newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

వైస్సార్సీపీ లో కి అయ్యన పాత్రుడి తమ్ముడు..?

26-09-201926-09-2019 16:55:17 IST
2019-09-26T11:25:17.719Z26-09-2019 2019-09-26T11:25:15.749Z - - 09-12-2019

వైస్సార్సీపీ లో కి అయ్యన పాత్రుడి తమ్ముడు..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గతంలో తెలుగు దేశం పరాజయం పాలైనప్పుడు కూడా పార్టీ నుంచి వలసలు ఉండేవి. అయితే గతంలో ఎప్పుడూ కూడా ఎంతటి సంక్షోభం వచ్చినా పార్టీ కేడర్ చెక్కు చెదరలేదు. నేతల స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీని వీడినా...కార్యకర్తలు మాత్రం స్థిరంగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకు ఉన్నారు. పార్టీ ప్రతిపక్షంలో కూర్చున్న ప్రతి సారీ అది నిరూపితమైంది. అయితే ఈ సారి ఓటమి మాత్రం తెలుగుదేశం పార్టీని కుంగదీస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నేతలే కాదు..కార్యకర్తలూ పలు జిల్లాల్లూ పార్టీకి దూరం జరుగుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.

ఎన్నికల ఫలితాల తరువాత పార్టీకి పలువురు సీనియర్ నేతలు, సిట్టింగ్ ఎంపీలూ రాజీనామా చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచీ చురుకుగా వ్యవహరిస్తూ కీలకంగా ఉన్న కొందరు నేతలు అంటీముట్టనట్టుగా  దూరంగా ఉంటున్నారు. పార్టీ పిలుపు మేరకు కార్యక్రమాలలో కూడా పాల్గొనని పరిస్థితి కనిపిస్తున్నది. అయితే ఉత్తరాంధ్ర నుంచి పార్టీకి కీలక నేతగా ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడి కుటుంబం నుంచి వలసలు ప్రారంభం కావడం మాత్రం కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి షాక్ గానే చెప్పాల్సి ఉంటుంది. చింతకాయల అయ్యన్ప పాత్రుడు పార్టీ ఆవిర్భావం నుంచీ ఉన్న నేత. పార్టీ విధానాలు, సిద్ధాంతాల పట్ల నిబద్ధత ఉన్న నాయకుడిగా పేరొందారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారని పేరు.

పలు సందర్భాలలో పార్టీ లో వ్యవహారాల పట్ల తన అసమ్మతిని, అసంతృప్తినీ కూడా పార్టీ అధినేత సమక్షంలోనే వెల్లడించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి సోదరుడు చించకాయల సన్యాసి పాత్రుడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు రాజకీయ కారణాలు లేవనీ, అయ్యన్న పాత్రుడితో ఉన్న విభేదాలే కారణమని భావిస్తున్నప్పటికీ...సన్యాసి పాత్రుడుతో పాటు పలువురు కౌన్సిలర్లు, కార్యకర్తలు కూడా మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.

ఎన్నికల ముందు నుంచీ కూడా సన్యాసినాయుడు సోదరుడితో అంటీముట్టనట్లుగా వ్యవహరించినప్పటికీ పార్టీ పరిధిని మాత్రం మీర లేదు. అయితే ఎన్నికల అనంతరం ఉత్తరాంధ్రలో పార్టీ వ్యవహారాలు, తనకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం పట్ల ఆయన కినుకుగా ఉన్నట్లు చెబుతారు.  ముఖ్యంగా తన కుమారుడు లక్ష్యంగా పార్టీలోని ప్రత్యర్థులు పావులు కదుపుతూ ఏకంగా తెలుగుదేశం అగ్రనాయకత్వానికి ఫిర్యాదు చేయడంతో సన్యాసి పాత్రుడు ఇక పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. 

ఉత్తరాంధ్రలో సన్యాసినాయుడి పలుకుబడి, కార్యర్తల దన్న గమనించిన వైకాపా ఆయనను సంప్రదించి పార్టీలోకి ఆహ్వానించింది. ఆ ఆహ్వానాన్ని సన్యాసి పాత్రులు దాదాపుగా అంగీకరించినట్లుగానే చెబుతున్నారు. తన స్థాయికి తగినట్లుగా వైకాపా అగ్రనేత సమక్షంలో ఒక భారీ కార్యక్రమం ఏర్పటు చేసి వైకాపా తీర్ధం పుచ్చుకునేందుకు సన్యాసి పాత్రుడు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని ఆయన అనుయాయులు చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం సన్యాసి పాత్రుడి అసంతృప్తిని పెద్దగా పట్టించుకోకపోవడం వల్లనే ఆయనీ నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. ఒక పలుకుబడి కలిగిన నాయకుడు ఈ సమయంలో పార్టీకి దూరం కావడం ఎంత కాదన్నా ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బే.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle