newssting
BITING NEWS :
*తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది... లాక్ డౌన్ కొనసాగించాలని మోడీకి చెబుతా*-కేసీయార్ *ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 303 *ఎంపీల వేతనాల్లో 30 శాతం కొోత *న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మొత్తంగా 364కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

వైసీపీ మైండ్ గేమ్.. డిఫెన్స్‌లో పవన్ కళ్యాణ్

18-02-202018-02-2020 13:01:52 IST
2020-02-18T07:31:52.740Z18-02-2020 2020-02-18T07:31:49.849Z - - 07-04-2020

వైసీపీ మైండ్ గేమ్.. డిఫెన్స్‌లో పవన్ కళ్యాణ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు వుండరనేది సామెత. అది నిజమే. ఏపీలో అధికార వైసీపీ మైండ్ గేమ్ ప్రారంభించింది. దీంతో జనసేన డిఫెన్స్ లో పడిపోయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది.  తమ పార్టీతో పొత్తుకు ఒకే చెప్పి వైసీపీతో బీజేపీ సహజీవనాన్ని జనసేనాని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా కొంత కాలం వేచి చూసి తర్వాత బై కొట్టేయడం బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. వైసీపీ లీకులతో జనసేన నేతలకు సౌండ్ లేకుండా పోయింది.

పవన్ కళ్యాణ్ రాజకీయం ఎప్పుడూ అయోమయంగా ఉంటుంది. ఆయన పార్టీ పెట్టి పోటీ చేయకపోవడం దగ్గర నుంచి 2019 ఎన్నికల్లో చిత్ర, విచిత్ర పొత్తులతో రంగంలోకి దిగడంతో క్లారిటీ లేకుండా పోయింది.  ఓడిపోయిన తర్వాత తత్వం బోధపడడంతో  పవన్ బీజేపీతో పొత్తుకు సై అన్నారు.  అది జరిగి నెల రోజులు కాకుండానే కాషాయ పార్టీ కషాయం త్రాగించేస్తూ ఉండడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఏపీలో రెండు బలమైన పార్టీలు ఉన్నాయి. అందులో టీడీపీకి బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇక వైసీపీతో  స్నేహపూర్వకంగా ఉంటూ బలోపేతం కావాలని కమల నాథుల యోచనగా ఉంది.

జగన్ కు వరుసగా రెండు రోజుల్లో  ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా  అపాయింట్ మెంట్లతో జనసేనలో కలవరం ప్రారంభమైంది.  పవన్ వరకు బలం, అధికారం లేకపోయిన బీజేపీ తోడు అయితే  కేంద్ర సాయంతో వూహించని పరిణామాలు ఉంటాయని భావిస్తున్నారు.

దీంతో కమలంతో  సాన్నిహిత్యానికి వైసీపీ రెడీ అయిపోయిందనే ప్రచారం జరుగుతోంది. అటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బలమైన రాజకీయ పార్టీలతో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు సమాచారం. జగన్ ను కదిలించడానికి  పవన్ కళ్యాణ్ పొత్తులను ఎరగా చూపించారనే టాక్ నడుస్తోంది. 

కమలం రమ్మనకపోయినా తనకు తానుగా బీజేపీతో జతకట్టిన పవన్ కళ్యాణ్ బీజేపీ అధిష్టానం అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెబుతున్నారు. కాషాయంతో  జత కడతానంటూ ఢిల్లీకి వెళ్లిన జనసేనానికి ప్రధానితో గానీ, అమిత్ షాతో గాని  అపాయింట్ మెంట్ లభించలేదు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు రాష్ట్ర స్థాయి నేతలతో సర్దుకుపోవాలంటూ సూచనలు చేసి పంపించారు.  పవన్ కళ్యాణ్ లాంటి క్రేజీ స్టార్ కు సరైన గుర్తింపును ఇవ్వలేదనే టాక్ వినిపిస్తోంది.

రెండు రోజుల పాటు పవన్ అమరావతి పర్యటించారు. పవన్ ఒంటరిగా పర్యటించడం చర్చకు దారితీస్తోంది. అమరావతి రైతులను పరామర్శించినప్పుడు పవన్ ఎవరు తోడు ఉన్నా, లేకున్నా రాజధాని పోరాటం కొనసాగిస్తానని చెప్పడంతో... పవన్ బీజేపీ మీద ఆశలు వదిలేసుకున్నట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో బీజేపీకి వైసీపీ సహకారం అవసరం ఉంది.  రాజ్యసభలో బిల్లులు గట్టెక్కాలంటే జగన్ పార్టీ తప్పని సరి. ఉత్తరాదిన అసెంబ్లీ ఎన్నికలలో  తగులుతున్న షాక్ లతో రాజ్యసభలో కమల దళం ప్రాతినిధ్యం తగ్గనుంది.  

ఇంకా చెప్పాలంటే త్వరలో వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లే వారు 10 మంది వరకు ఉంటారు. వాళ్లంతా కీలక బిల్లుల ఆమోదానికి సహకారం వైసీపీకి కలిసి రానుంది. దాంతో జగన్ చక్రం తిప్పడంతో మోడీ, షాలు అపాయింట్ మెంట్ దొరికిపోయాయి. ఇక మూడు రాజధానుల విషయంలో జగన్ నిర్ణయానికి కేంద్రం లోపాయికారిగా సంపూర్ణ మద్దతు ఇస్తోంది, ఇది పవన్ కళ్యాణ్ ను కలవరించే అంశం... ఏదో చేద్దామని  బీజేపీకి దగ్గరైతే... ఉనికి కోల్పోయే ప్రమాదం రానుందని పవన్ పసిగట్టారు.  చివరకు అమరావతిపై కేంద్రం స్టాండ్ ఏంటో తెలుసుకొని  కాషాయానికి విడాకులు ఇచ్చేయడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారని ప్రచారం జరుగుతోంది. 

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

   6 hours ago


కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

   10 hours ago


తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

   10 hours ago


కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

   13 hours ago


ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

   16 hours ago


బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

   16 hours ago


‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

   16 hours ago


డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

   16 hours ago


గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

   19 hours ago


లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

   19 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle