newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

వైసీపీ వర్సెస్ టీడీపీ: ఏపీలో హోరాహోరీ

11-04-201911-04-2019 08:00:59 IST
Updated On 11-04-2019 08:04:07 ISTUpdated On 11-04-20192019-04-11T02:30:59.905Z11-04-2019 2019-04-11T02:30:56.229Z - 2019-04-11T02:34:07.708Z - 11-04-2019

వైసీపీ వర్సెస్ టీడీపీ: ఏపీలో హోరాహోరీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ స్టేషన్లలో అన్ని సౌకర్యాలు కల్పించారు. ఏపీ రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నాటికి ఏపీ జనాభా  5,30,01,971. అందులో మొత్తం ఓటర్ల సంఖ్య 3,93,45,717గా నమోదైంది. అయితే ఇందులో పురుషులు 1,94,62,339, స్త్రీ ఓటర్లు 1,98,79,421.   ట్రాన్స్‌జెండర్లు3967 మంది కూడ తమ ఓటు హక్కును నమోదు చేసుకొన్నారు.

ఏపీలోని విశాఖపట్టణం జిల్లాలోని గాజువాకలో అత్యధికంగా  3,09,326 మంది ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో భీమిలి అసెంబ్లీ స్థానందే.ఈ స్థానంలో 3,05,958 మంది ఓటర్లున్నారు. అత్యల్పంగా కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో 1,66,177 ఓటర్లున్నారు.

ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా  45,920 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఏపీలోని 175, 25 ఎంపీ స్థానాలకు టీడీపీ, వైసీపీలు పోటీ చేస్తున్నాయి. జనసేన 137 అసెంబ్లీ స్థానాలకు, 16 ఎంపీ స్థానాలకు పోటీ పడుతోంది. జనసేన కూటమిలో ఉన్న బీఎస్పీ 13 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలకు, సీపీఎం, సీపీఐలు ఏడేసి అసెంబ్లీ స్థానాలతో పాటు రెండేసి ఎంపీ స్థానాలకు పోటీకి దిగాయి. టీడీపీ, వైసీపీలు ఒంటరిగా పోటీచేస్తున్నాయి. 

బీజేపీ 173 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాలకు, కాంగ్రెస్ 174 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపింది. ఇండిపెండెంట్లు, ఇతర పార్టీలు 1249 అభ్యర్థులను బరిలోకి దింపారు. ఎంపీ స్థానాల్లో స్వతంత్రులు 193 మంది బరిలో ఉన్నారు. రాష్టంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో  2,118 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. 25 ఎంపీ స్థానాలకు 319 మంది పోటీలో ఉన్నారు. గుంటూరు అసెంబ్లీ స్థానం నుండి అత్యధికంగా 34 మంది పోటీలో ఉన్నారు.

ఆ తర్వాతి స్థానంలో మంగళగిరి నుండి 32 మంది పోటీ చేస్తున్నారు. ఇచ్చాపురం, రాజాం, ఆముదాలవలస నియోజకవర్గాల్లో ఆరుగురు పోటీలో ఉన్నారు.ఇక నంద్యాల ఎంపీ స్థానం నుండి అత్యధికంగా 20 మంది...అత్యల్పంగా చిత్తూరు ఎంపీ స్థానం నుండి కేవలం 8 మంది మాత్రమే బరిలో వున్నారు.

గెలుపుకోసం వైసీపీ, టీడీపీ హోరాహోరీ తలపడుతున్నాయి. ఎలాగైనా అధికారం నిలుపుకోవడానికి టీడీపీ, ఈసారైనా అమరావతిని చేజిక్కుంచుకోవాలని వైసీపీ ఆరాటపడుతున్నాయి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle