newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

వైసీపీ సర్కారుకు ఎదురుదాడులేగానీ పరిష్కారం పట్టదా?

05-11-201905-11-2019 01:36:52 IST
Updated On 05-11-2019 01:46:30 ISTUpdated On 05-11-20192019-11-04T20:06:52.243Z05-11-2019 2019-11-04T20:06:46.580Z - 2019-11-04T20:16:30.391Z - 05-11-2019

వైసీపీ సర్కారుకు ఎదురుదాడులేగానీ పరిష్కారం పట్టదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఇసుక విధానంలో ఘోరంగా విఫలమైంది. గత ప్రభుత్వంలో అవినీతికి అడ్డాగా మారిందనే వాదనలతో ముందస్తు ప్రణాళికలు లేకుండానే పాత విధానాన్ని రద్దు చేసేసింది. నూతన విధానం అందుబాటులోకి తెచ్చేవరకు ఇసుక తవ్వకాలను నిలిపివేసింది. దాదాపు వంద రోజులపాటు నూతన విధానం అమల్లోకి తేలేకపోవడంతో అక్కడే సగం విఫలమైంది. ఇక అత్యంత పారదర్శకత పేరుతో తెచ్చిన నూతన విధానం కూడా ప్రజలకు భారంగా మారింది.

నూతన విధానంలో ఖర్చులు కూడా పెరగడంతో యూనిట్ ధర దాదాపు పదివేలకు చేరగా అది కూడా నిమిషాల వ్యవధిలోనే ఆన్ లైన్లో నో స్టాక్ బోర్డు కనిపిస్తుంది. ఫలితంగా నిర్మాణ పనులు అటకెక్కాయి. కార్మికులు రోడ్డున పడ్డారు. ఉపాధి లేక.. ఎప్పటికి పరిస్థితి చక్కబడుతుందో ధైర్యం చెప్పేవాళ్ళు కూడా లేక కొందరు కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రతిపక్షాలు ఇసుక సంక్షోభంగా గగ్గోలు పెట్టినా ప్రభుత్వం కనీసం సమస్యను ఒప్పుకొనేందుకు కూడా ఇష్టపడలేదు.

కార్మికులకు అండగా ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతున్నాయి. ఏపీ రాష్ట్ర బీజేపీ ఇసుక సత్యాగ్రహం పేరుతో ప్రజలలోకి దూసుకెళ్తుంటే తాజాగా జనసేన పార్టీ అధినేత లాంగ్ మార్చ్ కార్యక్రమాన్ని తలపెట్టారు. పవన్ లాంగ్ మార్చ్ కార్యక్రమానికి టీడీపీ మద్దతు ప్రకటించడమే కాక ఆ పార్టీ సీనియర్ నేతలు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఏర్పాటు చేసిన బహిరంగసభలో పవన్ ప్రభుత్వం మీద తీవ్రంగా విరుచుపడ్డారు.

రాష్ట్రంలో ఇసుక విధానంలో వైసీపీ సర్కార్ ఘోరంగా విఫలమైందని.. దీని ప్రభావంతో రాష్ట్రంలో అభివృద్ధి అన్నది కనిపించకుండా పోయిందని తూర్పార పట్టారు. అయితే ఒకపక్క పవన్ సభ జరుగుతుండగానే వైసీపీ నేతలు, ప్రభుత్వం పవన్ మీద ఎదురుదాడి మొదలుపెట్టింది. పవన్ కళ్యాణ్.. చంద్రబాబుకి ఇచ్చిన కాల్షీట్స్ ఇంకా ఉన్నాయంటూ.. టీడీపీకి పవన్ బీ టీం అంటూ మైకుల ముందు మాటల దాడి మొదలుపెట్టారు. టీడీపీ లేకుండా పవన్ సభ పెట్టలేడా అంటూ సాక్షాత్తు మంత్రులే విమర్శలకు దిగారు.

రాజకీయ దాడులు సరే అసలు సమస్యకు పరిష్కారమేంటి అన్నది మాత్రం ప్రభుత్వం సూటిగా చెప్పలేకపోతుంది. రాష్ట్రంలో సమస్యలను ప్రశ్నించిన పార్టీలను వైసీపీ మాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ పవన్ చంద్రబాబుకు బీ టీం అయితే మాత్రం రాష్ట్రంలో సమస్యలను ఎత్తుచూపకూడదా? ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ సమస్యలపై మాట్లాడకూడదా? పోరాడే వాళ్ళకి మద్దతు ఇవ్వకూడదా? అన్నదే అర్ధం కానీ అంశం.

అసలు సమస్యను పక్కనపెట్టిన ప్రభుత్వం టీడీపీని మీ ప్రభుత్వంలో ఇసుక దోపిడీ జరగలేదా? అని ప్రశ్నించడమే విస్తుపోయేలా చేస్తుంది. గత ప్రభుత్వ వైఫల్యం వలనే ప్రజలు వైసీపీకి అత్యధిక స్థానాలని ఇచ్చి గెలిపించారు. కానీ వైసీపీ ఇప్పుడు టీడీపీ హయంలో జరిగింది కనుక మా హయంలో కూడా జరిగితే తప్పేంటి అనే విధంగా మాట్లాడడమే హాస్యాస్పదంగా మారింది. గత ప్రభుత్వం మాదిరే తాము కూడా అంటే ఆ ప్రభుత్వానికి పట్టిన గతే మీ ప్రభుత్వానికి పడుతుందని గుర్తెరిగి సమస్య పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలి.. కాదు కూడదు అంటే బుద్ధిచెప్పేందుకు ప్రజలు ఎప్పుడూ సిద్దమే!

 

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   23 minutes ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   30 minutes ago


మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

   an hour ago


గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

   2 hours ago


భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

   2 hours ago


ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

   2 hours ago


భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   21 hours ago


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   a day ago


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   a day ago


లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle