newssting
BITING NEWS :
*తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది... లాక్ డౌన్ కొనసాగించాలని మోడీకి చెబుతా*-కేసీయార్ *ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 303 *ఎంపీల వేతనాల్లో 30 శాతం కొోత *న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మొత్తంగా 364కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

వైసీపీ నేతల్లో ‘లోకల్’ ఫీవర్... మంత్రుల్లో కనిపించని జోష్

27-02-202027-02-2020 10:53:09 IST
Updated On 27-02-2020 11:18:52 ISTUpdated On 27-02-20202020-02-27T05:23:09.401Z27-02-2020 2020-02-27T05:22:39.673Z - 2020-02-27T05:48:52.164Z - 27-02-2020

వైసీపీ నేతల్లో ‘లోకల్’ ఫీవర్... మంత్రుల్లో  కనిపించని జోష్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎక్కడైనా స్థానిక సంస్థల ఎన్నికలంటే అధికారపార్టీ నేతల్లో జోష్ ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడంలేదు. స్థానిక సంస్థల ఎన్నికలంటేనే మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలను మార్చి 15లోగా నిర్వహించాలని వైసీపీ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. జగన్ మంత్రులకు స్థానిక సంస్థల ఎన్నికలను సక్సెస్ చెయ్యాలనే టాస్క్ అప్పగించారు. ఫలితాలు అధికార పార్టీ కి అనుకూలంగా వస్తే ఓకే...ఒక వేళ వ్యతిరేకంగా వస్తే ఏం జరుగుతోంది అనే టెన్షన్ మంత్రులలో నెలకొంది. 9 నెలల పాలనకు ఈ ఎన్నికలు మచ్చుతునకగా నిలవనున్నాయి. 

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి ప్రారంభం కాబోతుంది.  దీంతో జగన్ మంత్రులకు స్థానిక సంస్థల ఎన్నికలను సక్సెస్ చెయ్యాలనే టాస్క్ అప్పగించారు. గత సాధారణ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన నేపధ్యంలో ఇప్పుడు కూడా స్థానిక సమరంలో విజయం సాధించాలని జగన్ భావిస్తున్నారు.

అందుకే ఈ ఎన్నికల టాస్క్ ను మంత్రులకు అప్పగించారు . స్థానిక సంస్థల ఎన్నికలంటే అధికారపార్టీ నేతలు చాలా ఉత్సాహంగా ఉంటారు. అందుకు అనుకూలంగానే స్థానిక ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా వస్తూ ఉంటాయి.. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9నెలలు కాలంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలతో స్థానిక సంస్థల ఎన్నికలంటే ఆ పార్టీ నేతల్లో గుబులుపుడుతోంది.. పైకి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నా లోపల మాత్రం ఎంతో కొంత అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల టాస్క్ ను  సీఎం జగన్ మోహ న్ రెడ్డి వైసీపీ మంత్రులకు అప్పగించారు. ఇక మంత్రులు స్థానిక సమరంలో సత్తా చాటితేనే మంత్రిగా వారికి అవకాశం ఉండేది . లేదంటే మంత్రి పదవి ఊడుతుందనే సంకేతాలు కూడా ఇచ్చారని సమాచారం . దీంతో మంత్రులకు తమ పదవి నిలబెట్టుకోవాలంటే ఉరుకులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం, పోల్‌ మేనేజ్‌మెంట్ వంటి అంశాల దాకా అన్ని బాధ్యతలు మంత్రులకే అప్పగించినట్లు తెలుస్తోంది.. స్థానిక నేతలను, ఎమ్మెల్యేలను సమన్వయపరచడం, విభేదాలను పరిష్కరించడం వంటి కీలకమైన బాధ్యత కూడా మంత్రులకే జగన్ అప్పగించారు.

మరోవైపు ఎన్నికలు ముగిసే వరకూ మంత్రులు వారి శాఖల విషయాలు పక్కన పెట్టి ఎన్నికలపైనే పూర్తి స్థాయి దృష్టి పెట్టాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇన్ ఛార్జ్ మంత్రులతో పాటు లోకల్ మంత్రులు జిల్లాలకే పరిమితమై ఎన్నికల కసరత్తు పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారట .  ఎన్నికల్లో పనితీరు సరిగా లేకుంటే మాత్రం ఉద్వాసన పలకటం ఖాయమే అని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

దీంతో లోకల్ వార్ అంటేనే మంత్రులు భయపడుతున్నారు. సీఎం జగన్ తాజా నిర్ణయం మంత్రులకు టెన్షన్ కలిగిస్తోంది . ఇప్పుడు ఈ టాస్క్ సక్సెస్ చేస్తేనే జగన్ మంత్రులుగా గుర్తించేది. కాబట్టి ఆదేశాలు వచ్చినప్పటి నుంచి ఎక్కువ సమయం జిల్లాలకే పరిమితమై ఉరుకులు పరుగులు పెడుతున్నారు. జగన్‌ నిర్దేశించిన లక్ష్యాలను చేరేందుకు గట్టి ప్రయత్నాలు ప్రారంభించారని అంటున్నారు. ఇక మరో వైపు ప్రతిపక్షాల నేతలు స్థానిక సమరాన్ని ఎదుర్కోటానికి సన్నాహాలు చేస్తున్నారు .

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

   5 hours ago


కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

   9 hours ago


తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

   9 hours ago


కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

   11 hours ago


ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

   15 hours ago


బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

   15 hours ago


‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

   15 hours ago


డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

   15 hours ago


గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

   17 hours ago


లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

   17 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle