newssting
BITING NEWS :
*ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా. మండలి ఉండాలా వద్దా అనే దానిపై సోమవారం చర్చ. సోమవారం మళ్ళీ సభ పెట్టి మండలిపై చర్చించాలన్న సీఎం వైఎస్ జగన్ *చైర్మన్ నిర్ణయంపై ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. క్రిమినల్ కేసులున్న వాళ్ళు అసెంబ్లీలో ఉన్నారు. అందరి సలహాలు తీసుకున్నాకే బిల్లులు సెలక్ట్ కమిటీకి పంపారు - యనమల *ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా. మండలి ఉండాలా వద్దా అనే దానిపై సోమవారం చర్చ. సోమవారం మళ్ళీ సభ పెట్టి మండలిపై చర్చించాలన్న సీఎం వైఎస్ జగన్ *సంగారెడ్డి జిల్లాలో మరో దిశ ఘటన. అమీర్ పూర్ లో షాప్ కు వెళ్లిన బాలికను కారులో ఎత్తుకెళ్లిన ముగ్గురు దుండగులు. మద్యం తాగి బాలికపై గ్యాంగ్ రేప్. 100 కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చిన బాలిక తల్లిదండ్రులు*శాసనమండలి రద్దుపై చట్టపరంగా ఆలోచన చేస్తాం.. ఎన్ని అడ్డంకులు వచ్చినా మేం ముందుకు వెళ్తాం-మంత్రి బొత్స*అమరావతి: ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం*వికేంద్రీకరణ విషయంలో కేంద్రానికి సంబంధంలేదు.. అమరావతి రైతులకు అండగా ఉంటాం-పవన్ కల్యాణ్*అమరావతి: ఏపీ రాజధాని పిటిషన్ల విచారణకు హైకోర్ట్ ప్రత్యేక బెంచ్.. సీజే ఆధ్వర్యంలో ఏర్పాటైన త్రిసభ్య ధర్మాసనం

వైసీపీ నేమ్స్ పాలిటిక్స్.. అడుసుతొక్కనేల.. కాలుకడగనేల!!

06-11-201906-11-2019 07:25:26 IST
Updated On 06-11-2019 17:12:24 ISTUpdated On 06-11-20192019-11-06T01:55:26.373Z06-11-2019 2019-11-06T01:55:24.005Z - 2019-11-06T11:42:24.195Z - 06-11-2019

వైసీపీ నేమ్స్ పాలిటిక్స్.. అడుసుతొక్కనేల.. కాలుకడగనేల!!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అడుసు తొక్కనేల.. కాలు కడగనేల అన్న పాత సామెత ఇప్పుడు ఏపీలో కొత్త ప్రభుత్వానికి అచ్చుగుద్దినట్లుగా సరిపోతుందేమో అనిపిస్తుంది. ఏ మాత్రం పర్యాసనాల గురించి ఆలోచించకుండా ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని ఒంటెద్దుపోకడ నిర్ణయాలు ప్రజలను బలితీసుకుంటుంటే.. మరికొన్ని నిర్ణయాలు ప్రజలలో భావోద్వేగంగా మారి తిరబడుతున్నారని ప్రభుత్వమే యూ టర్న్ తీసుకొని నిర్ణయాలను వెనక్కు తీసుకుంటుంది.

వైసీపీ సర్కార్ వితండవాదంగా తీసుకున్న నిర్ణయాలను కొద్దిగా వెనక్కు వెళ్లి చూస్తే చాలానే కనిపిస్తాయి. పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్స్ మీద సమీక్షలకు వెళ్లవద్దని కేంద్రం నుండి రాష్ట్రంలో మేధావుల వరకు ఎందరు చెప్పినా వెనక్కు తగ్గని సీఎంకు చివరికి రాష్ట్రంలో చీకట్లు వస్తే తప్ప అర్ధం కాలేదు. ఇక ఇసుక విధానం గురించి మాట్లాడుకోకపోవడమే మంచింది. ఎందుకంటే ప్రజలు గగ్గోలుపెట్టినా స్పందించేందుకు ప్రభుత్వమే సిద్ధంగా లేదు. ఇక అన్నక్యాంటీన్లపై ఎంతమంది మొత్తుకున్నా ఈ మొద్దు ప్రభుత్వానికి ఎక్కనేలేదు.

ఇక కలర్స్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం విమర్శలపావుతున్నా వెనక్కు తగ్గడమే లేదు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ పంచాయతీ కార్యాలయాలైనా అన్నిటికి వైసీపీ మూడు రంగులే కనిపిస్తున్నాయి. ఈమధ్యనే ఓ పంచాయతీ భవనానికి ఎంతో హుందాగా జాతీయ జెండా మూడు రంగులుండగా స్థానిక ప్రజాప్రతినిధులు దగ్గరుండి జాతీయ జెండా రంగుల స్థానంలో వైసీపీ మూడు రంగులు వేయించారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా, సోషల్ మీడియా తీవ్రంగా ఎండగట్టడంతో వైసీపీ ప్రభుత్వం వెనక్కు తగ్గి మళ్ళీ ఆ ప్రజాప్రతినిధులే ఆ భవనానికి జాతీయ జెండా రంగులనే వేయించాల్సివచ్చింది.

ఇక ఇప్పుడు భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా అవార్డుల విషయంలో కూడా సర్కారుకు మరోసారి యూటర్న్ తప్పలేదు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. పదవతరగతిలో ప్రతిభావంతమైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు అవార్డులను ఇచ్చేందుకు ప్రారంభించిన ఈ కార్యక్రమానికి అప్పుడు అబ్దుల్ కలాం గారి పేరుపెట్టారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ప్రతి ప్రథకానికి వైఎస్ఆర్ పేరుగా మార్చేస్తున్న సంగతి తెలిసిందే.

పథకం ఏదైనా వైఎస్ఆర్ పేరు ఉండాల్సిందేనని అనుకున్నారో... అబ్దుల్ కలాం గారు కూడా టీడీపీకి చెందినవారేనని అనుకున్నారో కానీ అయన పేరు తీసేసి వైఎస్ఆర్ పేరుగా మార్చేశారు. ఈ మేరకు ఓ జీవోను కూడా విడుదల చేసేశారు. అయితే కలాం పేరు తీసేసి మరీ వైఎస్ఆర్ పేరు పెట్టడమేంటని? కలాం గారికన్నా వైఎస్ఆర్ గొప్పవాడా? అంటూ విమర్శలు చుట్టముట్టడంతో మరోసారి వెనక్కు తగ్గిన ప్రభుత్వం మళ్ళీ కలాం గారి పేరునే చేర్చింది. ఇందుకోసం మళ్ళీ కొత్త ఆదేశాలు కూడా ఇచ్చారు.

ఇక పేరు మార్పు మీద తీసుకున్న యూ టర్న్ ను సీఎం జగన్మోహన్ రెడ్డి కవర్ చేసుకోవడం కూడా హైలెట్ అనే చెప్పాలి. ముందుగా ఈ విషయంలో అధికారులపై సీఎం సీరియస్ అనే వార్తలు లీకులిచ్చి తనకు తెలియకుండానే అధికారులు మార్చేశారని.. సీఎం వెంటనే పాత పేరునే ఉంచాలని ఆదేశాలిచ్చారని కవర్ చేసుకున్నారు. అయితే తనకు తెలియకుండానే తన ప్రభుత్వంలో జీవోలు విడుదల అవుతున్నాయా? అనే ప్రశ్న మనకు మనమే వేసుకోవాలేమో! వాళ్ళని అడిగితే ఇంకెన్ని చెప్తారో ఏమో!

 

 

దావోస్‌లో బిజీబిజీ.. కేటీఆర్‌కి అరుదైన అవకాశం

దావోస్‌లో బిజీబిజీ.. కేటీఆర్‌కి అరుదైన అవకాశం

   11 minutes ago


మండ‌లి ర‌ద్దు దిశ‌గా జ‌గ‌న్‌..! ఇద్ద‌రు మంత్రులు ఔట్‌..?

మండ‌లి ర‌ద్దు దిశ‌గా జ‌గ‌న్‌..! ఇద్ద‌రు మంత్రులు ఔట్‌..?

   an hour ago


ఆ అవ‌కాశం ఉన్నందునే కౌన్సిల్ ర‌ద్దు చేస్తున్నారా..?

ఆ అవ‌కాశం ఉన్నందునే కౌన్సిల్ ర‌ద్దు చేస్తున్నారా..?

   an hour ago


మునిసిపోల్స్‌లో  గెలుపుపై టీఆర్ఎస్ ధీమా

మునిసిపోల్స్‌లో గెలుపుపై టీఆర్ఎస్ ధీమా

   14 hours ago


‘‘అది వైసీపీ కాదు.. యువజన శ్రామిక రౌడీ పార్టీ’’

‘‘అది వైసీపీ కాదు.. యువజన శ్రామిక రౌడీ పార్టీ’’

   16 hours ago


‘‘మీ పోరాటం, తెగువ చిరస్మరణీయం’’.. ఎమ్మెల్సీలకు బాబు ప్రశంసలు

‘‘మీ పోరాటం, తెగువ చిరస్మరణీయం’’.. ఎమ్మెల్సీలకు బాబు ప్రశంసలు

   18 hours ago


ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ ఫోకస్. తెల్ల రేషన్ కార్డుదారులపై కేసులు

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ ఫోకస్. తెల్ల రేషన్ కార్డుదారులపై కేసులు

   19 hours ago


పీసీసీపై అధిష్టానానికి సీనియర్ల లేఖ.. టార్గెట్ రేవంత్ రెడ్డే?

పీసీసీపై అధిష్టానానికి సీనియర్ల లేఖ.. టార్గెట్ రేవంత్ రెడ్డే?

   19 hours ago


మండలి పరిణామాలపై ఛైర్మన్ షరీఫ్ మనస్తాపం?

మండలి పరిణామాలపై ఛైర్మన్ షరీఫ్ మనస్తాపం?

   19 hours ago


కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా 93 మంది ఢీ... అసలేం జరుగుతోంది?

కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా 93 మంది ఢీ... అసలేం జరుగుతోంది?

   20 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle