newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

శిద్దా రాఘవరావు పెట్టిన మెలిక...!

12-03-201912-03-2019 18:01:57 IST
2019-03-12T12:31:57.479Z12-03-2019 2019-03-12T12:15:38.571Z - - 25-02-2020

శిద్దా రాఘవరావు పెట్టిన మెలిక...!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒంగోలు ఎంపీ సీటులో ఎవరిని పోటీలో పెట్టాలన్న దానిపై చర్చలు జరుపుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు... తాజాగా మరో పేరు ప్రస్తావనకు తెచ్చారట. మంత్రి శిద్దా రాఘవరావును ఈసారి ఒంగోలు ఎంపీగా బరిలో దింపాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు అమరావతి సమాచారం. ఇప్పటికే ఈ అంశం మీద రాఘవరావుతో చంద్రబాబు మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది. గత ఎన్నికల్లో దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన శిద్దా రాఘవరావు... ఈసారి కూడా దర్శి నుంచే పోటీకి రెడీ అయ్యారు.

కార్యకర్తలతో ఇప్పటికే నియోజకవర్గం మొత్తం చుట్టేసి వచ్చారు. అయితే చంద్రబాబు తాజా ప్రతిపాదనతో ఆయన ఇరకాటంలో పడ్డారట. చివరాఖరికి శిద్దా రాఘవరావు తేల్చుకుంది ఏంటంటే... ఒంగోలు ఎంపీ సీటు నుంచి తాను పోటీ చేయాలని చంద్రబాబు పట్టుబడితే... ఆయనకు ఓకే చెప్పి... దర్శి అసెంబ్లీ సీటు తన కుటుంబంలో ఒకరికి ఇవ్వాలని కోరడం. ఇదే ఇప్పుడు శిద్దా రాఘవరావు వేస్తున్న ఎత్తుగడగా దర్శి టీడీపీ నేతలు చెబుతున్నారు. శిద్దా మెలికకు బాబు ఒప్పుకుంటారా?


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle