newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

వైసీపీ, బీజేపీ మ‌ధ్య దూరం పెరుగుతోందా..?

01-07-201901-07-2019 08:59:27 IST
Updated On 01-07-2019 08:44:11 ISTUpdated On 01-07-20192019-07-01T03:29:27.141Z01-07-2019 2019-07-01T03:09:33.667Z - 2019-07-01T03:14:11.133Z - 01-07-2019

వైసీపీ, బీజేపీ మ‌ధ్య దూరం పెరుగుతోందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎద‌గాల‌ని ఉవ్విళ్లూరుతున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ ఇందుకు సంబంధించి వ్యూహాలు ర‌చిస్తోంది.

రెండు రోజులుగా మంగ‌ళ‌గిరిలో బీజేపీ నేత‌లు ర‌హ‌స్యంగా స‌మావేశ‌మ‌వుతూ ఈ మిష‌న్‌కు సంబంధించి క‌స‌ర‌త్తు చేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసుకోవాలంటే ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవాలి, ఇత‌ర పార్టీల ఏయే నాయ‌కుల‌ను చేర్చుకుంటే పార్టీకి ప్ర‌యోజ‌నం అనే అంశాల‌పై బీజేపీ నేత‌లు చ‌ర్చిస్తున్నార‌ని తెలుస్తోంది.

రాష్ట్రంలో బీజేపీ ఎదిగేందుకు ముఖ్యంగా వ‌ల‌స‌ల‌నే న‌మ్ముకుంది. అది కూడా తెలుగుదేశం పార్టీ నుంచే. టీడీపీని పూర్తిగా బ‌ల‌హీనం చేసి ఆ స్థానంలోకి తాము ఎద‌గాల‌నేది బీజేపీ వ్యూహ‌ర‌చ‌న. అయితే, ఇదే స‌మ‌యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనూ బీజేపీకి దూరం పెరుగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.

పార్టీ ఎద‌గాలంటే రాష్ట్రంలో అధికారంలోకి వైసీపీ త‌ప్పుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఎండ‌గ‌డుతూ ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించాలి. కేవ‌లం వ‌ల‌స‌ల‌నే న‌మ్ముకుంటే ప‌ని జ‌ర‌గ‌దు. ఈ విష‌యాన్ని పార్టీ జాతీయ అధ్య‌క్షులు అమిత్ షా కూడా రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించాల‌ని ఆయ‌న ఇప్ప‌టికే బీజేపీ నేత‌ల‌కు సూచించారు. ఇటీవ‌ల బీజేపీ నేత‌ల మాట‌లు చూస్తుంటే వారి అమిత్ షా సూచ‌న‌ల‌ను ఫాలో అవుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ అండ‌గా ఉండేది.

తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టే వ్య‌వ‌హారాల్లో వైసీపీతో బీజేపీ కూడా గొంతు క‌లిపేది. టీడీపీని టార్గెట్ చేయ‌డంలో వైసీపీకి చేదోడువాదోడుగా ఉండేది. ఎన్నిక‌ల త‌ర్వాత కొన్నిరోజులు కూడా వైసీపీకి అనుకూలంగా బీజేపీ నేత‌లు మాట్లాడారు.

అయితే, ప్ర‌జావేదిక కూల్చివేత వ్య‌వ‌హారంలో మాత్రం జ‌గ‌న్ వైఖ‌రిని బీజేపీ నేత‌లు ఖండించారు. ప్ర‌జ‌ల సొమ్ముతో నిర్మించినందున ప్ర‌జావేదిక‌ను ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కు వినియోగించు ఉంటే బాగుండేద‌ని ఆ పార్టీ నేత‌లు బాహాటంగా చెప్పారు.

ఇక‌, రాష్ట్ర బీజేపీ కీల‌క నాయ‌కురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి స‌హా ఇత‌ర నేతలు ప్ర‌త్యేక హోదా విష‌యంలో జ‌గ‌న్ వైఖ‌రిని ప‌దేప‌దే విమ‌ర్శిస్తున్నారు. ప్ర‌త్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయ‌మ‌ని వారు చెబుతున్నారు. అయినా కూడా జ‌గ‌న్ త‌ర‌చూ ప్ర‌త్యేక హోదా అడుగుతూ, అసెంబ్లీలో తీర్మానం చేసి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు.

ఇక‌, బీజేపీలోకి ఎమ్మెల్యేలు చేరితే వైసీపీ - బీజేపీ మ‌ధ్య మ‌రింత దూరం పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేల‌పై వేటు త‌ప్ప‌నిస‌రి అని మొద‌టి అసెంబ్లీ స‌మావేశాల్లోనే జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.

ఒక‌వేళ టీడీపీ ఎమ్మెల్యేలు ఎవ‌రైనా బీజేపీలో చేరితే అప్పుడు వారిపై చ‌ర్య‌ల విష‌యంలో జ‌గ‌న్ ఎటువంటి వైఖరి అవ‌లంభిస్తార‌నే దానిపైనే రెండు పార్టీల మ‌ధ్య సంబంధాలు ఆధార‌ప‌డి ఉంటాయి. ఒక‌వేళ జ‌గ‌న్ చెప్పిన‌ట్లుగా స్పీక‌ర్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఒక‌వేళ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు క‌నుక తీసుకుంటే బీజేపీకి మంట పుట్ట‌డం ఖాయం. 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో స‌ఖ్య‌త కొన‌సాగించాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నా రాష్ట్రంలో ఎద‌గాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న బీజేపీ.. వైసీపీపైన రానున్న రోజుల్లో విమ‌ర్శ‌లు పెంచే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. 

 

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   9 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   10 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   11 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   13 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   15 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   15 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   15 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   15 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   15 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   16 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle