newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

వైసీపీ రంగుల పిచ్చి పీక్స్.. దేవుడినీ వదలరా?

01-12-201901-12-2019 09:28:13 IST
2019-12-01T03:58:13.644Z01-12-2019 2019-12-01T03:58:08.904Z - - 05-08-2020

వైసీపీ రంగుల పిచ్చి పీక్స్.. దేవుడినీ వదలరా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నాళ్ళో వేచిన హృదయం అని ఓ సినీ కవి రాసిన చందంగా ఇప్పుడు ఏపీలో అధికార పార్టీకి ఒక్కసారిగా పట్టరాని అధికారం వచ్చేసింది. అక్కడ కవి రాసింది ప్రేమ విరహం కాగా ఇక్కడ వీరిది అధికార విరహం. తండ్రి మరణానంతరం సీఎం కుర్చీ టార్గెట్ గా రంగంలోకి దిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో శ్రమకోర్చి.. పట్టువదలని విక్రమార్కుడిలా ఎన్నివిధాలుగా ప్రజలను తనవైపుకు తిప్పుకోవాలో అన్ని ట్రై చేసి చివరికి దక్కించుకున్నారు.

ఇక అధికారంలోకి వచ్చిన క్షణం నుండే సీఎంగా అయన తండ్రిని గుర్తుచేస్తూనే తన మార్క్ వేసుకోవాలని జగన్ ఆరాటపడుతుంటే ఆ పార్టీ నేతలు పార్టీకి ప్రభుత్వానికి తేడా లేకుండా చేసేశారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రభుత్వమంటే తమ పార్టీనే అని రెండూ ఒక్కటే అన్నట్లుగా మారిపోయింది. గ్రామస్థాయి నేత నుండి మంత్రి వరకు అందరూ ప్రభుత్వమే.. ఇక ఆ పార్టీ రంగులే జాతీయ జెండా రంగులు అన్న చందంగా మారిపోయింది.

గత ఆరు నెలలుగా ఈ రంగుల పిచ్చి ఎంతవరకు అంటే కొలతలే లేవు. ఇందుగలదని అందు లేదని చెప్పడం కుదరదు... ఎందెందు వెతికినా అంతటా ఆ రంగులే కనిపించును. మొదట జగన్ సర్కార్ మొదలుపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థకు మొదలైన ఈ రంగుల రాట్నం అక్కడ నుండి బడి.. గుడి.. రోడ్డు.. రోడ్డు పక్కన డివైడర్లు.. కొన్ని చోట్ల సమాధులకు, మరికొన్ని చోట్ల గేదెల కొమ్ములకు కూడా ఆ పార్టీ రంగులేసుకొని ఆనందం పొందారు.

మొదట ప్రభుత్వనిదైతే చాలు తమ పార్టీదే అన్నట్లుగా సాగిన ఈ వ్యవహారంలో తీవ్ర విమర్శలు తలెత్తాయి. ఓ పాఠశాలకు వేసిన జాతీయ జెండా రంగులను తొలగించి తమ పార్టీ రంగులేసుకున్న వ్యవహారం జాతీయ మీడియా దుమ్మెత్తిపోయడంతో ప్రభుత్వం చివాట్లు పెట్టింది. చివరికి మళ్ళీ జాతీయ జెండా రంగులే అద్దారు. ప్రభుత్వ ఆస్తులతోనే ఆగని ఆ వ్యవహారం ఇప్పుడు దేవుళ్ళకు కూడా అంటించేశారు.

తాజాగా విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలోని ఓ సాయిబాబా గుడిలో బాబాకు వైసీపీ రంగులు కల్గిన వస్త్రాన్ని కప్పి ఉంచడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఓ స్థానిక నేత చేసిన ఈ పనిని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఫోటో తీసి ఉంచారు. దీనిపై నేషనల్ మీడియా మరోసారి ఏకిపారేస్తుంది. గత రెండు రోజులుగా ఇది సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ గా మారింది.

దీనిపై స్పందించిన నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఇన్నాళ్లు ప్రభుత్వ ఆస్తులకు, వైసీపీ నేతల ప్రయివేట్ ఆస్తులకు పరిమితమై ఈ వ్యవహారం శృతి మించి పోయిందంటున్నారు. కొందరైతే డౌట్ లేదు రాష్ట్రంలో వైసీపీ నేతలకు పిచ్చి పీక్స్ కి చేరిందని అర్జెంట్ గా ట్రీట్ మెంట్ ఇప్పించాలంటున్నారు. మరికొందరేమో రాజకీయాలకు మిమ్మల్ని కూడా బలిచేస్తున్నందుకు క్షమించండి బాబా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle