newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

'శ్రీవారి ప్రతిష్ట'తో రాజకీయ పార్టీల చెలగాటం..!

09-11-201909-11-2019 16:53:27 IST
2019-11-09T11:23:27.615Z09-11-2019 2019-11-09T11:23:22.935Z - - 20-02-2020

'శ్రీవారి ప్రతిష్ట'తో రాజకీయ పార్టీల చెలగాటం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మన దేశంలో రాజకీయ పార్టీలు అన్నాక విమర్శలు సహజం.. ఒకరిపై ఒకరు ఎత్తులు వేయడం.. మరొకరు చిత్తు చేయాలని తిరిగి సరికొత్త ఎత్తులు వేయడం అన్నీ సహజమే. ప్రజాసేవ.. ఛరిస్మా.. డబ్బు.. రాజకీయం కలిస్తేనే ఈనాటి రాజకీయాలలో మనుగడ అన్నది ప్రస్తుత రాజకీయాలలో అందరికి విదితమే. అయితే ఒక్కోసారి ఈ రాజకీయ పార్టీలు ప్రజలను.. కులాలను.. మతాలను మించి ఏకంగా ఆ దేవుడినే రాజకీయాల కోసం వాడుకుంటున్నారా? అనిపించడమే ఆందోళన కలిగిస్తుంది.

ఆ ఏడుకొండలపై నెలకొన్న తిరుమల తిరుపతి శ్రీవారిపై అఖండకోటి భక్తులకు ప్రగాఢ నమ్మకం ఉంటుంది. రాష్ట్రం.. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయన దర్శనం కోసం క్యూ కడతారు. టీటీడీకి ఆధ్యాత్మికంగానే కాకుండా ప్రపంచ పర్యాటక ప్రాంతాలలో కూడా ఓ ప్రత్యేకత ఉంటుంది. ఒక్క మాటగా  చెప్పాలంటే ఆ వేంకటేశ్వరుడు ప్రపంచంలోనే ఓ బ్రాండ్. ఆయనతో పోలికలేదు... ఇకపై రాదు అన్నది ఎందరో నమ్మకం. ఆయన కొలువై ఉండడమే ఏపీకి గర్వకారణం.

అలాంటి తిరుమలేశుడిని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారన్నది విశ్లేషకుల అభిప్రాయం. 'టీటీడీ-రమణదీక్షితులు-చంద్రబాబు' ఈ ఎపిసోడ్ లో ఎవరు ఎవరిని టార్గెట్ చేశారు అన్నది ప్రస్తుతానికి అవసరంలేని విషయమే కానీ.. అప్పటి వరకు ప్రధాన అర్చకులుగా ఉన్న రమణ దీక్షితులు చంద్రబాబు మీద ఆరోపణలు చేసేందుకు గాను పొరుగు రాష్ట్రంలోని చెన్నైకి వెళ్లి నేషనల్ మీడియా నుండి లోకల్ మీడియా వరకు అందరినీ పిలిచి టీటీడీలో పెద్ద ఎత్తున అవినీతి అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

శ్రీవారి పోటులో తవ్వకాలు జరిపి నిధులను మాయం చేశారని.. శ్రీవారి ఆభరణాలలో పింక్ డైమాండ్ దేశం దాటిపోయిందని, ఏడుకొండలవాడికి పూజా కైంకర్యాలు సరిగ్గా జరగడం లేదని సంచలన ఆరోపణలు చేశారు. రమణ దీక్షితులు గారి టార్గెట్ అప్పటి టీడీపీ ప్రభుత్వం పైనే అయినా ఆరోపణలు చేసింది ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానంపైన అన్నది ఇక్కడ మరచిన విషయం. అప్పటి ఆ ఆరోపణలు రాజకీయాలలోనే కాకుండా యావత్ దేశం మొత్తం మీద చర్చ మొదలైంది.

అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ.. అనుబంధ పత్రికలు కలిసి చంద్రబాబు ఇంట్లో తవ్వకాలు జరిపితే బండారం బయటపడుతుంది అంటూ ప్రజలలో కథనాలను ప్రచారం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఈ ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకించగా టీటీడీ అయితే ఆరోపణలు చేసిన రమణదీక్షితులు, వైసీపీ నేత విజయసాయిరెడ్డిలపై చెరో వంద కోట్లకు పరువు నష్టం దాఖలు చేసింది. అక్కడ సీన్ కట్ చేస్తే ఈలోగా ఎన్నికలు వచ్చాయి ప్రభుత్వంతో పాటు పాలకమండలి కూడా మారిపోయింది.

గతంలో ప్రతిపక్షంలో ఉన్న ఆరోపణల సంగతి ఏంటి అని ఇప్పటి ప్రభుత్వాన్ని.. పాలకమండలిని అడిగితే.. పోటులో తవ్వకాలకు అవకాశమే లేదని.. అసలు పింక్ డైమండ్ అన్నదే లేదని.. పూజా కైంకర్యాల వ్యవహారంలో టీటీడీ ఎక్కడా కాంప్రమైజ్ కాదని సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నాయి. ఇక పాలకమండలి అంతా ఆ పార్టీవల్లే కనుక గతంలో టీటీడీ రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డిలపైన దాఖలు చేసిన పరువు నష్టం కేసులను కూడా త్వరలోనే వెనక్కు తీసుకోవాలని నిర్ణయించింది.

మొత్తం పరిశీలిస్తే అర్ధమయ్యేది ఒక్కటే ఆ ఏడుకొండలవాడి చుట్టూ చేసింది రాజకీయమేనని.. ఆయనను అడ్డు పెట్టుకొని ఒకరిపై మరొకరు బురదజల్లుకున్నారని. మరి ఆ తిరుమలేశుని ప్రాణంగా కొలిచే భక్తుల మనోవేదన.. ఆ దేవదేవుడికి రాజకీయాలను పులిమేశారనే అపవాదులు ఈ నేతలకు.. రాజకీయ పార్టీలకు పట్టవా? తమ తమ రాజకీయాల కోసం.. పదవుల కోసం.. కుర్చీ కోసం ఆ వెంకన్నపై నమ్మకాన్ని తాకట్టు పెట్టేస్తారా? ఏడుకొండవాడా.. వెంకటరమణ.. ఒక్కసారి కళ్ళు తెరచి చూడయా!!

 

 

టీడీపీ కొత్త సవాల్.. సీఎంకు ఆ దేశాలకు వెళ్లే దమ్ముందా?

టీడీపీ కొత్త సవాల్.. సీఎంకు ఆ దేశాలకు వెళ్లే దమ్ముందా?

   10 hours ago


చంద్రబాబు భద్రతపై డీజీపీ వివరణ

చంద్రబాబు భద్రతపై డీజీపీ వివరణ

   12 hours ago


ఏపీలో ఠారెత్తిస్తున్న ఏసీబీ దాడులు..అధికారుల్లో వణుకు

ఏపీలో ఠారెత్తిస్తున్న ఏసీబీ దాడులు..అధికారుల్లో వణుకు

   12 hours ago


సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్ర-రాష్ట్ర మంత్రుల మాటల యుద్ధం!

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్ర-రాష్ట్ర మంత్రుల మాటల యుద్ధం!

   13 hours ago


నాదెండ్లదీ అదే దారా? పీకేకి షాక్ తప్పదా?

నాదెండ్లదీ అదే దారా? పీకేకి షాక్ తప్పదా?

   13 hours ago


కర్నూలుకు వెళ్లి చేసిందేంటి జగన్ గారూ!.. లోకేష్ రియాక్షన్

కర్నూలుకు వెళ్లి చేసిందేంటి జగన్ గారూ!.. లోకేష్ రియాక్షన్

   13 hours ago


‘‘ఇది రద్దులు, వేధింపుల ప్రభుత్వం’’

‘‘ఇది రద్దులు, వేధింపుల ప్రభుత్వం’’

   13 hours ago


తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉండటమే వివక్షా..  పీయూష్ గోయల్‌ ప్రశ్న

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉండటమే వివక్షా.. పీయూష్ గోయల్‌ ప్రశ్న

   15 hours ago


నితీష్-బీజేపీ మైత్రిపై పీకే ఘాటు వ్యాఖ్యలు

నితీష్-బీజేపీ మైత్రిపై పీకే ఘాటు వ్యాఖ్యలు

   17 hours ago


జేడీ అవుతారా ఏపీ కేజ్రీవాల్‌..?

జేడీ అవుతారా ఏపీ కేజ్రీవాల్‌..?

   17 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle