newssting
BITING NEWS :
*శబరిమల వివాదంపై సుప్రీం తీర్పు.శబరిమల వివాదం విస్తృత ధర్మాసనానికి బదిలీ *రాఫెల్‌ డీల్‌ : కేంద్రానికి క్లీన్‌చిట్‌ .. రివ్యూ పిటిషన్లు కొట్టివేత *రాహుల్ గాంధీకి రిలీఫ్.. పరువునష్టం కేసుపై సుప్రీం తీర్పు *వైసీపీలో చేరనున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్*ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సహాని...నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్....ఇవాళ బాధ్యతలు స్వీకరించిన నీలం సహాని *ఇసుక కొరతపై చంద్రబాబు దీక్ష...12 గంటల పాటు దీక్షలో కూర్చున్న బాబు* ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన...మనబడి నాడు - నేడు కార్యక్రమానికి శ్రీకారం*విశాఖ: బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ సోదాలు.. మన శాండ్ ఆన్‌లైన్ ఇసుక సరఫరా వెబ్‌సైట్ హ్యాక్ చేసినట్టు అనుమానం*ఢిల్లీ: అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు.. పార్లమెంట్‌లో అయోధ్య ట్రస్ట్ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం*ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన హైకోర్ట్*అమరావతి: పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయనడం కరెక్ట్ కాదు.. చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి బొత్స

శుక్రవారం వచ్చేసింది.. జగన్ ఆబ్సెంటా? ప్రజెంటా?

08-11-201908-11-2019 09:30:19 IST
2019-11-08T04:00:19.412Z08-11-2019 2019-11-08T04:00:10.673Z - - 14-11-2019

శుక్రవారం వచ్చేసింది.. జగన్ ఆబ్సెంటా? ప్రజెంటా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శుక్రవారం రానే వచ్చేసింది.. ఎంతో ఉత్కంఠ కలిగించిన సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు మినహాయింపు వ్యవహారం ప్రతికూలంగా రావడంతో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవక తప్పడం లేదు. సీఎం సింహాసనాన్ని అధిష్టించి నెలలు గడిచినా ఇంతకాలం పిటిషన్లు, సాకులతో కోర్టు హాజరు తప్పించుకున్నారు. ఇక ఇప్పుడు మినహాయింపు రద్దు తర్వాత వచ్చిన ఈ శుక్రవారంపై అటు అధికార పార్టీ వైసీపీ వర్గాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రధాన పార్టీలు, ప్రజలు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరవుతారా? రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో కోర్టు బోనులో నిలబడతారా? లేక మళ్ళీ సాకులతో కోర్టుకు డుమ్మా కొట్టేస్తారా? హాజరైతే ప్రతిపక్షాల రియాక్షన్ ఏంటి? వైసీపీ సమాధానం ఏంటి? ఇలా రాజకీయ విశ్లేషకులు సైతం ఈ వ్యవహారం ఉత్కంఠగా మారింది. అయితే ఈ వారానికి జగన్ కోర్టుకు హాజరయ్యే అవకాశాలు లేవంటూ ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అందుకు వారు చెప్పే కారణాలు ఏమైనా కానీ అది తమకి ఇబ్బందిగా మారుతుందనే డుమ్మా కొడుతున్నారని చెప్పుకోకతప్పదు.

సిబిఐ కోర్టు జగన్ మినహాయింపు పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టుకు వెళ్లే అవకాశాలను కూడా లేకుండా చేయడంతో ఇప్పుడు అయనకి ఉన్న అప్షన్ ఒక్క సుప్రీంకోర్టు మాత్రమే. ప్రస్తుతం వైసీపీ న్యాయ నిపుణులు సుప్రీంకు వెళ్లే వ్యవహారంలో బిజీగా ఉన్నారని తెలుస్తుంది. అయితే ఈలోగా శుక్రవారాలు రాకుండా ఉంటాయా? రానే వచ్చింది. అందుకే ఈ వారానికి ఏవో ప్రభుత్వ సాకులతో హాజరుకాలేకపోతున్నానని పిటిషన్ వేయించనున్నట్లుగా తెలుస్తుంది.

అయితే ఈ కోర్టుకు ఆబ్సెంట్ వ్యవహారంలో రెండు చిక్కులు ఉన్నట్లుగా నిపుణులు చెప్తున్నారు. సిబిఐ హాజరుకావాలని కోరి.. కోర్టుకూడా అదే ఆదేశించినా జగన్ హాజరుకాకపోవడంపై కోర్టు ఎలా స్పందిస్తున్నది కూడా ఉత్కంఠగానే ఉంది. జగన్ ఆబ్సెంట్ తో కోర్టు ఆగ్రహించి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేయాలని సిబిఐని ఆదేశించే అవకాశం ఉండగా, అసలు ఆబ్సెంట్ పిటిషన్ ను వ్యతిరేకించి వారెంట్ జారీ చేసే అధికారాలు కూడా ఉన్నాయన్న విశ్లేషణలు కీలకంగా వినిపిస్తున్నాయి.

ఈ వారం కోర్టులో వినిపించే వాదనలు.. కోర్టు తీరు.. సిబిఐ ప్రవర్తన మీదనే జగన్ పొలిటికల్ టర్న్స్ ఆధారపడి ఉన్నాయంటుండగా ఈ పరిస్థితులకు అనుగుణంగానే సుప్రీంకోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ ను దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. సిబిఐ దూకుడును బట్టే అసలు సుప్రీంకు వెళ్లే ఆలోచనలో ముందుకు వెళ్లాలా? లేదా అన్న స్పష్టత కూడా రానుందని సన్నిహిత వర్గాలలో వినిపిస్తుంది.

మరోపక్క శుక్రవారం పరిస్థితులపై పార్టీలో కూడా తీవ్ర చర్చ జరుగుతున్నట్లుగా చెప్తున్నారు. ఆబ్సెంట్ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చి కోర్టుకు హాజరుకావాల్సి వస్తే ప్రతిపక్షాలను ఎలా తిప్పికొట్టాలి అనే దానిపై కూడా సీనియర్ నేతలు కసరత్తులు చేస్తున్నారట. మరి జగన్ న్యాయవాదులు కోర్టుకు ఏం చెప్పబోతున్నారు? కోర్టు స్పందన ఎలా ఉంటుంది? సిబిఐ ఈ వారం విచారణ ఏమై ఉంటుందన్నది మరికొద్ది గంటలలోనే తేలిపోనుంది!

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle