newssting
BITING NEWS :
తీవ్ర వివాదాల మధ్యనే పార్లమెంటులో ఆమోదం పొందిన రెండు వ్యవసాయ బిల్లులు. ఆదివారం రాజ్యసభ ఆమోదం పొందిన బిల్లులు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఇవి చట్టరూపం. ఈ బిల్లులు వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయని, రైతులకు ఇవి మరణ శాసనాలని పేర్కొంటూ ప్రతిపక్ష పార్టీల సభ్యులు రాజ్యసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేసినా వెనక్కు తగ్గని కేంద్రం * రాజ్యసభలో కొనసాగుతున్న దుమారం. విపక్షాల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించిన నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌పై అవిశ్వాస తీర్మానం. హరివంశ్‌పై అవిశ్వాస తీర్మానానికి ఆదివారం 12 విపక్ష పార్టీలు నోటీసు. ప్రజాస్వామిక విలువలను, సంప్రదాయాలను హరివంశ్‌ తూట్లుపొడిచారాని కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ విమర్శ * అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరపన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న తమిలనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ ముందస్తు విడుదల కోసం మరోసారి ప్రయత్నాలు. శశికళ విడుదల కోసం అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌ ఢిల్లీకి పయనం. సుప్రీం కోర్టు న్యాయవాదులు, న్యాయనిపుణులతో చర్చలు * ఆరు నెలల తర్వాత సోమవారం ఉదయం సందర్శకుల కోసం తెరుచుకున్న ఆగ్రాలోని అంతర్జాతీయ చారిత్రక పర్యాటక కేంద్రం తాజ్‌మహల్‌. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ బారులు తీరిన సందర్శకులు. సోమవారం 160 మంది పర్యాటకులు ఆన్ లైన్ లో టికెట్లు కొనుగోలు. రెండు షిఫ్తుల్లో రెండు వేలమందికి అనుమతులు * మహారాష్ట్రలోని భీవండి నగరంలో తీవ్ర విషాదం. మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలి పది మంది మృతి, మరో 20 మందికి గాయాలు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు సమాచారం. పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముమ్మర సహాయక చర్యలు * నేటి నుండి హైకోర్టులో అమరావతి రైతులు, రైతు పరిరక్షణ సమితి, మాజీ ఎంఎల్‌ఏ శ్రవణ్ కుమార్ తదితరులు వేసిన పిటిషన్‌లపై రోజువారీ విచారణ. నేడు ధర్మాసనం ముందు లిస్ట్ అయిన 93 పిటిషన్‌లు విచారణ. ఆన్‌లైన్ ద్వారా రాజధానికి సంబంధించిన కేసులను విచారించనున్న ధర్మాసనం * నేటి నుండి అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనాల పునరుద్ధరణ. ఆలయ ప్రాంగణంలో దేవస్థానం పరిసర ప్రాంతాల్లో కరోనా కేసుల కారణంగా దర్శనాలు నిలిపివేయగా నేటి నుండి తిరిగి దర్శనాలు ప్రారంభం. సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్‌ వాడుతూ క్యూలైన్‌లో దర్శనం. పిల్లలకు, వృద్ధులకు ఆలయంలోకి నో ఎంట్రీ * భారీ వర్షాలతో పోటెత్తిన కృష్ణా, పెన్నా, తుంగభద్ర నదులకు వరద. పలు గ్రామాలు ముంపునకు గురవడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు. పలు గ్రామాల్లో వరదలలో చిక్కుకున్న 48 మంది రైతులు, వ్యవసాయ కూలీలు, రక్షించిన ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలు * కేంద్రం జారీ చేసిన కోవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యాశాఖ ఉత్తర్వులు. నేటి నుంచి 50 శాతం మంది టీచర్లు బడులకు హాజరు. సోమవారం నుంచి విద్యార్థులు లేకుండానే కొనసాగనున్న పాఠశాలలు * ఈశాన్య బంగా‌ళా‌ఖాతంలో ఆది‌వారం ఉదయం ఏర్పడిన అల్ప‌పీ‌డనం. సోమ‌వారానికి మ‌రింత బలపడి అను‌బం‌ధంగా 3.1 కి.మీ. నుంచి 7.6 కి.‌మీ. ఎత్తు‌వ‌రకు ఉప‌రి‌తల ఆవ‌ర్తనం. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం.

శ్రీవారి అస్తులకే ఎసరు.. అమ్మకానికి సిద్ధమైన టీటీడీ!

24-05-202024-05-2020 09:18:33 IST
Updated On 24-05-2020 12:37:50 ISTUpdated On 24-05-20202020-05-24T03:48:33.980Z24-05-2020 2020-05-24T03:48:31.818Z - 2020-05-24T07:07:50.981Z - 24-05-2020

శ్రీవారి అస్తులకే ఎసరు.. అమ్మకానికి సిద్ధమైన టీటీడీ!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకపక్క కూల్చివేతల పర్వం కొనసాగిస్తూనే మరోవైపు అమ్మకాల పర్వం కూడా మొదలుపెట్టింది. అటు ప్రజా వేదికతో మొదలైన కూల్చివేతలలో తాజాగా విజయనగరంలో మూడు లాంతర్ల స్థూపం వరకు కొనసాగిస్తూనే ఉంది. ఇక ఈ మధ్యనే బిల్డ్ ఏపీ పేరుతో అమ్మకాలను మొదలుపెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా ఆ ఏడుకొండలవాడి ఆస్తులకే ఎసరు పెట్టేసింది.

తమిళనాడులో వెంకన్నకున్న ఆస్తులలో 23 చోట్ల ఆస్తులను అమ్మెందుకు సిద్దమైన టీటీడీ పాలకమండలి అందుకోసం 8 కమిటీలు 2 టీంలను కూడా సిద్ధం చేసింది. తిరుమల శ్రీవారి ఆస్తులను బహిరంగ వేలంలో అమ్మేసేందుకు విక్రయ హక్కులను కూడా టీటీడీ అధికారులకు కట్టబెట్టేస్తూ పాలకమండలి నిర్ణయం తీసేసుకోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ప్రస్తుతం కరోనా దెబ్బకు ప్రభుత్వాలు ఆర్ధికంగా తల్లడిల్లిపోతున్న సంగతి తెలిసిందే. కానీ టీటీడీకి మాత్రం ఆ ప్రభావం ఉండనే ఉండదు. వెంకన్నకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తే ప్రసక్తే లేదు. ఎందుకంటే మరో ఆరునెలల పాటు లాక్ డౌన్ విధించినా శ్రీవారి కైంకర్యాలకు ఎలాంటి ఇబ్బంది లేదని స్వయంగా చైర్మనే చెప్పారు. మరి ఇప్పుడు ఈ ఆస్తుల అమ్మకానికి ఎందుకు పూనుకున్నట్లు?

అది కూడా లాక్ డౌన్ వేళలో పాలకమండలి ఈ నిర్ణయం తీసుకొని.. తీరా కమిటీలు, అమ్మకానికి బృందాలను సిద్ధం చేశాక విషయం వెలుగులోకి తెచ్చారు. బహుశా బహిరంగ వేలం అని పేరు పెట్టారు కనుకే ఇప్పుడైనా బయటపెట్టారేమోననే అనుమానాలు సహజంగానే వస్తున్నాయి. అయితే పేరుకే బహిరంగ వేలం అని చెప్పినా ఆ ఆస్తులు మాత్రం తమ బినామీలకు వెళ్తాయని రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

అయితే ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులు లేవు.. ఒకవేళ నిజంగా ఇబ్బందులే వచ్చినా ఒక్క ప్రకటన చాలు.. దేశవ్యాప్తంగా బస్తాలలో విరాళాలు ఇచ్చే బడా భక్తులు అయన సొంతం. అది ఆయన రేంజ్. మరి ప్రభుత్వం ఆస్తుల అమ్మకం ఏంటి అసలు. ఇదే ఇప్పుడు ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇటు టీడీపీ, అటు బీజేపీ-జనసేన నేతలు ఏడుకొండలను కూడా అమ్మేస్తారా? అంటూ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.

గతంలో అదే తమిళనాడులో ఎలాంటి పత్రాలు లేని, కోర్టు కేసులలో ఉన్న అమరావతి ఆలయానికి చెందిన సదావర్తి సత్రం భూములను.. కొన్న వారే కేసులను కూడా భరించాలనే ఒప్పందంతో టీడీపీ ప్రభుత్వంలో అమ్మాలనుకుంటే.. ఇదే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ కోర్టుకెళ్లి అమ్మకాన్ని నిలిపివేశారు. ఇప్పటికీ ఆ ఆస్తులకు సంబంధించి కోర్టు ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. కానీ ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి నియమించిన పాలకమండలి ఏకంగా టీటీడీ నిఖార్సైన ఆస్తులనే అమ్మకానికి పెట్టేస్తుంది.

ఒకపక్క అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డును బహిరంగ మార్కెట్లో దుకాణాలలో అమ్మేసేందుకు సిద్దమైన ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా శ్రీవారి ఆస్తులను అమ్మెందుకు సిద్ధపడడంతో ప్రతిపక్షాలు ఈ పాలన ఎటు వెళ్తుందో అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి ఇప్పుడు అమ్మాలనుకుంటున్న ఆస్తులు.. పూర్వకాలంలో రాజులు, కొందరు భక్తులు ఆ శ్రీవారికి ఇచ్చిన కానుకలు.

మరి భక్తుల కానుకలను అమ్మేసుకోవడం అంటే వారి మనోభావాలను దెబ్బతీయడమే కాదు.. కానుకలను అమ్మేసుకున్న దేవుడిగా అయనకూ చెడ్డపేరే. ఇప్పటికే దాతలు ఇచ్చిన ప్రభుత్వ భూములను అమ్మెందుకు సిద్దమైన ప్రభుత్వం.. భక్తులు ఇచ్చిన కానుకలను అయినా వదిలిపెడితే అటు ప్రభుత్వానికి.. ఇటు రాష్ట్రానికి క్షేమమని విశ్లేషకుల అభిప్రాయం. ఒకవేళ మొండిగా ప్రభుత్వం ముందుకెళ్లినా కోర్టులు.. వివాదాలు.. అక్షింతలు.. మొట్టికాయలు షరామామూలే. లేదు మాకు అవే కావాలి అంటారా యూ కెన్ ప్రొసీడ్!

 

 

బడా రైతులు, భూస్వాముల దోపిడీకి చట్టబద్ధత- అగ్రో బిల్లులు

బడా రైతులు, భూస్వాముల దోపిడీకి చట్టబద్ధత- అగ్రో బిల్లులు

   3 hours ago


ఆగ్రో బిల్లు..రైతులకే కాదు...రాష్ట్రాలకూ శాపమే!

ఆగ్రో బిల్లు..రైతులకే కాదు...రాష్ట్రాలకూ శాపమే!

   3 hours ago


స్టేటస్ సింబల్ గా పులస.. రూ.21 వేలకు పులస దక్కించుకున్న వైసీపీ నేత

స్టేటస్ సింబల్ గా పులస.. రూ.21 వేలకు పులస దక్కించుకున్న వైసీపీ నేత

   3 hours ago


భారీ విధ్వంసం సృష్టించనున్న మావోయిస్టులు.. వరంగల్ లో హై అలర్ట్

భారీ విధ్వంసం సృష్టించనున్న మావోయిస్టులు.. వరంగల్ లో హై అలర్ట్

   4 hours ago


బీజేపీకి అండగా వైసీపీ.. ఎలాంటి మొహమాటల్లేవు!

బీజేపీకి అండగా వైసీపీ.. ఎలాంటి మొహమాటల్లేవు!

   6 hours ago


ఏపీ పోలీస్ సేవ.. ఫిర్యాదులు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వెళ్లనక్కర్లేదు

ఏపీ పోలీస్ సేవ.. ఫిర్యాదులు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వెళ్లనక్కర్లేదు

   8 hours ago


కేంద్రానికి వ్యతిరేకంగా కేసీఆర్.. తదుపరి వ్యూహమేంటి?

కేంద్రానికి వ్యతిరేకంగా కేసీఆర్.. తదుపరి వ్యూహమేంటి?

   8 hours ago


ప్రైవేటు ఏజెన్సీలకు ధీటుగా టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు

ప్రైవేటు ఏజెన్సీలకు ధీటుగా టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు

   8 hours ago


వైద్యులపై దాడి చేస్తే కఠిన శిక్షలు.. జరిమానాలు

వైద్యులపై దాడి చేస్తే కఠిన శిక్షలు.. జరిమానాలు

   20-09-2020


కేంద్రం తీరు కూటమి ధర్మానికి చేటు!

కేంద్రం తీరు కూటమి ధర్మానికి చేటు!

   20-09-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle