వైసీపీ ప్రభంజనం.. ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయా?
23-05-201923-05-2019 09:52:17 IST
Updated On 27-06-2019 11:39:16 ISTUpdated On 27-06-20192019-05-23T04:22:17.768Z23-05-2019 2019-05-23T04:22:15.420Z - 2019-06-27T06:09:16.089Z - 27-06-2019

చంద్రబాబు అంచనాలు ఘోరంగా తప్పిపోయాయి. వంద శాతం కాదు వెయ్యిశాతం అన్న చంద్రబాబు ధీమా సడలిపోయింది. కనీసం 50 సీట్లు కూడా వచ్చే అవకాశం తగ్గిపోయింది. జగన్ ప్రభంజనం నిజమయింది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు సైకిల్ కుదేలైంది. ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌లో తిరుగుతోంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డ సంగతి తెలిసిందే. తొలుత ప్రారంభించిన పోస్టల్ బ్యాలెట్లలో వైసీపీ పూర్తి ఆధిక్యత కనబరిచింది. అంతా అనుకున్న విధంగా వైస్సార్సీపీ దూసుకుపోతోంది. కేంద్రంలో ఎన్డీయే హవా కొనసాగనున్నదని చెప్పాయి. ఇక ఏపీ విషయానికి వస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే హవా అని వివిధ వార్తా సంస్థల సర్వేలు తేల్చి చెప్పాయి. ఇండియాటుడే –మై మాక్సిస్ ఎగ్జిట్ పోల్ ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 18 నుంచి 20 ఎంపీ సీట్లు దక్కే అవకాశం ఉందని చెప్పాయి. ఇంచుమించు అన్ని సర్వేలు నిజమవుతున్నాయి. మరోసారి లగడపాటి సర్వే అట్టర్ ఫ్లాప్ అయింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ దూకుడుగా ఉంది. పలుచోట్ల తొలి ఫలితాల్లోనే ఫ్యాన్ దూసుకుపోతోంది. ఓట్ల లెక్కింపులో వైఎస్సార్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. అటు పులివెందుల నియోజకవర్గంలో జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హవాను చాటుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 16 ప్రాంతాల్లో 36 కేంద్రాల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మరోవైపు అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి కౌంటింగ్ కేంద్రాల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది సమీక్షిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి సమాచారం తెలుసుకోవటంతో పాటు అక్కడి సమస్యలను పరిష్కారం చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

టీడీపీ కార్యాలయాన్ని.. కూల్చేయాల్సిందేనా!
2 hours ago

ఎంపీ అర్వింద్‌కు పసుపు సెగ..!
3 hours ago

కలెక్టర్‌పై బదిలీవేటు! మంత్రితో తేడాలే కారణమా?
3 hours ago

చేనేత వస్త్ర ప్రదర్శనలో విజయమ్మ, భారతి సందడి
3 hours ago

ఆ బ్రాండ్ల సంగతి నీకెందుకు తల్లీ వదిలేయ్!
4 hours ago

ఖాళీ ఖజానా.. అధికారుల హైరానా!
7 hours ago

జగన్ రివర్స్ పాలనపై చంద్రబాబు రివర్స్ నడక
10 hours ago

ఆర్టీసీ విలీనం సహా.. అసెంబ్లీలో కీలక బిల్లులు
10 hours ago

ఉన్నావ్ దోషులకు శిక్ష పడుతుందా?
10 hours ago

ఉల్లికి తోడు పాల ధరలకు రెక్కలు
11 hours ago
ఇంకా