newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

శ్రీవారి సేవా..? మీవారి సేవా..? వైవీ వైఖరిపై విమర్శల వెల్లువ-2

17-07-201917-07-2019 07:53:31 IST
Updated On 17-07-2019 07:56:03 ISTUpdated On 17-07-20192019-07-17T02:23:31.482Z17-07-2019 2019-07-17T02:23:28.252Z - 2019-07-17T02:26:03.883Z - 17-07-2019

శ్రీవారి సేవా..?  మీవారి సేవా..? వైవీ వైఖరిపై విమర్శల వెల్లువ-2
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
(మొదటి భాగం తరువాయి)

శ్రీవారి సొమ్మును ఖర్చు పెట్టడంలో పారదర్శకత పాటించాల్సిన ధర్మకర్తల మండలి తన సొంత అవసరాల కోసం డబ్బును వృధా చేయడం తగదని ఇటు జనం నుంచి వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి.

టీటీడీ ధర్మకర్తల మండలిలో పనిచేసే వారు తమ పదవీ కాలంలో తిరుమలలో వున్న ఖరీదైన అతిధి భవనాలను సొంత అవసరాలకు సంవత్సరాల తరబడి ఉంచేసుకుంటున్నారనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. ధర్మకర్తల మండలి సమావేశాల సమయంలో మాత్రమే చైర్మన్, సభ్యులకు ఉచిత వసతి ఏర్పాటు చేసేలా జగన్ ప్రభుత్వం ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలని ఈ సందర్భంగా పలువురు కోరుతున్నారు. 

తిరుమల కొండపై రెండు సంవత్సరాల పాటు తిష్ట వేసి అద్దె రూపంలో లక్షలాది రూపాయలు వెంకన్న ఆదాయానికి గండి కొట్టడం సబబు కాదని వారి అభిప్రాయం. ‘సొమ్ము వెంకన్నది.. సోకు ధర్మకర్తల మండలిది’ అంటూ పత్రికలు పదేపదే రాస్తున్నా అది అరణ్యరోదనే అవుతోంది. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశాలను అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండే తిరుపతిలో గల దేవస్థానం పరిపాలనా భవనంలోనే నిర్వహించాలని, ఇలాంటి కొన్ని దుబారా ఖర్చులకు స్వస్తి పలకాలని ధార్మిక సంస్థలు ఎంతోకాలంగా చెబుతూనే ఉన్నాయి.

ధర్మకర్తల మండలి సభ్యులు కేవలం సమావేశాలు  జరిగే సమయంలో మాత్రమే తిరుమల కొండకు వచ్చి భక్తుల సౌకర్యాల కోసం నిర్ణయాలు తీసుకొని తిరిగి స్వస్థలాలకు వెళ్ళే సంప్రదాయం గతంలో ఉండేది. వారి దృష్టిలో పాలక మండలిలో భాగస్వామ్యం అంటే భగవంతుడి సేవ మాత్రమే. టీటీడీలోని ఐఏఎస్ అధికారులకు తిరుపతి, తిరుమలలో ఏ విధంగా శాశ్వత నివాస గృహాలు, క్యాంపు కార్యాలయాలు ఉన్నాయో అదే తరహాలో టీటీడీ బోర్డ్ సభ్యులు, అధ్యక్షుడికి కూడా అలిపిరి దగ్గర శాశ్వత భవన నిర్మాణం చేపట్టాలని, భవిష్యత్తులో ఎవరు కొత్తగా వచ్చినా అక్కడ నిర్మించే భవనంలో మాత్రమే బస ఏర్పాటు చేసేలా ధర్మకర్తల మండలిలో శాశ్వత తీర్మానం చేయాలని ఒక డిమాండ్ వినిపిస్తోంది. 

భక్తుల కోసమే తాడేపల్లి తరలివచ్చా : సుబ్బారెడ్డి

తాడేపల్లిలో క్యాంపు కార్యాలయం ఏర్పాటుపై వివాదాలు రాజుకున్న నేపథ్యంలో టీటీడీ బోర్డ్ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఒక వివరణ ఇచ్చారు. కేవలం భక్తుల సౌకర్యార్ధమే తాడేపల్లిలో క్యాంప్ ఆఫీస్‌ను నిర్వహిస్తున్నట్టు సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

వైవీ వివరణపై టీటీడీ హయాంలో  ధర్మకర్తల మండలి సభ్యుడిగా పనిచేసిన ఏవీ రమణ తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేశారు. టీటీడీని సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఇప్పుడు తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి తీసుకున్న దుబారా నిర్ణయంపై ఏం సమాధానం చెబుతారని ట్విట్టర్ వేదికగా రమణ నిలదీశారు. 

శ్రీవారి సేవలో ఉండాల్సిన టీటీడీ బోర్డ్ ఛైర్మన్‌కు అసలు తాడేపల్లిలో పనేమిటో.. అక్కడ అదనపు సిబ్బందితో కూడిన కార్యాలయం ఏర్పాటు ఎందుకో అర్థం కావడం లేదని రమణ వ్యాఖ్యానం. తిరుమలలో ఉండాల్సిన టీటీడీ బోర్డ్ చైర్మన్ తాడేపల్లిలోనే వుండిపోయి ఇక్కడి నుంచే ఇక శ్రీవారి సేవలు నడిపిస్తానంటారేమోనని ఆయన వ్యంగ్య బాణాలు విసిరారు. 

ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 రద్దు..

ఇలావుంటే, ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ బోర్డ్ చైర్మన్‌ సుబ్బారెడ్డి ఆదేశాలు జారీ చేయడం కూడా మరో వివాదాన్ని రాజేసింది. గతంలో వైఎస్ తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పని తెలుసుకుని ఆయన సుపుత్రుడు జగన్ వాటిని వెనక్కి తీసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలన్నీ వైఎస్ హయాంలో ప్రవేశ పెట్టినవేనని, ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం గతంలో చేసిన పొరబాటును అంగీకరించడమేనని వారంటున్నారు. తిరుమలలో వీఐపీ దర్శనాలు చంద్రబాబు హయాంలో ప్రవేశ పెట్టినట్టుగా వైవీసీ నేతలు కలరింగ్ ఇవ్వడం ఇకనైనా మానుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు.

శ్రీవారి సేవా..? మీవారి సేవా..? వైవీ వైఖరిపై విమర్శల వెల్లువ-1


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle