newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

వ్యతిరేక మీడియాపై ప‌గ తీర్చుకుంటున్నారా..?

09-10-201909-10-2019 12:10:26 IST
2019-10-09T06:40:26.129Z09-10-2019 2019-10-09T06:40:21.718Z - - 20-02-2020

వ్యతిరేక మీడియాపై ప‌గ తీర్చుకుంటున్నారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన నాలుగు నెల‌ల్లో త‌న చ‌ర్య‌లు రెండు స్ప‌ష్ట‌మైన సంకేతాల‌ను ఇస్తున్నాయి. ఒక‌టి తాను ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల‌ని ఆయ‌న త‌హ‌త‌హ‌లాడుతున్నారు.

ఈ మేర‌కు చాలా వ‌ర‌కు హామీల‌ను నెర‌వేరుస్తున్నారు. ఇక‌, రెండోది త‌న వ్య‌తిరేకుల‌పై పంజా విసురుతున్నారు. గ‌త ప‌దేళ్లుగా త‌న‌ను ఇబ్బంది పెట్టిన వారిపై ఇప్పుడు ప‌గ తీర్చుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు.

ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీకి అండ‌గా ఉన్న వారి ఆర్థిక మూలాల‌ను పెకిలించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బ‌య‌ట‌కు అవినీతిని నిర్మూలిస్తున్నాం, ప్ర‌జ‌ల సొమ్మును ఆదా చేస్తున్నాం అని వైసీపీ చెప్పుకుంటున్నా రివ‌ర్స్ టెండ‌రింగ్‌, కాంట్రాక్టుల ర‌ద్దు, పీపీఏల పున‌స‌మీక్ష‌లో టీడీపీకి అనుకూలంగా ఉన్న వారి ఆర్థిక మూలాల‌ను దెబ్బ తీయాల‌నే ల‌క్ష్యం ప్ర‌భుత్వంలో ఉంద‌నే ఆరోప‌ణ‌లు బాహాటంగానే వినిపిస్తున్నాయి.

ఇక‌, తాజాగా వైసీపీ త‌న వ్య‌తిరేక మీడియాను టార్గెట్ చేసిన‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న నాటి నుంచి ఒక సెక్ష‌న్ మీడియా టీడీపీకి అనుకూలంగా, వైఎస్‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేసింది. వైఎస్ మృతి త‌ర్వాత జ‌గ‌న్ లీడ‌ర్‌గా ఎదుగుతున్న క్ర‌మంలో ఈ మీడియా మ‌రింత బ‌ల‌ప‌డి ఆదిలోనే జ‌గ‌న్‌ను తొక్కేసేందుకు శ‌క్తిమేర ప్ర‌య‌త్నించింద‌నేది కాద‌న‌లేని నిజం. వైసీపీ ఎల్లో మీడియాగా చెప్పే స‌ద‌రు సెక్ష‌న్ మీడియాకు గ‌త తొమ్మిదేళ్లు ఏ అడ్డంకీ లేకుండా సాగింది. ప్ర‌త్యేకించి గ‌త ఐదేళ్లు చంద్ర‌బాబు హ‌యాంలో ఆ మీడియాకు స్వ‌ర్ణ‌యుగం లాంటిది.

కానీ, రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ఇప్పుడు కాలం గిర్రున తిరిగి జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యారు. దీంతో తొమ్మిదేళ్లు త‌న‌ను టార్గెట్ చేసి త‌న వ్య‌క్తిత్వాన్ని, నాయ‌క‌త్వ ప‌టిమ‌ను కించ‌ప‌రిచి, రాజ‌కీయంగా దెబ్బ‌కొట్టేందుకు అనునిత్యం ప్ర‌య‌త్నించిన వ్య‌తిరేక మీడియాపై ప‌గ తీర్చుకోవ‌డం మొద‌లుపెట్టారు.

ఇప్ప‌టికే టీడీపీకి అనుకూలంగా ఉండే రెండు ఛాన‌ళ్ల ప్ర‌సారాల‌ను అన‌ధికార ఆదేశాలు ఇచ్చి, ఎమ్మెస్వోల‌పై ఒత్తిడి తెచ్చి ఆపేయించారు.

ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల జారీలోనూ వ్య‌తిరేక మీడియాపై ప్ర‌భుత్వం ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు. ఇక‌, తాజాగా వైసీపీ టీవీ9 మాజీ సీఈఓ ర‌విప్ర‌కాశ్‌ను టార్గెట్ చేసింది. ఇప్ప‌టికే టీవీ9 యాజ‌మాన్యంతో విభేదాలు, కేసుల కార‌ణంగా ర‌విప్ర‌కాశ్ పీక‌ల‌లోతు క‌ష్టాల్లో జైలు జీవితం గ‌డుపుతున్నారు.

ఇదే అదునుగా భావించిన వైసీపీ ఆయ‌న‌ను మ‌రింత ఇరికించే ప్ర‌య‌త్నం చేస్తోంది. వైసీపీ మాస్ట‌ర్‌మైండ్ విజ‌య‌సాయిరెడ్డి ఈ బాధ్య‌త తీసుకున్నారు. ర‌విప్ర‌కాశ్ మ‌నీలాండ‌రింగ్ వంటి అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని, ఆఫ్రిక‌న్ దేశాలకు అక్ర‌మ మార్గాల్లో డ‌బ్బులు పంపించి పెట్టుబ‌డులు పెట్టార‌ని ఆరోపిస్తూ ఆయ‌న సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టీస్‌కు లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాల‌ను సైతం ఆయ‌న జ‌త చేశారు. ర‌విప్ర‌కాశ్‌పై సీబీఐ, ఈడీ విచార‌ణ జ‌రిపించాల‌ని ఆయ‌న కోరారు.

ఒక‌వేళ సుప్రీం కోర్టు విచార‌ణ‌కు ఆదేశిస్తే ర‌విప్ర‌కాశ్‌కు మ‌రిన్ని క‌ష్టాలు త‌ప్ప‌వు. వైసీపీ, ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చూస్తుంటే త‌మ‌ను ఇంత‌కాలం టార్గెట్ చేసిన వ్య‌తిరేక మీడియా ప‌నిప‌ట్టేందుకు సిద్ధ‌మైన‌ట్లు క‌నిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ వ్య‌తిరేక మీడియాగా ముద్ర‌ప‌డ్డ ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ ఢిల్లీ వెళ్లి హోంమంత్రి అమిత్ షాను క‌ల‌వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జ‌గ‌న్ దూకుడును అడ్డుకునుందుకు ఈ భేటీ ఏమైనా దోహ‌ద‌ప‌డుతుందా లేదా వ్య‌తిరేక మీడియా టార్గెట్‌గా జ‌గ‌న్ చ‌ర్య‌లు కొన‌సాగుతాయా చూడాలి.

టీడీపీ కొత్త సవాల్.. సీఎంకు ఆ దేశాలకు వెళ్లే దమ్ముందా?

టీడీపీ కొత్త సవాల్.. సీఎంకు ఆ దేశాలకు వెళ్లే దమ్ముందా?

   10 hours ago


చంద్రబాబు భద్రతపై డీజీపీ వివరణ

చంద్రబాబు భద్రతపై డీజీపీ వివరణ

   12 hours ago


ఏపీలో ఠారెత్తిస్తున్న ఏసీబీ దాడులు..అధికారుల్లో వణుకు

ఏపీలో ఠారెత్తిస్తున్న ఏసీబీ దాడులు..అధికారుల్లో వణుకు

   12 hours ago


సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్ర-రాష్ట్ర మంత్రుల మాటల యుద్ధం!

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్ర-రాష్ట్ర మంత్రుల మాటల యుద్ధం!

   13 hours ago


నాదెండ్లదీ అదే దారా? పీకేకి షాక్ తప్పదా?

నాదెండ్లదీ అదే దారా? పీకేకి షాక్ తప్పదా?

   13 hours ago


కర్నూలుకు వెళ్లి చేసిందేంటి జగన్ గారూ!.. లోకేష్ రియాక్షన్

కర్నూలుకు వెళ్లి చేసిందేంటి జగన్ గారూ!.. లోకేష్ రియాక్షన్

   13 hours ago


‘‘ఇది రద్దులు, వేధింపుల ప్రభుత్వం’’

‘‘ఇది రద్దులు, వేధింపుల ప్రభుత్వం’’

   13 hours ago


తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉండటమే వివక్షా..  పీయూష్ గోయల్‌ ప్రశ్న

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉండటమే వివక్షా.. పీయూష్ గోయల్‌ ప్రశ్న

   15 hours ago


నితీష్-బీజేపీ మైత్రిపై పీకే ఘాటు వ్యాఖ్యలు

నితీష్-బీజేపీ మైత్రిపై పీకే ఘాటు వ్యాఖ్యలు

   17 hours ago


జేడీ అవుతారా ఏపీ కేజ్రీవాల్‌..?

జేడీ అవుతారా ఏపీ కేజ్రీవాల్‌..?

   18 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle