newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

శానిటైజర్ మరణ మృదంగం... 16 మంది బలి

01-08-202001-08-2020 10:09:41 IST
2020-08-01T04:39:41.636Z01-08-2020 2020-08-01T04:38:39.749Z - - 03-08-2020

శానిటైజర్ మరణ మృదంగం... 16 మంది బలి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మత్తు కోసం శానిటైజర్ తాగి తిరిగిరాని లోకాలకు చేరుతున్నారు. కరోనా నుంచి రక్షణ కల్పించే శానిటైజర్లు మందుబాబులకు మరణ శాసనాలుగా మారుతున్నాయి. ప్రకాశం జిల్లా కురిచేడులో 19 గంటల్లోనే 12 మంది మరణించారు. పామూరులో వారం వ్యవధిలో ముగ్గురు చనిపోయారు. గుంటూరులో మరొకరు మృత్యువాత పడ్డారు. ఏపీలో కరోనా మరణాల కంటే శానిటైజర్ల ద్వారా జరిగే మరణాలు విషాదం నింపుతున్నాయి. 

దీంతో మెడికల్‌ షాపులు సీజ్‌ చేసి శానిటైజర్లను ల్యాబ్‌కు పంపారు పోలీసులు. ఈ ఘటనపై సీఎం, డీజీపీ ఆరా తీశారు. ప్రత్యేక బృందంతో విచారణ జరుపుతామని ఎస్పీ ప్రకటించారు. ఏపీలో మత్తు కోసం శానిటైజర్లు తాగి 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కురిచేడు మండలకేంద్రంలో 19గంటల వ్యవధిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, పామూరు గ్రామంలో వారం వ్యవధిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. కురిచేడులో పెళ్లికి హాజరైన గుంటూరు వాసి కూడా శానిటైజర్‌ తాగి ప్రాణాలు కోల్పోయాడు. 

కురిచేడులో కరోనా కేసులు ఎక్కువగా వెలుగు చూస్తుండటంతో గ్రామాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. మద్యం దుకాణాలను మూసివేశారు. దీనికితోడు మద్యం ధరలు అధికంగా ఉండటంతో మత్తుకు బానిసైన కూలీలు శానిటైజర్‌ తాగడానికి అలవాటుపడ్డారు. పది రోజులుగా శానిటైజర్‌ సేవిస్తున్నారు. వద్దని వారించినా వారు వినలేదు. చివరాఖరికి వారంతా మత్తుకి కాదు మరణానికి చేరువయ్యారు. గురువారం నుంచి ఒక్కొక్కరుగా ప్రాణాలు విడవడం ప్రారంభమైంది. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఈ మరణాల పరంపర కొనసాగింది. 

మృతుల్లో ఐదుగురు కూలీలు, ఇద్దరు ఆటో డ్రైవర్లు, ఒక రైతు, ఇద్దరు యాచకులు, ఒకరు చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తి ఉన్నారు. వీరంతా ఎరికివారే శానిటైజర్‌లో నీళ్లు కలుపుకొని తాగారు. మద్యం బాటిళ్లలో ఆల్కహాల్‌ 40 శాతం మాత్రమే ఉంటుంది. శానిటైజర్లలో మాత్రం 70శాతం ఉంటుంది. దీంతో రూ.50కు దొరికే 100 ఎంఎల్‌ శానిటైజర్‌ బాటిల్‌ను కొనుగోలు చేసి నీళ్లలో కలుపుకొని తాగడం ప్రారంభించారు.  

ఆటోడ్రైవర్‌ కడియం రమణయ్య(28), యాచకుడు కొనగిరి రమణయ్య(45), విశ్రాంత లస్కర్‌ పాలెపోగు దాసు(65), చిత్తు కాగితాలు ఏరుకునే కొనగిరి బాబు(35), కుందా అగస్టీన్‌(42) గురువారం రాత్రి మరణించారు. కొనగిరి బాబు, కడియం రమణయ్యలను 108లో దర్శి సీహెచ్‌సీకి తీసుకెళ్లగా అక్కడ మృతిచెందారు. కొనగిరి రమణయ్య, దాసు, అగస్టీన్‌ ఇంటి వద్దనే ప్రాణాలు విడిచారు. శుక్రవారం అనుగొండ శ్రీను (29) భోగ్యం తిరుపతయ్య(35), గుంటక రామిరెడ్డి(57), కంభంపాటి దాసు ఇంటి వద్ద మృతిచెందగా, మాడుగుల చార్లెస్‌(36) కురిచేడులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో, రాజారెడ్డి(65) రోడ్డు పక్కన చెట్టు కింద, షేక్‌ సైదా(29) వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో మృతిచెందారు. వారు తాగిన శానిటైజర్లు కల్తీవని స్థానికులు, అధికారులు అనుమానిస్తున్నారు.

ఇదిలా వుంటే గుంటూరుకు చెందిన అరవై ఏళ్ళ మాతంగి పెద్ద సుబ్బారావు కురిచేడులో జూలై 29న మనుమరాలి పెళ్లికి హాజరయ్యారు. 30న ఆయన కూడా అందరితోపాటే  శానిటైజర్‌ తాగారు. రాత్రికి ఆయాసం ఎక్కువవడంతో గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. ఆయాసం ఎక్కువై శుక్రవారం తెల్లవారుజామున ఆయన మృతి చెందారు.పెళ్లికొచ్చి ఇలా చావుకి దగ్గర కావడంతో విషాదం నెలకొంది. 

ప్రాణం తీసిన శానిటైజర్...మద్యం దొరక్క 9మంది బలి


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle