newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

శాసనమండలి రద్దుకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

27-01-202027-01-2020 12:27:38 IST
Updated On 27-01-2020 12:38:17 ISTUpdated On 27-01-20202020-01-27T06:57:38.693Z27-01-2020 2020-01-27T06:57:36.260Z - 2020-01-27T07:08:17.276Z - 27-01-2020

శాసనమండలి రద్దుకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ కేబినెట్ సోమవారం భేటీ అయింది. కీలకమయిన శాసన మండలి రద్దుకి అంగీకారం తెలిపింది.  మండలి రద్దుకు సంబంధించి శాసన సభలో సోమవారం ప్రవేశపెట్టే తీర్మానానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అనంతరం శాసనసభ బీఏసీ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ఇవాళ సభ సమావేశం కావాలని నిర్ణయించారు. శాసనమండలి రద్దుకి సంబంధించిన తీర్మానాన్ని సీఎం జగన్ సభలో ప్రవేశపెట్టారు. శాసన మండలి రద్దు తీర్మానంపై చర్చ ప్రారంభం అయింది. తీర్మానాన్ని సభ ఆమోదించాక కేంద్రం ఆమోదానికి పంపనుంది.

సభలో శాసనమండలి రద్దు తీర్మానం సందర్బంగా వైసీపీ సభ్యులు టీడీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఏపీలో శాసన మండలి రద్దు కావడం ఇది రెండోసారి. శాసన మండలిని మే 31, 1985న రద్దు చేశారు అప్పటి సీఎం ఎన్టీఆర్‌. అనంతరం మార్చి 30, 2007న తిరిగి మండలి పునరుద్దరణ జరిగింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి విడిగా శాసన మండలి ఏర్పాటైంది.

ఆర‍్టికల్‌ 169 ద్వారా ఏ రాష్ట్ర మండలినైనా రద్దు చేసే అధికారం వుంది. పార్లమెంట్‌ ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో రద్దు కానుంది మండలి. మరో విశేషం ఏమిటంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మండలి పునరుద్ధరణ జరగగా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రద్దు కానుంది. 

దేశవ్యాప్తంగా కేవలం 6 రాష్ట్రాల్లోనే  శాసనమండలి వ్యవస్థ అమలులో వుంది. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్‌, యూపీలోనే పెద్దల సభ వుంది. మరికొన్ని రాష్ట్రాలు శాసనమండలిని పునరుద్ధరించాలని కోరినా కేంద్రం విముఖత వ్యక్తం చేసింది. అసోం, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో మండలి కోసం వినతులు కేంద్రానికి చేరాయి. కానీ వాటిని అంగీకరించలేదు కేంద్రం. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle