వైసీపీ సర్కార్ పై బీజేపీ హిందుత్వ ఆయుధం?
03-12-201903-12-2019 17:09:56 IST
2019-12-03T11:39:56.263Z03-12-2019 2019-12-03T11:39:54.438Z - - 06-12-2019

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దక్షణాది రాష్ట్రాలలో జెండా పాతాలని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేసేందుకు కూడా గట్టి ప్రయత్నాలే చేస్తుండగా కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే సీనియర్ నేతలకు రెడ్ కార్పెట్ పరించింది. తెలంగాణలో ఎన్నికలకు ముందే చేరికలను మొదలుపెట్టిన బీజేపీ ఏపీలో ఎన్నికల అనంతరం చేరికలకు నేతలు ముందుకొచ్చారు. ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల నుండి నేతలు కాషాయం గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ముమ్మర ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీడీపీ రాజ్యసభ సభ్యులు, టీడీపీలో కీలకంగా వ్యవహరించిన నేతలు ప్రస్తుతం బీజేపీలో ముఖ్యనేతలైపోయారు. త్వరలోనే ఏపీ అసెంబ్లీలో బీజేపీకి సభాపక్షం ఉంటుందని ఆ పార్టీ ముఖ్యనేతలు బహిరంగానే చెప్తున్నారు. ఇప్పటికే వయా గంటా శ్రీనివాస్ ద్వారా చర్చలు, సంప్రదింపులు కూడా జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మరోపక్క అధికార వైసీపీ ఎంపీలు కూడా బీజేపీ కేంద్ర నేతలతో టచ్ లో ఉన్నారని.. అందుకే సీఎం జగన్ ఎంపీలపై ఆంక్షలు కూడా విధించారని రాజకీయ వర్గాల సమాచారం. ఇక రాష్ట్రంలో విషయానికి వస్తే ఇప్పటి వరకు ప్రభుత్వం వివాదాస్పద విధానాలను తీవ్రంగానే వ్యతిరేకిస్తుంది. ఇసుక విధానం, పోలవరం నుండి పీపీఏల, తెలుగు మీడియం రద్దు వరకు సీఎం జగన్ నిర్ణయాలను బీజేపీ తీవ్రంగానే ఎండగడుతుంది. అయితే వైసీపీ నేతలు బీజేపీపై పల్లెత్తు మాటలు అనే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రాష్ట్రంలోని ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలలో బీజేపీ కూడా ఒకటిగా మారిపోయింది. దీంతో ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో బలపడేందుకు తనకంటూ ప్రత్యేక రాగం అందుకోవాలని ఆరాటపడుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం వైసీపీ సర్కార్ మతపరమైన చిక్కులను ఎదుర్కొంటుంది. ప్రభుత్వం కావాలనే చేసినా.. తన ప్రమేయం లేకుండా జరిగినా హిందూ మత వ్యతిరేక నిర్ణయాలు, క్రైస్తవ మత సానుభూతి పరంగా కనిపిస్తుంది. ఇదే ఇప్పుడు బీజేపీ సరికొత్త ఆయుధంగా మార్చుకోనున్నట్లు తెలుస్తుంది. సహజంగానే నలభై శాతం పైన ఉన్న టీడీపీ.. ప్రభుత్వంపై ఈ తరహా దాడికి పూనుకోదు. ఎందుకంటే మరోవర్గం దూరమవుతుందని అంచనా వేస్తుంది. కనుక బీజేపీ హిందుత్వ కార్డుతో ముందుకెళ్తే అటు ప్రభుత్వ వ్యతిరేక, ఇటు ప్రతిపక్ష వ్యతిరేక ప్రజలను తమ వైపుకు తిప్పుకొని బలపడే అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. అందుకే బీజేపీ కొద్దిపాటి చేరికలతో నేతల బలం పెంచుకొని సర్కార్ పై దాడికి సిద్దమవుతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు ఆ పార్టీకి కలిసొస్తుందో చూడాల్సి ఉంది.

సీఎం జగన్ ను అభాసుపాలు చేస్తున్న ఢిల్లీ ప్రతినిధులు
6 minutes ago

పోలీసులు సకాలంలో స్పందిస్తే జరిగేది ఇదే...!
21 minutes ago

పోలీసులపై పూల వర్షం. దేశమంతా హర్షధ్వానాలు..
36 minutes ago

బీజేపీలోకి మరో సీనియర్ హాస్య నటుడు..?
an hour ago

సజ్జనర్ సీన్ రిపీట్ చేశారు..?!
3 hours ago

వారి కంటే ముందే కలుస్తారా..?
3 hours ago

పవన్ అభిమాని అత్యుత్సాహం.. ఏ రెడ్డి తలైనా నరుకుతా!
18 hours ago

ఎంఐఎంకి కీలక పదవి.. పీఏసీ ఛైర్మన్గా అక్బరుద్దీన్ నియామకం
19 hours ago

అమరావతి వార్: వైసీపీ టీడీపీ పోటాపోటీ సమావేశాలు
19 hours ago

ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల లిస్ట్.. ఎక్కడో తేడా కొట్టేస్తుందే?!
20 hours ago
ఇంకా