newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

వైసీపీ నేతలకు లెక్కల మాస్టారు కావాలేమో?!

05-10-201905-10-2019 14:14:15 IST
2019-10-05T08:44:15.919Z05-10-2019 2019-10-05T08:37:07.011Z - - 09-12-2019

వైసీపీ నేతలకు లెక్కల మాస్టారు కావాలేమో?!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
'అక్టోబర్ 2వ తేదీ జాతిపిత మహాత్మ గాంధీ జయంతి 150 జయంతి. 150వ జయంతి అంటే ఆయన పుట్టి 70 సంవత్సరాలు అన్నమాట' మీకు అసలు బుద్దుందా 70 సంవత్సరాలు ఏంటి? అంటారా.. ఈ మాట మేము అనడం లేదండి బాబు.. వైసీపీ ఎమ్మెల్యే విడదల రజని గారు సెలవిచ్చారు. ఇక 8x4 అంటే 12 టీఎంసీలు అన్నమాట. ఆ మాత్రం కూడా తెలియని వాళ్లా మా ఫ్రభుత్వం గురించి మాట్లాడేది. ఈ మాట అన్నది కూడా మేము కాదండోయ్. ఏపీ నీటిపారుదల శాఖా మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు. ఇదీ ఏపీలో వైసీపీ నేతల లెక్కల వ్యవహారం.

ఆ మధ్య ఏపీలో వరదలు ముంచెత్తుతున్న సమయంలో ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న ఆరోపణలపై స్పందించేందుకు మంత్రి అనిల్ కుమార్ మీడియా సమావేశం పెట్టి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఆ వివరణలో మాజీ మంత్రులు లోకేష్, దేవినేని ఉమాలపై విమర్శలు చేసే క్రమంలో 8x4 అంటే 12 టీఎంసీలు అనమాట అని మంత్రిగారే దొరికిపోయారు. అప్పటి నుండి సోషల్ మీడియాలో ఆ వీడియో క్లిప్పుపై ఎన్ని సెటైర్లు పడాలో అన్నీ పడుతున్నాయ్.. ఇప్పుడు తాజాగా మరో వైసీపీ నేత చిలకలూరిపేట ఎమ్మెల్యే విడతల రజని ఆ కామెడీ క్లిప్పుల జాబితాలో చేరిపోయారు.

తాజాగా మాజీ సీఎం చంద్రబాబు టీడీపీ నేతల సోషల్ మీడియా కేసులపై మీడియా సమావేశం పెట్టి మాట్లాడారు. ఆసమావేశంలో ఓ టీడీపీ కార్యకర్తను పోలీసులు కొడుతూ ఎమ్మెల్యే రజనీకి వీడియో కాల్ ద్వారా లైవ్ చూపించారని ఆరోపించారు. ఆ ఆరోపణలను తిప్పికొట్టేందుకు గాను ఎమ్మెల్యే రజనీ మీడియా సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో ముందుగా గాంధీ జయంతి గురించి నాలుగు ముక్కలు మాట్లాలని మొదలుపెట్టి గాంధీ పుట్టి 70 సంవత్సరాలు అన్నమాట అంటూ అభాసుపాలయ్యారు. ఇప్పుడు రజనీ వ్యాఖ్యలే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయి కూర్చున్నాయి.

గతంలో టీడీపీ నేత జలీల్ ఖాన్ బీకామ్ లో ఫిజిక్స్ ఎంత కామెడీ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ అదొక బ్రాండ్ లాగా మారిపోయింది. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇంత ప్రభావంగా లేని రోజుల్లో పొలిటీషియన్స్ ఏం మాట్లాడినా చెల్లిపోయేది. కానీ ఇప్పుడు మాట జారితే రచ్చ రచ్చ అయిపోతుంది. మీడియా ముందుకొచ్చే నేతలు మాట్లాడాలనుకున్న అంశంపై స్పష్టంగా ప్రిపేర్ అయి రాకపోతే అభాసుపాలవడం గ్యారంటీ. మీడియా సమావేశం ఉందంటే కనీసం రెండు గంటలైనా ఆ అంశం మీద ప్రిపేర్ అయి వస్తామని తెలంగాణ నేత రేవంత్ రెడ్డి వాళ్ళు ఓ ఇంటర్వ్యూలో చెప్పారంటే వాళ్ళు సమావేశానికి ఎంత ప్రిపేర్ అయి వస్తారో అర్ధం చేసుకోవచ్చు.

మంత్రులు, ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు మాట దొర్లితే అది ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది. అందునా మహామహా సీనియర్లున్న టీడీపీ ఆరోపణలకు ప్రత్యారోపణలకు కొంత సబ్జెక్టు నేర్చుకొని రావాలి. అందునా అనిల్ కుమార్ లాంటి కొత్త మంత్రులు, రజనీ లాంటి కొత్త ఎమ్మెల్యేలు హోమ్ వర్క్ తప్పనిసరిగా చేయాల్సిందే. లేదంటే ఏకిపారేయడం పక్కా. మరి ఇకనైనా వైసీపీ నేతలు ఈ తికమక లెక్కలను దిద్దుకుంటారా? ట్రోల్స్ మాకేం కొత్త కాదంటారా?!!


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle