newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

వ‌ర‌ద‌ను వ‌ద‌ల‌ని రాజ‌కీయ బుర‌ద‌..!

15-08-201915-08-2019 08:18:02 IST
2019-08-15T02:48:02.038Z15-08-2019 2019-08-15T02:47:59.687Z - - 20-10-2019

వ‌ర‌ద‌ను వ‌ద‌ల‌ని రాజ‌కీయ బుర‌ద‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ఇప్పుడు వ‌ర‌ద‌ల చుట్టూ తిరుగుతున్నాయి. కృష్ణా న‌దిలో ద‌శాబ్దకాలంగా ఎప్పుడూ లేనంత వ‌ర‌ద రావ‌డమే ఇందుకు కార‌ణం. అయితే, వ‌ర‌ద వ‌చ్చి ప్రాజెక్టులు నిండ‌టం రైతుల‌కు సంతోషంగానే ఉంది కానీ పార్టీల‌కు మాత్రం ఇది రాజ‌కీయ అంశంగా మారిపోయింది. 

వైసీపీ - టీడీపీ విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు చేసుకోవ‌డానికి ఇప్పుడు వ‌ర‌ద‌లు ఓ కార‌ణంగా మారాయి. ఎగువ రాష్ట్రాల్లో వ‌ర్షాలు ఎక్కువ‌గా కుర‌వ‌డంతో కృష్ణా న‌ది ప‌ర‌వ‌ళ్లు తొక్కుతోంది. ప్రాజెక్టుల‌న్నీ నిండుకుండ‌లను త‌ల‌పిస్తున్నారు. ఇప్పుడు జ‌గ‌న్‌, కేసీఆర్‌కు మంచి స‌ఖ్య‌త ఉండటంతో ఉమ్మ‌డి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగ‌ర్ గేట్ల‌ను రెండు రాష్ట్రాల‌కు చెందిన మంత్రులు వెళ్లి ఎత్తారు. 

దీంతో దిగువ‌న ఉన్న ఉన్న పులిచింత‌ల‌, ప్ర‌కాశం బ్యారేజ్‌కు సైతం నీరు చేరింది. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి కూడా నీరు కింద‌కు వ‌దులుతున్నారు. ఇద‌ంతా బాగానే ఉంది. అయితే, కృష్ణా న‌దిలో వ‌ర‌ద పొటెత్త‌డంతో ఇప్పుడు క‌ర‌క‌ట్ట‌పైన చంద్ర‌బాబు నివాసం రిస్క్‌లో ప‌డింది. 

చంద్ర‌బాబు నివాసంతో పాటు టీడీపీ నేత‌లు సైతం ఇరుకున ప‌డుతున్నారు. న‌దికి ఆనుకొని నిర్మించిన ఈ నివాసంలో చంద్ర‌బాబు అద్దెకుంటున్నారు. ప్ర‌జావేదిక కూల్చివేసిన‌ప్పుడే ఈ నివాసం కూడా అక్ర‌మ క‌ట్ట‌డ‌మ‌ని, ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు. ఒక ద‌శ‌లో ఇళ్లు ఖాళీ చేయాల‌నే నిర్ణ‌యానికి చంద్ర‌బాబు వ‌చ్చినా మ‌ళ్లీ వెన‌క్కు త‌గ్గారు.

చంద్ర‌బాబుపై ప్ర‌భుత్వం క‌క్ష సాధిస్తోంద‌ని, ఈ ఇంటికి అన్ని అనుమ‌తులు ఉన్నాయ‌ని తెలుగుదేశం నేత‌లు వాధించారు. అయితే, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాత్రం న‌దికి ఆనుకొని ఉన్న క‌ట్ట‌డాల వ‌ల్ల వ‌ర‌ద వ‌చ్చిన‌ప్పుడు ముంపున‌కు గుర‌య్యే ప్ర‌మాద‌ముంద‌ని చెప్పారు. ఇప్పుడు అదే జ‌రిగింది. చంద్ర‌బాబు నివాసంలోకి నీళ్లు రాకుండా ఆయ‌న సిబ్బంది నానా తంటాలు ప‌డుతున్నారు.

దీంతో చూశారా.. మేము చెబితే చంద్ర‌బాబు విన‌లేదు.. ఇప్ప‌టికైనా ఖాళీ చేయండి అని వైసీపీ వాళ్లు మొద‌లుపెట్టారు. అయితే, వైసీపీ వాళ్లు రాక్ష‌సానందం పొందుతున్నార‌ని, క‌ర‌క‌ట్ట‌పై పేద‌లు కూడా ఉన్నార‌ని, త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని టీడీపీ నేతలు అంటున్నారు. ప్ర‌స్తుతానికి చంద్ర‌బాబు నివాసం సేఫ్‌గానే ఉన్నా వ‌ర‌ద పెరిగితే ఏమైనా జ‌ర‌గ‌వ‌చ్చ‌ని అధికారులు అంటున్నారు.

ఇక‌, జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చినందున వ‌ర్షాలు ప‌డుతున్నాయ‌ని, గ‌తంలో వైఎస్ హ‌యాంలో చివ‌ర‌గా ప్రాజెక్టులు నిండాయ‌ని, ఇప్పుడు మ‌ళ్లీ నిండాయ‌ని వైసీపీ శ్రేణులు ప్ర‌చారం చేసుకుంటున్నాయి. అయితే, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో క‌రువు తాండ‌విస్తోంద‌ని టీడీపీ శ్రేణులు కౌంట‌ర్ ఇస్తున్నాయి. మొత్తంగా మన పార్టీలు వ‌ర‌ద‌ల మీద చేయాల్సినంత రాజ‌కీయం చేస్తున్నాయి.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle