసంగించారు. ఇక చంద్రబాబు, లోకేష్ బాబు, పవన్.. కాస్కోండి. ఈ వారం రోజులూ షర్మిల వాగ్బాణాలు నేరుగా తాకేది మిమ్మల్నే అంటున్నారు వైసీపీ కార్యకర్తలు.          


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle