newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

29-05-202029-05-2020 10:17:47 IST
Updated On 29-05-2020 12:10:39 ISTUpdated On 29-05-20202020-05-29T04:47:47.891Z29-05-2020 2020-05-29T04:47:16.993Z - 2020-05-29T06:40:39.064Z - 29-05-2020

శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో వేలాదిమంది చిక్కుబడిపోయారు. లక్షలాదిమందిని భారతీయ రైల్వే శ్రామిక్ రైళ్ళ ద్వారా వారి వారి స్వస్థలాలకు తరలిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో అనేక శ్రామిక ప్రత్యేక రైళ్ల ద్వారా ఆంధ్ర ప్రదేశ్ నుండి  లక్షకుపైగా కార్మికులను ఉత్తరప్రదేశ్, బీహార్,  జార్ఖండ్ , పశ్చిమ బెంగాల్ చత్తీస్ ఘర్,  మహారాష్ట్ర,  మధ్యప్రదేశ్ ఒ, రిస్సా  నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు,  ఉత్తరాఖండ్ లలో ఉన్న  వారి వారి స్వస్థలాలకు పంపించడం జరిగిందని ఏపీ కోవిడ్ 19 కో ఆర్డినేటర్ శ్రీకాంత్ తెలిపారు. 

అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో గుజరాత్ మహారాష్ట్ర, తమిళనాడులలో  చిక్కుకుపోయిన మన వారిని కూడా రాష్ట్రానికి రప్పించడం జరిగిందన్నారు. వందే భారత్ మిషన్ ద్వారా ఇతర దేశాలలో చిక్కుకుపోయిన మన రాష్ట్ర ప్రజలను తీసుకు రావటం జరుగుతుంది. ప్రస్తుతం దేశీయ విమాన ములు తిరగటం మొదలుపెట్టాయి. 

కొద్ది రోజులలో రైల్వే సర్వీస్ కూడా పునరుద్ధ రణ కాబోతోందని, దానికి అనుగుణంగా సౌత్ సెంట్రల్ రైల్వే వారు రైల్వే ప్రయాణం లో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి సమూలంగా వివరించడం జరిగిందన్నారు. అందరూ ఈ జాగ్రత్తలను పాటిస్తూ, తమని తాము కాపాడుకుంటూ, సమాజం ను కోవిడ్ నుండి  రక్షించవలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు శ్రీకాంత్. 

ఇదిలా ఉంటే తమ స్వంతూళ్ళకు వెళుతున్న వలస కూలీల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. కూలీల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలు నరకం కంటే దారుణంగా ఉన్నాయని బిహార్‌ సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు రంజిత్‌ రంజన్‌ వ్యాఖ్యానించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం వలస కూలీలను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రంజిత్‌ రంజన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘మధుబని, సుపాల్, దర్భాంగా, ముజఫర్‌పూర్, మాధేపురా క్వారంటైన్‌ కేంద్రాల్లో సరైన వసతులు లేవు. 

ఇదేంటని ప్రశ్నిస్తే.. 9 మంది వలస కార్మికుల మీద ప్రభుత్వం కేసు నమోదు చేసింది. బిహార్‌లోని క్వారంటైన్‌ కేంద్రాలు నరకం కంటే దారుణంగా ఉన్నాయి. కనీస సౌకర్యాలు కరువయ్యాయి. సరైన వసతులు లేవని అడిగితే వారి మీద కేసు నమోదు చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం. ప్రభుత్వ చర్యలు చూస్తే.. వలస కార్మికులు ఈ దేశ పౌరులు కారు.. వారికి ఎలాంటి హక్కులు లేవన్నట్లు తోస్తుంది’ అన్నారు‌.

మండలిపై జగన్ గురి.. . నామినేటెడ్ అభ్యర్ధులు వీరేనా?

మండలిపై జగన్ గురి.. . నామినేటెడ్ అభ్యర్ధులు వీరేనా?

   an hour ago


పరిమళించిన మానవత్వం.. డాక్టర్ సాహసం

పరిమళించిన మానవత్వం.. డాక్టర్ సాహసం

   an hour ago


పాకిస్తాన్ కాదు.. దేశానికి అసలు ముప్పు చైనాతోనే.. శరద్ పవార్

పాకిస్తాన్ కాదు.. దేశానికి అసలు ముప్పు చైనాతోనే.. శరద్ పవార్

   an hour ago


ఏపీలో కరోనా వేగం.... రెడ్ జోన్ మండలాలివే

ఏపీలో కరోనా వేగం.... రెడ్ జోన్ మండలాలివే

   2 hours ago


రాజ్‌భవన్‌ని తాకిన కరోనా.. 48మందికి పాజిటివ్

రాజ్‌భవన్‌ని తాకిన కరోనా.. 48మందికి పాజిటివ్

   2 hours ago


అక్కడ తగ్గుతుంటే.. తెలంగాణలో ఆందోళనకరం

అక్కడ తగ్గుతుంటే.. తెలంగాణలో ఆందోళనకరం

   2 hours ago


బెంగళూరులో లాక్ డౌన్.. సీఎం కార్యాచరణ

బెంగళూరులో లాక్ డౌన్.. సీఎం కార్యాచరణ

   2 hours ago


విజయసాయి వివాదాస్పద వ్యాఖ్యలు.. తెలుగు తమ్ముళ్ళ విసుర్లు

విజయసాయి వివాదాస్పద వ్యాఖ్యలు.. తెలుగు తమ్ముళ్ళ విసుర్లు

   15 hours ago


టీఎస్ఆర్జేసీ గడువు పెంపు.. ఓపెన్ స్కూల్ పరీక్షలు రద్దు

టీఎస్ఆర్జేసీ గడువు పెంపు.. ఓపెన్ స్కూల్ పరీక్షలు రద్దు

   a day ago


కరోనా వ్యాప్తి నిరోధంలో ధారావి విజయ పాఠం.. డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలు

కరోనా వ్యాప్తి నిరోధంలో ధారావి విజయ పాఠం.. డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలు

   12-07-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle