newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

శ్రీభరత్‌కు బాబు షాక్...వైజాగ్ సీటు డౌటే!

06-03-201906-03-2019 07:01:51 IST
Updated On 06-03-2019 13:22:06 ISTUpdated On 06-03-20192019-03-06T01:31:51.610Z06-03-2019 2019-03-06T01:31:45.031Z - 2019-03-06T07:52:06.641Z - 06-03-2019

శ్రీభరత్‌కు బాబు షాక్...వైజాగ్ సీటు డౌటే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నికలు ‌సమీపిస్తున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యూహాలు ఎవరికీ అర్థం కావడం లేదు. గెలుపు గుర్రాలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. దీంతో ఏపీలో రాజకీయ సమీకరణాల్లో అనూహ్యంగా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి.

అభ్యర్థుల ఎంపికపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నా, బంధువుల విషయంలో ఆయన నిర్మొహమాటంగా వ్యవహరించడం వారికి నచ్చడం లేదు. తాజాగా వియ్యంకుడు, సినీనటుడు బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. గత కొన్నాళ్ళుగా శ్రీభరత్ విశాఖపట్నం టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. దాంతో బాలయ్య చిన్నల్లుడు భరత్ అనే నేను సినిమాలో డైలాగ్ కూడా ప్రిపేర్ అయిపోయారని అంటున్నారు.

అయితే శ్రీభరత్ ఆశలపై బాబు చన్నీళ్ళు చల్లారట. కొడుకు తోడల్లుడికి చంద్రబాబు నాయుడు ఊహించని షాక్ ఇచ్చారు.భరత్ కు టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారని తెలుస్తోంది. శ్రీభరత్ సినీనటుడు బాలయ్యకు చిన్నల్లుడే కాదు మాజీ ఎంపీ, దివంగత ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి రాజకీయ వారసుడు. తన తాతయ్య ఎంవీవీఎస్ మూర్తి చనిపోవడంతో ఆయన రాజకీయ వారసుడిగా రాజకీయ ఆరంగేట్రం చేశారు శ్రీ భరత్.

ఎంవీవీఎస్ మూర్తి చనిపోయే సమయానికి  విశాఖపట్నం స్థానిక సంస్థల కోటాలో 2015లో ఎమ్మెల్సీ అయ్యారు. ఆనాటి నుంచి ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయన మరణానంతరం మనవడు, బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని భావించారు. కానీ అది జరగలేదు. అయితే  బుద్దా నాగజగదీశ్వర్ కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి శ్రీభరత్ కు హ్యాండిచ్చారు చంద్రబాబు నాయుడు. ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంతో రాబోయే రోజుల్లో పెద్ద పదవే కట్టబెడతారంటూ అంతా ప్రచారం జరిగింది. 

విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీభరత్ పోటీ గ్యారంటీ అని ప్రచారం జరిగింది. కానీ చివరాఖరికి ఆయనకు టికెట్ అనుమానం అంటున్నారు. ఇందుకు అనేక కారణాలు కూడా ఉన్నాయంటున్నారు. రాజకీయ అనుభవం లేకపోవడం, సామాజిక సమీకరణాల నేపథ్యంలో వేరొకరికి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉండవచ్చంటున్నారు.  

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ముళ్లపూడి సత్యనారాయణ అనే వ్యక్తిని బరిలోకి దించుతుంది. ఆయనకు పోటీగా  గంటా శ్రీనివాసరావును బరిలోకి దించితే టీడీపీ ఓట్లతోపాటు కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా పడవచ్చని యోచిస్తున్నారు. అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సైతం భీమిలి నుంచి పోటీ చెయ్యాలని చూస్తున్నారు.భీమిలి నియోజకవర్గం నుంచి గెలిస్తే విజయం తథ్యమని భావిస్తున్నారు. అయితే చంద్రబాబు తీరుపై శ్రీభరత్ కుటుంబీకులు మండిపడుతున్నారు. ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు సరికదా ఎంపీ టికెట్ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే లోకేష్, తన మామ బాలయ్య బాబు ద్వారా ప్రయత్నాలు చేయాలని సంకల్పిస్తున్నారు శ్రీభరత్. ఇప్పటికే పెద్ద అల్లుడు లోకేష్ తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. బాలయ్య హిందూపురం నుంచి  పోటీ చేస్తున్నారు. మళ్ళీ చిన్నల్లుడికి కూడా టికెట్ ఇస్తే అంతా కుటుంబ పదవులు అనే విమర్శలు వస్తాయని చంద్రబాబు భావించి ఉండవచ్చంటున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle