newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

శ్రీవారి సేవా..? మీవారి సేవా..? వైవీ వైఖరిపై విమర్శల వెల్లువ-1

17-07-201917-07-2019 07:45:56 IST
Updated On 17-07-2019 07:55:31 ISTUpdated On 17-07-20192019-07-17T02:15:56.347Z17-07-2019 2019-07-17T02:14:42.983Z - 2019-07-17T02:25:31.829Z - 17-07-2019

శ్రీవారి సేవా..?  మీవారి సేవా..? వైవీ వైఖరిపై విమర్శల వెల్లువ-1
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి 48వ అధ్యక్షుడిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి తాడేపల్లిలో తన కోసం ప్రత్యేకంగా ఒక క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. తిరుమల లేదా తిరుపతిలో ఉండాల్సిన టీటీడీ బోర్డు చైర్మన్ రాజధానిలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవాలని అనుకోవడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ధార్మిక సంస్థలు తప్పుబడుతున్నాయి. 

టీటీడీ చరిత్రలో ఇప్పటి వరకు ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా పనిచేసిన వారందరూ తిరుమలలోని దేవస్థానానికి చెందిన పరిపాలనా భవనంలోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. వారి బాటలోనే వైవీ సుబ్బారెడ్డి కూడా కొండపైన టీటీడీ పరిపాలనా భవనంలో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ కోసం ఇప్పటికే 21 మంది సిబ్బంది వివిధ హోదాలలో పనిచేస్తున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాక వైవీ తిరుమలలో కంటే ఇతర ప్రాంతాల్లోనే ఎక్కువగా కాలం గడుపుతున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రికి అందుబాటు దూరంలో రాజధానిలోనే ఉంటున్నారు. 

తాజాగా రాజధాని ప్రాంతంలో గల తాడేపల్లి పట్టణంలో కొత్తగా తన కోసం క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇది ప్రైవేటుగా ఏర్పాటు చేసుకునే వ్యవహారమైతే అందరి దృష్టికీ వెళ్లేదే కాదు. దీనిపై టీటీడీకి స్పష్టమైన ఆదేశాలు వెళ్లడం వల్లే విషయం వివాదాస్పదమైంది. తాడేపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసే కార్యాలయంలో తనకు మరో అరడజను మంది సిబ్బంది కావాలని వైవీ కోరినట్టుగా సమాచారం. సిబ్బందితో పాటు తన కార్యాలయానికి తగిన ఫర్నిచర్ సమకూర్చాలని ఆదేశాలు వెళ్లినట్టు చెబుతున్నారు. అధ్యక్షుల వారి ఆదేశాలతో ఆగమేఘాల మీద ఏర్పాట్లు జరిగి పోతున్నాయి. వీటన్నింటికీ శ్రీవారి ఖాతా నుంచే సొమ్ము కేటాయించాల్సి ఉంటుంది. 

తాడేపల్లిలో టీటీడీ బోర్డు చైర్మన్ కోసం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయాల్సిన అవసరం అసలు ఏముందని కొన్ని ధార్మిక సంస్థలు, విపక్షాలు అధికారులను ప్రశ్నించడంతో వివాదం రాజుకుంది. వైవీ ఇప్పుడు తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకుంటే రానున్న కాలంలో కొత్తగా అధ్యక్షులయ్యేవారు కూడా వారి వారి సొంత ప్రాంతాలలో క్యాంపాఫీసులు కావాలని అడుగుతారని, చివరికి ఇదొక సంప్రదాయంగా మారే ప్రమాదం కూడా ఉందని టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగులు విమర్శిస్తున్నారు.

తిరుమలకు ఇంత దూరంలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరం అసలు ఏమందని వారి ప్రశ్న. ఇది శ్రీవారి ఖజానాపై అదనపు ఆర్థిక భారం మోపడమేనని విమర్శ. వైవీ తీసుకున్న నిర్ణయంపై ఇటు సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. టీటీడీని సొంత ఖజానాగా భావించి ఎడాపెడా ఖర్చులు చేస్తే గతంలో కొందరికి పట్టిన గతే పట్టక తప్పదని హెచ్చరిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. 

తిరుమల కార్యాలయానికి లక్షలతో రిపేర్లు

తిరుమలలో ఉన్న వైవి సుబ్బారెడ్డి క్యాంపు కార్యాలయానికి లక్షలాది రూపాయిలు ఖర్చుచేసి మరమ్మతులు చేపట్టడానికి ఇప్పటికే టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు కార్య ప్రణాళికను సిద్ధం చేసినట్టు వార్తలొస్తున్నాయి. అంత ఖర్చు పెట్టి అక్కడ రిపేర్లు జరిపిస్తుంటే ఇక్కడ కొత్తగా మరో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకోవడం సరైన చర్య కాదని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. టీటీడీ నిధులను సామాన్య భక్తుల కోసం ఖర్చు చేయాలే తప్ప స్వప్రయోజనాల కోసం వినియోగించడం సమంజసమా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది.  (ఇంకా ఉంది)

శ్రీవారి సేవా..? మీవారి సేవా..? వైవీ వైఖరిపై విమర్శల వెల్లువ-2


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle