newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

శివాజీ మరో ‘గరుడ’పురాణం

03-01-201903-01-2019 12:50:07 IST
2019-01-03T07:20:07.840Z03-01-2019 2019-01-03T07:20:06.070Z - - 17-07-2019

శివాజీ మరో ‘గరుడ’పురాణం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆమధ్య ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో నటుడు శివాజీ చేసిన హంగామా అంతాఇంతా కాదు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై... ముఖ్యంగా సిఎం చంద్రబాబుపై కేంద్రం కుట్రపన్నుతోందంటూ... ఆయన ఒక పెద్ద అధ్యాయమే చెప్పుకొచ్చారు. ఆయన చెప్పినట్టే రెండు, మూడు సంఘటనలు ఏపీలో చోటు చేసుకోవడం గమనార్హం! ఆ సంగతి పక్కనపెడితే... తాజాగా శివాజీ మరో సంచలనానికి తెరతీశారు. తెలుగుదేశం పార్టీకి ఓటర్లను దూరం చేయడానికి, ఆ పార్టీ ఉనికిని దెబ్బకొట్టడానికి... సరికొత్త పన్నాగానికి తెరలేపుతున్నారంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. ఇందులో భాగంగానే చుక్కల భూముల రైతుల్ని ప్రభుత్వంపై ఉసిగొల్పేందుకు ప్రయత్నిస్తున్నారని బాంబ్ పేల్చారు. ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయన్నారు.

‘‘గుంటూరు జిల్లాలోని 22ఏ సర్వే నంబర్‌లో ఉన్న చుక్కల భూముల రైతుల్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై ఉసిగొల్పుతున్నారు. దీని ద్వారా టిడిపికి ఏకంగా 12 లక్షల ఓట్లు దూరమయ్యే అవకాశం ఉంది. 1910 నుంచి 2016 వరకూ నిరాటంకంగా జరిగిన రిజిస్ట్రేషన్లు ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు ఆగిపోయాయి? ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రే’’ అని శివాజీ ధ్వజమెత్తారు. ఆ భూముల్ని ఈస్ట్‌ ఇండియా కంపెనీ క్రమబద్ధీకరించిందని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్ తన వద్ద ఉందని చెప్పారు. ఉన్నత స్థానంలో ఉన్న ముగ్గురు అధికారులు ఆ ఫైలును తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని, కొందరు అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని శివాజీ ఆరోపించారు. ప్రభుత్వంపై అంతగా వ్యతిరేకత ఉంటే... వెంటనే రాజీనామాలు చేసి నచ్చిన పార్టీల్లో చేరి పనిచేయాలని ఆ కొందరు వ్యక్తుల్ని ఉదహరిస్తూ శివాజీ సూచించారు.

ఈ విషయమై తాను త్వరలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలుస్తానని, తన వద్ద ఉన్న ఆధారాలతో జరుగుతున్న కుట్ర వివరాల్ని పూర్తిగా వివరిస్తానని శివాజీ వెల్లడించారు. సంక్రాంతిలోగా సమస్యను పరిష్కరించకుంటే తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. విపక్షాలకు ప్రజాసమస్యలు ఏమాత్రం పట్టవని, వారి దృష్టి కేవలం ముఖ్యమంత్రి కుర్చీపైనే ఉందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కచ్చితంగా ప్రభుత్వం మారుతుందని, అప్పుడు ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని శివాజీ ధీమా వ్యక్తం చేశారు.


Syed Abdul Khadar Jilani


సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ- కంటెంట్ రైటర్‌. జర్నలిజంలో ఐదేళ్ళ అనుభవం. ప్రముఖ మీడియా సంస్థ టీవీ9, తొలివెలుగు, ఇతర డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేశారు. సినిమా కథనాలు, రివ్యూలు, రాజకీయాలు, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ వంటి అంశాలపై మంచి అవగాహన. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
 syedabdul@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle