newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

వైసీపీ నుంచి వెళ్లే ఎంపీలున్నారా..?

22-11-201922-11-2019 07:50:04 IST
2019-11-22T02:20:04.724Z22-11-2019 2019-11-22T02:19:57.479Z - - 14-08-2020

వైసీపీ నుంచి వెళ్లే ఎంపీలున్నారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నేత‌ల చేరిక‌ల ద్వారా పార్టీని బ‌లోపేతం చేసుకోవాలని భావిస్తున్న భార‌తీయ జన‌తా పార్టీ టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎంపీలు త‌మ పార్టీతో ట‌చ్‌లో ఉన్నార‌ని ప్ర‌చారం చేస్తోంది. ముఖ్యంగా వైసీపీ ఎంపీలు బీజేపీలోకి వెళ‌తారంటూ ఇటీవ‌ల పెద్ద ఎత్తున ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. వైసీపీ ఎంపీలు పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్నార‌ని, కొంద‌రు బీజేపీ పెద్ద‌ల‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇటీవ‌ల వైసీపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌తోనే ఈ ప్ర‌చారం ఊపందుకుంది. పార్టీ ఎంపీలు ఇష్టారీతిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని, హోంమంత్రి అమిత్ షాను, కేంద్ర మంత్రుల‌ను క‌ల‌వ‌వొద్ద‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ క‌చ్చితంగా చెప్పారు.

విజ‌య‌సాయిరెడ్డి, మిథున్ రెడ్డితో క‌లిసే వారిని క‌ల‌వాల‌ని ఆయ‌న సూచించారు. అస‌లు, ఎందుకు ఎంపీల‌కు ఇలా చెప్పాల్సి వ‌చ్చింది ? జ‌గ‌న్‌కు ఎంపీలు గీత దాటే ప్ర‌మాదం ఉంది అనే స‌మాచారం వ‌చ్చిందా ? అనే చ‌ర్చ మొద‌లైంది.

త‌ర్వాత ఇంగ్లీష్ మీడియం వ్య‌వ‌హారంలో న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు పార్టీ స్టాండ్‌కు భిన్నంగా మాట్లాడ‌టం, ఆయ‌న‌పై జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌నే వార్త‌లు వ‌చ్చాయి.

ఇక‌, పార్టీ ప‌ట్ల వైసీపీ ఎంపీలు అసంతృప్తిగా ఉన్నార‌ని, అన్ని ప‌ద‌వులు, ప్రాముఖ్య‌త విజ‌య‌సాయిరెడ్డి, మిథున్‌రెడ్డికేనా అని ఎంపీలు ప్ర‌శ్నిస్తున్నార‌ని, జ‌గ‌న్ నిర్ణ‌యాల‌తో తాము ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని ఎంపీలు చెబుతున్న‌ట్లు టీడీపీ అనుకూల ప‌త్రిక‌లో ఓ సంచ‌ల‌న వార్త కూడా వ‌చ్చింది.

ఇక‌, వైసీపీ ఎంపీలు త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని బీజేపీ సీనియ‌ర్ నేత సోము వీర్రాజు ప్ర‌క‌టించ‌డంతో అస‌లు వైసీపీ ఎంపీలు ఎవ‌రు బీజేపీ వైపు చూస్తున్నారు ? అస‌లు ఆ అవ‌స‌రం వైసీపీ ఎంపీల‌కు ఎందుకు ఉంద‌నేది ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీస్తోంది.

2019 ఎన్నిక‌ల్లో వైసీపీ ఏకంగా 22 ఎంపీ స్థానాల‌ను కైవ‌సం చేసుకుంది. జ‌గ‌న్ ప్ర‌భంజ‌నంతో ఎంపీ అభ్య‌ర్థులు ఎవ‌రు అని కూడా చూడ‌కుండా ప్ర‌జ‌లు ఓట్లేసి ల‌క్ష‌ల మెజారిటీతో గెలిపించారు. గెలిచిన ఎంపీల్లో చాలామంది పేరున్న నాయ‌కులు కాదు. చాలా మంది రాజకీయాల్లోకి కొత్త‌గా వ‌చ్చిన వారు. వీరంతా జ‌గ‌న్ బొమ్మ‌తోనే గెలిచారు.

సీఐగా ప‌నిచేసిన గోరంట్ల మాధ‌వ్‌, పీఈటీ టీచ‌ర్‌గా ప‌నిచేసిన గొడ్డెటి మాధ‌వి, సాధార‌ణ డాక్ట‌ర్ అయిన సంజీవ్ కుమార్‌, రిటైర్డ్ ఉద్యోగి అయిన రంగ‌య్య‌, లాయ‌ర్‌గా ప‌నిచేసే రెడ్డెప్ప, చిన్న రైతుగా ఉన్న నందిగం సురేష్, డాక్ట‌ర్ అయిన స‌త్య‌వ‌తి, ఉద్యోగినిగా ఉన్న చింతా అనురాధ‌ వంటి వారికి జ‌గ‌న్ ధైర్యం చేసి టిక్కెట్ ఇచ్చారు. వీరంతా జ‌గ‌న్ హ‌వాలో సులువుగా విజ‌యం సాధించారు.

త‌మ‌కు రాజ‌కీయ జీవితాన్ని ఇచ్చి, ఎంపీల‌ను చేసిన జ‌గ‌న్‌ను వ‌దిలేసి వీరు బీజేపీలో చేర‌డం జ‌రుగుతుందా అంటే జ‌రిగే అవ‌కాశాలు ఇంచుమించు లేవ‌నే చెప్పాలి.

ఇక‌, లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు, బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, కోట‌గిరి శ్రీధ‌ర్‌,  మార్గాని భ‌ర‌త్ వంటి యువ‌కుల‌కు జ‌గ‌న్ టిక్కెట్లు ఇచ్చి ఎంపీల‌ను చేశారు. వీరంతా పార్టీ వ్య‌వ‌హారాల్లో చురుగ్గా ఉంటున్నారు. అన్నింటికీ మించి వీరు తాము జ‌గ‌న్ అభిమానుల‌మ‌ని చెప్పుకుంటుంటారు. వీరు వైసీపీని వీడే అవ‌కాశాలు త‌క్కువే.

చివ‌రి నిమిషంలో పార్టీలోకి తీసుకొని ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, ర‌ఘురామ‌కృష్ణంరాజు, బ్ర‌హ్మానంద‌రెడ్డి, వంగా గీతకు టిక్కెట్లు ఇచ్చారు జ‌గ‌న్‌.

వీరికి రాజ‌కీయ అనుభ‌వం ఉన్నా చివ‌రి క్ష‌ణంలో వైసీపీలోకి రాక‌పోయి ఉంటే ఎంపీలు అయ్యి ఉండే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌. ఇక‌, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు, పైగా వైసీపీ లోక్‌స‌భాప‌క్ష నేత కూడా. క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జ‌గ‌న్‌కు సోద‌రుడు. మ‌చిలీప‌ట్నం ఎంపీ వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి కూడా జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు.

మొత్తం 22 మంది ఎంపీల్లో ఇద్ద‌రు ముగ్గురు మిన‌హా ఎవ‌రికీ పెద్ద‌గా వ్యాపారాలు కూడా లేవు. మ‌రోవైపు వైసీపీ రాష్ట్రంలో బ‌లంగా ఉంది. బీజేపీ ఇప్ప‌టివ‌ర‌కు బ‌ల‌ప‌డ‌లేదు. కొత్త‌గా వైసీపీ ఎంపీలు బీజేపీలోకి వెళ్లినా కేంద్ర‌మంత్రి ప‌ద‌వులు ద‌క్కుతాయ‌నో, ఇత‌ర ఏ ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చ‌నో ఆశ‌లు కూడా క‌నిపించ‌డం లేదు.

పైగా ప్ర‌జ‌ల్లో పార్టీ మారిన అప‌ప్ర‌ద మూట‌గ‌ట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా ఏ ర‌కంగా చూసినా ఒక‌రిద్ద‌రు మిన‌హా ఎవ‌రూ బీజేపీ వైపు చూసే అవ‌కాశాలు ఏ మాత్రం లేవు.

ఇటువంటి ప‌రిస్థితుల్లో వైసీపీ ఎంపీల్లో మూడింట రెండొంతుల మంది ఎంపీల‌ను బీజేపీలో చేర్చుకొని వైసీపీ లోక్‌స‌భా ప‌క్షాన్ని విలీనం చేసుకుంటార‌నే ప్ర‌చారం క‌ల లాంటిదే. అయితే, ఎంపీలు రాష్ట్ర రాజ‌కీయాలను, పార్టీ వ్య‌వ‌హారాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నేది, పార్టీ కూడా ఎంపీల‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌నేది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

విజ‌య‌సాయిరెడ్డికి, మిథున్‌రెడ్డికి ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నార‌నేది కూడా వాస్త‌వ‌మే. మ‌రి, జ‌గ‌న్ ఎంపీల్లో అసంతృప్తి రాకుండా ఎలా చూసుకుంటారో చూడాలి.a

కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

   an hour ago


తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

   2 hours ago


అమ్మకానికి శిశువు... హైటెక్ నగరంలో దారుణం

అమ్మకానికి శిశువు... హైటెక్ నగరంలో దారుణం

   2 hours ago


ఇంజనీరింగ్ విద్యార్ధులకు గుడ్ న్యూస్... ఆన్ లైన్ క్లాసెస్ షురూ!

ఇంజనీరింగ్ విద్యార్ధులకు గుడ్ న్యూస్... ఆన్ లైన్ క్లాసెస్ షురూ!

   2 hours ago


కేటీఆర్‌కు లైన్ క్లియ‌ర్‌... ఇక ఆ కుర్చీ ఎక్క‌డ‌మే మిగిలింది..!

కేటీఆర్‌కు లైన్ క్లియ‌ర్‌... ఇక ఆ కుర్చీ ఎక్క‌డ‌మే మిగిలింది..!

   3 hours ago


కోవిడ్ పరీక్షల్లో కొత్త రికార్డ్.. ఒక్కరోజే 23 వేల పరీక్షలు.. 1931 కొత్త కేసులు

కోవిడ్ పరీక్షల్లో కొత్త రికార్డ్.. ఒక్కరోజే 23 వేల పరీక్షలు.. 1931 కొత్త కేసులు

   4 hours ago


వీళ్ళు మనుషులేనా? రాత్రంతా వానలోనే కరోనా మృతదేహాలు

వీళ్ళు మనుషులేనా? రాత్రంతా వానలోనే కరోనా మృతదేహాలు

   16 hours ago


ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం

ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం

   18 hours ago


టీడీపీనేత అచ్చెన్నకు కరోనా పాజిటివ్

టీడీపీనేత అచ్చెన్నకు కరోనా పాజిటివ్

   18 hours ago


మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం

   a day ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle