newssting
BITING NEWS :
*కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష *విజయవాడ రానున్న ఏపీ కొత్త గవర్నర్ బి.బి హరిచందన్ *బీజేపీ పార్లమెంటరీ సమావేశం*బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ వివేక్* ఎర్రమంజిల్ భవనం కూల్చివేతే కేసుపై హైకోర్టులో విచారణ *ప్రారంభం కానున్న జపాన్ ఓపెన్ బ్యాట్మింటన్ టోర్నీ

శ్రీశారదాపీఠం ఉత్తరాధికారిగా కిరణ్ కుమార్ శర్మ

17-06-201917-06-2019 18:38:37 IST
Updated On 21-06-2019 15:48:51 ISTUpdated On 21-06-20192019-06-17T13:08:37.420Z17-06-2019 2019-06-17T13:08:35.721Z - 2019-06-21T10:18:51.425Z - 21-06-2019

శ్రీశారదాపీఠం ఉత్తరాధికారిగా కిరణ్ కుమార్ శర్మ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విజయవాడలో ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పర్యటించారు. శారదా పీఠం ఆధ్వర్యంలో ఉత్తరాధికారి సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ ముగింపు మహోత్సవం సోమవారం అట్టహాసంగా కొనసాగింది. ఈవేడుకకు జగన్, కేసీఆర్ హాజరయ్యారు. విశాఖలోని శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్‌శర్మ (కిరణ్‌ బాలస్వామి) సన్యాస స్వీకరణ మహోత్సవం మూడు రోజులుగా కొనసాగుతోంది.

సన్యాసాశ్రమ దీక్షను స్వీకరించిన కిరణ్‌కుమార్‌ శర్మకు స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం చేశారు. కృష్ణా నదీ తీరంలోని గణపతి సచ్చిదానంద ఆశ్రయంలో జరుగుతున్న ఈ మహోత్సవానికి వేలాదిమంది భక్తులు హాజరయ్యారు. శ్రీ స్వరూపానందస్వామి పాదాలకు స్వాత్మానందేంద్ర సరస్వతి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, స్వామి కిరణ్‌కుమార్‌ శర్మలకు ఇరువురు సీఎంలు వైఎస్‌ జగన్‌, కేసీఆర్‌ ఫలపుష్పాలు సమర్పించి.. ఆశీర్వాదం తీసుకున్నారు. స్వాత్మానందేంద్ర సరస్వతికి జగన్‌, కేసీఆర్‌ కిరీటధారణ చేశారు. ఇద్దరు సీఎంలు స్వామి స్వరూపాందస్వామి అంటే వల్లమాలిన గౌరవం. ఏపీ సీఎం జగన్ ఈమధ్యే స్వామివారి ఆశీస్సులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ స్వామి వారి ఆశీస్సులతో రెండోమారు సీఎం అయ్యారు. ఆయన చెప్పినట్టే యాగాలు కూడా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించేందుకు విజయవాడ వచ్చిన కేసీఆర్..ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కలిసి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle