newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

శ్రీలక్ష్మి కల నెరవేరుతుందా? అమిత్ షా హామీ ఇచ్చారా?

24-07-201924-07-2019 08:34:15 IST
Updated On 24-07-2019 11:02:28 ISTUpdated On 24-07-20192019-07-24T03:04:15.380Z24-07-2019 2019-07-24T03:04:12.038Z - 2019-07-24T05:32:28.398Z - 24-07-2019

శ్రీలక్ష్మి కల నెరవేరుతుందా? అమిత్ షా హామీ ఇచ్చారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో జగన్ సీఎం అయ్యాక.. అక్కడ పనిచేసేందుకు అనేకమంది ఐఎఎస్. ఐపీఎస్ అధికారులు ముందుకు వస్తున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మి పనిచేశారు.

వైఎస్ మరణానంతరం ఓ కేసులో ఆమె జైలుకి కూడా వెళ్లి వచ్చారు. గనుల లీజు వ్యవహారంలో ఆమెపై ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆమెను రిమాండ్‌కు తరలించారు. అయితే, ఈ కేసులో ఆమెకు క్లీన్‌చిట్‌ వచ్చింది. తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఏపీలో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. 

రాష్ట్ర విభజనలో ఆమె తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన పదవిలోకి వెళ్లారు. ఈనేపథ్యంలోనే వైయస్‌ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో ఆమె వైయస్‌ తనయుడి ప్రభుత్వంలో పనిచేసేందుకు ఉత్సుకత చూపుతున్నట్లు సమాచారం.

ఇందులో భాగం గానే ఆమె ఏపీకి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. తాజాగా ఆమె చూపు ఏపీ వైపు పడింది. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం చేసిన తర్వాత ఆయనతో ఆమె భేటీ అయ్యారు. ఏపీలో పని చేస్తానని ఆమె చెప్పారు.

సీఎం జగన్ కూడా ఆమె పనిచేసేందుకు అంగీకరించారు.  ఈ మేరకు ఏపీ క్యాడర్‌ బదలాయించేందుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. కానీ ఈ విషయమై కేంద్రం నుండి స్పందన రాలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని  ఆమె తలపెట్టారు.

వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చొరవతో ఐఎఎస్ శ్రీలక్ష్మి పార్లమెంట్ లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. 

ఈమె ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వరంగ సంస్థల ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. తెలంగాణ కేడర్ నుండి తనను ఏపీ కేడర్‌కు బదిలీ చేయాలని కోరారు.

డీఓపీటీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉంటున్నందున ఐఎఎస్ శ్రీలక్ష్మి  అమిత్ షా ను కలిశారు. మరి అమిత్ షా తన పలుకుబడితో శ్రీలక్ష్మిని ఏపీకి పంపేందుకు ప్రయత్నిస్తారా? 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle