newssting
BITING NEWS :
* చెదురుమదురు ఘటనలు మినహా తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌*ఏపీ శాసనమండలి కీలక నిర్ఱయం.. మూడురాజధానుల బిల్లు సెలక్ట్ కమిటీకి.. టీడీపీ సంబరాలు * కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తో * జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌ భేటీ..పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంపై చర్చ..పవన్‌ వెంట పలువురు బీజేపీ నేతలు*అమరావతి: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఏపీ అసెంబ్లీ తీర్మానం *వివాదాస్పద స్వామీజీ నిత్యానందకు బ్లూ కార్నర్ నోటీసులు జారీచేసిన ఇంటర్ పోల్ *ఏపీ: నేడు శాసనసభ కార్యక్రమాలను బహిష్కరించిన టీడీపీ.. అసెంబ్లీకి హాజరుకాకూడదని నిర్ణయం*అమరావతి: ఏపీ రాజధాని పిటిషన్ల విచారణకు హైకోర్ట్ ప్రత్యేక బెంచ్.. సీజే ఆధ్వర్యంలో ఏర్పాటైన త్రిసభ్య ధర్మాసనం*దావోస్: పెట్టుబడుల ఒప్పందాలపై నేడు మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన*చైనాలో పంజా విసురుతోన్న 'కరోనా' వైరస్... ఇప్పటి వరకు 17 మంది మృతి*జోగులాంబ: ఎర్రవల్ల దగ్గర రోడ్డు ప్రమాదం... ట్రాక్టర్‌ను ఢీకొన్న కారు, ముగ్గురు మృతి

శ్రీ‌కాకుళం వైసీపీలో గంద‌ర‌గోళం.. తింగ‌ర‌మేళం..!

06-11-201906-11-2019 14:50:48 IST
Updated On 06-11-2019 15:22:39 ISTUpdated On 06-11-20192019-11-06T09:20:48.049Z06-11-2019 2019-11-06T09:20:44.007Z - 2019-11-06T09:52:39.426Z - 06-11-2019

శ్రీ‌కాకుళం వైసీపీలో గంద‌ర‌గోళం.. తింగ‌ర‌మేళం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శ్రీ‌కాకుళం జిల్లాలో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప‌రిస్థితి గంద‌రగోళంగా ఉంద‌ని జ‌నాలతో పాటు ఆ పార్టీ శ్రేణులే అనుకుంటున్నారు. మంత్రిగా ఉన్న ధ‌ర్మాన కృష్ణ‌దాస్, స్పీక‌ర్‌గా త‌మ్మినేని సీతారాం త‌దిత‌రులు కేవ‌లం పార్టీలోని కొంద‌రి వారిగానే ఉంటున్నార‌ని, ముఖ్యంగా అధికారంలోకి వ‌చ్చి ఐదు నెల‌లు అవుతున్నా జిల్లాస్థాయి పార్టీ శ్రేణుల‌ను క‌లిపే ఏ ఒక్క‌ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌లేదు అని మిగ‌తా పార్టీ స‌భ్యులు చెప్పుకొస్తున్నారు.

ఇక్క‌డ త‌మ్మినేని సీతారాం స్పీక‌ర్‌గా ఎన్నికైన కార‌ణంగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ఎలానో దూరంగా ఉండాల్సిందే. అదే కోవ‌లో పార్టీ సీనియ‌ర్ నేత అయిన కృష్ణ‌దాస్ కూడా కేవ‌లం నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమిత‌మైపోతున్నార‌ని పార్టీ కార్య‌క‌ర్త‌లు, మిగిలిన నేత‌లు గుస‌గుస‌లాడుతున్నారు.

అలాగే పార్టీలోని మిగిలిన ఎమ్మెల్యేలు కూడా అంతంత‌మాత్రంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప‌ద‌వులు లేక‌పోవ‌డంతో పార్ల‌మెంట్ నియోజ‌కవ‌ర్గ స‌మ‌న్వ‌య కర్త  దువ్వాడ శ్రీ‌నివాస్ వైసీపీ ఇన్‌చార్జి కిల్లి కృపారాణి సైతం కార్య‌క‌ర్త‌ల‌ను స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం చేస్తున్న ప‌రిస్థితులు క‌న‌ప‌డ‌టం లేద‌ని వారు చెబుతున్నారు.  

ధ‌ర్మాన ప్ర‌సాద్‌రావు లాంటి సీనియ‌ర్ నాయ‌కులు ప‌దువులు లేక‌పోవ‌డంతో నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం కావ‌డంతో  సౌండ్ పూర్తిగా త‌గ్గించేశారు. మ‌రో మూడు నెల‌ల్లో పంచాయ‌తీ ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌ని, కొంత మంది సంబ‌ర‌ప‌డిపోతుంటే.. క్షేత్ర స్థాయిలో స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాక‌పోవ‌డంతో అధికార పార్టీకి చెందిన వారు ఏమ‌వుతుందో..? ఏమోన‌ని గుబులు చెందుతున్నారు.

ఈ నేప‌థ్యంలో మంత్రితోపాటు కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న నేత‌లు గ్రామీణ ప్రాంతాల్లో ప‌థ‌కాలు, స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప్ర‌త్యేకంగా చొర‌వ చూపించ‌క‌పోతే స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో ప‌రిస్థితులు తారుమారైనా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సింది లేదంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

రాష్ట్రంలోని ఇత‌ర జిల్లాల‌తోపాటు శ్రీ‌కాకుళంలోనూ వాలెంటీర్ల వ్య‌వ‌స్థ‌, నాణ్య‌మైన బియ్యం పంపిణీ, ఇసుక గంద‌ర‌గోళం వంటి స‌మ‌స్య‌ల్లో ఇంకా స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డంతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇరుకున‌ప‌డుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క్షాళ‌నే త‌ప్ప‌.. పురోగ‌తి క‌నిపించ‌డం లేద‌ని.. కొంత మంది ఎమ్మెల్యేలే లోలోపల మ‌ద‌న‌ప‌డిపోతున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ల్లో కొంద‌రు త‌మ‌కు ప‌ద‌వులు ఎప్పుడొస్తాయా.? అని ఎద‌రు చూస్తుంటే ఆల్రెడీ ప‌ద‌వులు ఉన్న‌వారు మాత్రం ఏదో అప్పుడ‌ప్పుడూ క‌నిపిస్తూ తామున్నామ‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇన్‌చార్జి మంత్రి ఇంత వ‌ర‌కు జిల్లాకు మొఖం ఎరుగ‌నూ లేదాయే.. ఇత‌ర మంత్రులు సైతం స‌మీక్ష‌లు చేయ‌నూ లేదు. దీంతో వ‌చ్చే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంటుందోన‌ని పార్టీ దిగువ‌స్థాయి నేత‌ల‌తోపాటు కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న చెందుతున్నారు. 

 

 

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ ఫోకస్. తెల్ల రేషన్ కార్డుదారులపై కేసులు

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ ఫోకస్. తెల్ల రేషన్ కార్డుదారులపై కేసులు

   an hour ago


పీసీసీపై అధిష్టానానికి సీనియర్ల లేఖ.. టార్గెట్ రేవంత్ రెడ్డే?

పీసీసీపై అధిష్టానానికి సీనియర్ల లేఖ.. టార్గెట్ రేవంత్ రెడ్డే?

   an hour ago


మండలి పరిణామాలపై ఛైర్మన్ షరీఫ్ మనస్తాపం?

మండలి పరిణామాలపై ఛైర్మన్ షరీఫ్ మనస్తాపం?

   an hour ago


కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా 93 మంది ఢీ... అసలేం జరుగుతోంది?

కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా 93 మంది ఢీ... అసలేం జరుగుతోంది?

   2 hours ago


బాలయ్యతో వైరల్ అవుతున్న రోజా సెల్ఫీ ఫోటోలు

బాలయ్యతో వైరల్ అవుతున్న రోజా సెల్ఫీ ఫోటోలు

   2 hours ago


సెలెక్ట్ కమిటీ అంటే ఏమిటి..? ఈ క‌మిటీ ఏం చేయ‌బోతోంది..?

సెలెక్ట్ కమిటీ అంటే ఏమిటి..? ఈ క‌మిటీ ఏం చేయ‌బోతోంది..?

   2 hours ago


నిత్యానందకు చుక్కలు కనిపించనున్నాయా?

నిత్యానందకు చుక్కలు కనిపించనున్నాయా?

   5 hours ago


దేవుళ్ళకీ పౌరసత్వం కావాలి.. చిలుకూరు అర్చకుల డిమాండ్!

దేవుళ్ళకీ పౌరసత్వం కావాలి.. చిలుకూరు అర్చకుల డిమాండ్!

   6 hours ago


లోకేష్ ట్వీట్... ఇది బాబు మార్కు ‘సెలెక్ట్’ అంటూ జగన్ పై వ్యంగ్యాస్త్రాలు

లోకేష్ ట్వీట్... ఇది బాబు మార్కు ‘సెలెక్ట్’ అంటూ జగన్ పై వ్యంగ్యాస్త్రాలు

   6 hours ago


మండలిలో ట్విస్ట్.. మూడునెలలు మూడురాజధానులకు బ్రేక్

మండలిలో ట్విస్ట్.. మూడునెలలు మూడురాజధానులకు బ్రేక్

   7 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle