newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

శ్రీవారి సేవ‌కు వారే దొరికారా..?

21-09-201921-09-2019 11:19:47 IST
Updated On 21-09-2019 11:26:48 ISTUpdated On 21-09-20192019-09-21T05:49:47.367Z21-09-2019 2019-09-21T05:48:35.427Z - 2019-09-21T05:56:48.751Z - 21-09-2019

శ్రీవారి సేవ‌కు వారే దొరికారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అస‌లే తిరుమ‌ల తిరుప‌తి పాల‌క మండ‌లి అనేక వివాదాల‌కు నెల‌వు లాంటిది. ముఖ్యంగా టీటీడీ బోర్డులో సభ్యులుగా నియ‌మితుల‌య్యే వారిపై వివాదాలు రేగుతూ ఉంటాయి. ఏ ప్ర‌భుత్వం ఉన్నా ఈ విష‌యంలో మాత్రం మార్పు ఉండ‌దు. అయితే, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్రం ఈ వివాదాల‌ను మ‌రింత పెంచారు. స‌భ్యుల సంఖ్య‌ను పెంచి జంబో పాల‌క మండ‌లిని వేసిన ఆయ‌న తాజాగా మ‌రో ఏడుగురిని ప్ర‌త్యేక ఆహ్వానితులుగా నియ‌మించారు.

ఇలా నియ‌మ‌కాలే ఇప్పుడు వివాదాస్ప‌దంగా ఉన్నాయి. సంప‌న్నుల‌కే బోర్డులో స్థానం క‌ల్పించిన జ‌గ‌న్ కొంద‌రు వివాదాస్ప‌ద వ్య‌క్తుల‌కు కూడా ఛాన్స్ ఇచ్చారు. టీటీడీ బోర్డు ఏర్పాటు స‌మ‌యంలో అన్ని స్థాయిల నుంచి అనేక ఒత్తిళ్లు ఉంటాయి. ఈ ఒత్తిళ్ల‌కు జ‌గ‌న్ ఎక్కువగానే త‌లొంచిన‌ట్లు క‌నిపిస్తోంది. అందుకే ఓ సంద‌ర్భంలో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ సులువ‌గా చేయ‌గ‌లిగాన‌ని, టీటీడీ బోర్డు స‌భ్యుల నియామ‌కం మాత్రం క‌ష్టంగా మారింద‌ని స్వ‌యంగా జ‌గ‌న్ చెప్పారంటే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు.

టీటీడీ బోర్డు స‌భ్యులుగా సామాన్యుల‌కు అవ‌కాశం లభించడానికి అవ‌కాశమే లేకుండా మార్చేశారు పాల‌కులు. ఇప్పుడు అంతా సంప‌న్నుల‌కే ఇందులో అవ‌కాశం ఇచ్చేస్తున్నారు. అయితే, సంప‌న్నులైనా వివాదాలు లేని వారికి ఇస్తే బాగుండేది. కానీ, జ‌గ‌న్ ఛాన్స్ ఇచ్చిన వారిలో ప‌లు ఆరోప‌ణ‌లు ఎదుర్కున్న వారు ఉన్నారు. ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాస్‌కు జ‌గ‌న్ ఛాన్స్ ఇచ్చారు. ఇంత‌కుముందు వైఎస్ హ‌యాంలోనూ ఆయ‌న టీటీడీ బోర్డు స‌భ్యుడిగా ప‌నిచేశారు.

జ‌గ‌న్ ఆస్తుల కేసులో శ్రీనివాస‌న్ కూడా ఆరోప‌ణ‌లు ఎదుర్కున్నారు. అప్ప‌టి వైఎస్ ప్ర‌భుత్వం నుంచి ల‌బ్ధి పొంది ప్ర‌తిఫ‌లంగా జ‌గ‌న్ సంస్థ‌ల్లో పెట్టుబ‌డులు పెట్టార‌నేది ఆయ‌న ఆరోప‌ణ‌. కోర్టుల‌కు తిరుగుతున్నారు. అటువంటి వ్య‌క్తికి జ‌గ‌న్ ఛాన్స్ ఇచ్చారు. కేవ‌లం త‌న‌కు స‌న్నిహితుడు కావ‌డం వ‌ల్లే ఈ అవ‌కాశం ఇచ్చిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఇక‌, ప్ర‌త్యేక ఆహ్వానితులుగా ఏడుగురిని నియ‌మించ‌గా అందులో చెన్నైకు చెందిన శేఖ‌ర్ రెడ్డిని నియ‌మించారు. ఈయ‌న చంద్ర‌బాబు హ‌యాంలోనే టీటీడీ బోర్డు స‌భ్యుడిగా కొన‌సాగారు. పెద్ద నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌నేది ఆయ‌న‌పై ఆరోప‌ణ‌. అప్పట్లో వైసీపీ ఆయ‌న‌పై, చంద్ర‌బాబు స‌ర్కార్‌పై పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేసింది. శేఖ‌ర్ రెడ్డి అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు బినామీ అని కూడా ఆరోపించింది. కానీ, ఇప్పుడు అదే శేఖ‌ర్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు జ‌గ‌న్‌. అయితే, టీటీడీ చెన్నై స్థానిక స‌ల‌హా క‌మిటీ అధ్య‌క్షుడిగా ఉన్నందునే ఆయ‌న‌కు ఛాన్స్ ఇచ్చిన‌ట్లు వైసీపీ వ‌ర్గాలు చెప్పుకుంటున్నా శేఖ‌ర్ రెడ్డిపై ఉన్న ఆరోప‌ణ‌ల దృష్ట్యా అది వివాదాస్ప‌దం అవుతోంది.

అస‌లే హిందూ మ‌తం విష‌యంలో జ‌గ‌న్ ఎక్క‌డ త‌ప్పు చేస్తాడా అని భార‌తీయ జ‌న‌తా పార్టీ, టీడీపీ ఎదురుచూస్తోంది. ఇటీవ‌ల తిరుమ‌ల ఆల‌యానికి సంబంధించి సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారం కూడా పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. హిందువైనా టీటీడీ ఛైర్మ‌న్‌ను క్రిస్టియ‌న్‌గా చెబుతూ జాతీయ స్థాయిలో దుష్ప్ర‌చారం జ‌రిగింది. తిరుమ‌ల కొండ‌ల్లో చ‌ర్చి క‌ట్టార‌నే అవాస్త‌వ‌మూ బాగా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. దీంతో మ‌రింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన జ‌గ‌న్‌.. త‌నంత‌ట తానే ఆరోప‌ణ‌లు ఉన్న వారికి బోర్డులో అవ‌కాశం ఇచ్చి వివాదాలు కొనితెచ్చుకున్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle