వైసీపీ నెక్ట్స్ టార్గెట్ బడేటి బుజ్జీనేనట..!
29-10-201929-10-2019 12:13:45 IST
Updated On 29-10-2019 15:38:27 ISTUpdated On 29-10-20192019-10-29T06:43:45.502Z29-10-2019 2019-10-29T06:43:43.167Z - 2019-10-29T10:08:27.442Z - 29-10-2019

ఓ వైపు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జైలు పక్షిలా మారడం, ఇంకా ఆ లిస్టులో చాలా మంది నేతలు ఉన్నారన్న ప్రచారం జరుగుతుండటంతో పశ్చిమ గోదావరి తెలుగుదేశం ఒక్కసారిగా డీలా పడింది. జిల్లాలో మొత్తం పార్టీ స్తబ్దుగామారింది. ఇంకా చెప్పాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం ఆ జిల్లా నేతల్లో కనిపిస్తుందంటూ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే జిల్లాలో టీడీపీకి బలమైన నేతగా చింతమనేని ప్రభాకర్‌కు గుర్తింపు ఉంది. ఇప్పుడు ఏకంగా ఆయనే జైలుపాలయ్యారు. కేసుల మీద కేసులతో చింతమనేనికి ఉచ్చు బిగుస్తోంది. మరోవైపు చింతమనేని అనుచరులపైనా వరుస కేసులు నమోదవుతున్నాయి. దీంతో కొందరు మహిళా నేతలు సైతం ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పటి వరకు 150పై కేసులు నమోదయ్యాయి. ఇంత జరుగుతున్నా చంద్రబాబు కానీ... పార్టీ సీనియర్లు కానీ బాధితులను పరామర్శించిన దాఖలాలు లేవు. దీంతో జిల్లా నేతలు అంత యాక్టివ్‌గా ఉండేందుకు అవకాశం లేకుండా పోతుందని సమాచారం. మరికొంత మంది తాము టీడీపీ నేతలమని చెప్పుకునేందుకే భయపడుతున్నట్టు తెలుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలిటిక్స్‌ను ఓ సారి పరిశీలిస్తే అక్కడ టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా టార్గెట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. చింతమనేని తరువాత నెక్ట్స్ లిస్టులో మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి పేరు వినిపిస్తుంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో శుభమ్మదేవి స్కూల్ గ్రౌండ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. టీడీపీ నేతల చేతుల్లో ఉన్న ఈ భూమిని కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో జరిగిన గొడవల్ని బయటకు తీసి కేసులుపెట్టే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. కేసులు తిరగదోడితే బడేటి బుజ్జీ కూడా చింతమనేని చెంతకే చేరుతారని స్వయంగా జిల్లా టీడీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. జిల్లాలో టీడీపీ పరిస్థితి బ్యాడ్‌గా ఉండటంతో కొందరు నేతలు ఇక్కడ ఉండటం కన్నా వైసీపీలోకి వెళ్తేనే మంచిదన్న ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ తరహా ఆలోచన ఇప్పటికే కృష్ణా జిల్లాలో మొదలైంది. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ వలసలు, గోడ దూకుళ్లు ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు జిల్లాలో పాలకొల్లు నుంచి గెలుపొందిన నిమ్మల రామానాయుడు ఒక్కరే పార్టీ తరుపున కాస్త బలంగా ఉన్నారు. దీంతో వైసీపీ నిమ్మలకు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతోంది. నిమ్మల చేతిలో ఓడిపోయిన డా.బాబ్జీని నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తప్పించి కావూరి శ్రీనివాస్‌ను రంగంలోకి దింపింది. అటు తాను ఎమ్మెల్యేగా గెలిచినా ఏ పనులూ చేయించుకోలేకపోతున్నానంటూ నిమ్మల నిరసన ప్రదర్శనలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఓవరాల్‌గా చూస్తే పశ్చిమగోదావరి జిల్లా అయోమయంలో పడింది. అటు వైసీపీ జిల్లాలో టీడీపీని ఖాళీ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది.

కాంగ్రెస్‌లో ఆ నలుగురూ ఒక్కటవుతున్నారట..!
2 hours ago

జగన్ ఎఫెక్ట్.. ఫుల్ బిజీగా ప్రశాంత్ కిషోర్..!
2 hours ago

పవన్ పార్టీలో ఏమిటీ పరేషాన్ ..?
3 hours ago

రాజధాని అమరావతిలోనే.. జగన్ క్లారిటీ
14-12-2019

దిశ తండ్రి బదిలీ.. కేసీయార్‌కి థ్యాంక్స్
14-12-2019

పెద్దల సభకు కవిత... వినోద్‌కు మొండిచెయ్యేనా?
14-12-2019

జగన్ సర్కార్ నిర్ణయంపై ప్రశంసలు
14-12-2019

జగన్ ప్రకటనతో ఇరుకునపడ్డ కేసీఆర్
14-12-2019

తొలిసారి జగన్‌కు చంద్రబాబు సపోర్ట్..దిశ బిల్లుకు సభ ఆమోదం
13-12-2019

క్షమాపణలు చెప్పను.. మోడీ కూడా అదేమాటన్నారు!
13-12-2019
ఇంకా