newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

వైసీపీ నుంచి యూట‌ర్న్‌.. ఆ నేత‌కు బీజేపీనే దిక్కా..?

23-09-201923-09-2019 08:54:54 IST
Updated On 23-09-2019 14:01:50 ISTUpdated On 23-09-20192019-09-23T03:24:54.597Z23-09-2019 2019-09-23T03:24:52.109Z - 2019-09-23T08:31:50.021Z - 23-09-2019

వైసీపీ నుంచి యూట‌ర్న్‌.. ఆ నేత‌కు బీజేపీనే దిక్కా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం అధికారం చేప‌ట్టిన వైసీపీలో చేరాల‌ని భావించిన ఆ నేత‌కు నో ఎంట్రీ బోర్డు పెట్టారా..?  సీఎం జ‌గన్‌ను క‌లిసి చేరికపై చ‌ర్చిద్దామ‌నుకున్నా అపాయింట్‌మెంట్ క‌రువైందా..? అధికారంలోకి రాగానే పెద్ద‌పీట వేస్తామంటూ మాట ఇచ్చిన వారంతా ప్లేట్ ఫిరాయించారా..?  అటు టీడీపీకి దూరమై.. ఇటు వైసీపీలో ఎంట్రీ దొర‌కని ఆ నేత ప‌రిస్థితి ప్ర‌స్తుతం రెంటికి చెడ్డ రేవ‌డిలా త‌యారైందా..? ఇంత‌కీ ఆ నేత ఎవ‌రు..?

ఏపీ రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న నేత‌ల్లో కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి ఒక‌రు. ఈ ద‌ఫా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల సమ‌యంలో టీడీపీ టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డారు. అధిష్టానం మొండి చేయి చూపించింది. ఆఖ‌ర‌కు ప్రొద్దుటూరు టికెట్ ఇచ్చినా స‌రిపెట్టుకుంటానంటూ ప్రాధేయ‌ప‌డ్డా అధిష్టానం క‌నిక‌రించ‌లేదు. బుజ్జ‌గింపు చ‌ర్య‌ల్లో భాగంగా అధికారంలోకి వ‌స్తే ఎమ్మెల్సీ ఇస్తామంటూ ఆఫ‌ర్ చేశారు.

ఆశించిన టికెట్ విష‌యంలో త‌న‌ను భంగ‌పాటుకు గురిచేసిన టీడీపీ అధిష్టానంపై శివాలెత్తిన వీర శివారెడ్డి సరిగ్గా పోలింగ్ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు జైకొట్టేశారు. త‌న‌వైపున్న ఓటు బ్యాంకునంతా వైసీపీవైపు మ‌ళ్లించారు. అయితే వీర శివారెడ్డి భావించిన‌ట్టు క‌మ‌లాపురంలోనే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ విజ‌య దుందుభి మోగించింది. దీంతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నున్న జ‌గ‌న్ త‌న‌కు ఏదో ఒక ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డం ఖాయ‌మంటూ వీర శివారెడ్డి భావించారు.

అంతేగాకుండా క‌మ‌లాపురం ఎమ్మెల్యేగా గెలిచిన జ‌గ‌న్ మేన‌మామ ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి, ఎంపీగా గెలిచిన జ‌గ‌న్ సోద‌రుడు వైఎస్ అవినాష్‌రెడ్డి ఫ‌లితాలు వెలువ‌డ్డాక వీర శివారెడ్డి ఇంటికొచ్చారు. త‌మ విజ‌యానికి తోడ్పాటు అందించినందుకుగాను వారు వీర శివారెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. దీంతో ఉబ్బిత‌బ్బుబ‌యిన వీర శివారెడ్డి ప్ర‌భుత్వ ప‌ద‌విపై మరిన్ని ఆశ‌లు పెంచుకున్నారు.

త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ ఎలా ఉన్నా త‌న కుమారుడి ఫ్యూచ‌ర్ బాగుంటుంద‌ని భావించారు. దీంతో తాను టీడీపీకి గుడ్‌బై చెప్తున్నాన‌ని వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకుంటాన‌ని ప్ర‌క‌టించార‌ట‌. అయితే రోజులు గ‌డుస్తున్నా వైసీపీ నుంచి పాజిటివ్ సిగ్న‌ల్స్ రాక‌పోవ‌డంతో వీర విశారెడ్డికి ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

డీసీసీబీ చైర్మ‌న్‌గా ఉన్న త‌న త‌న‌యుడి రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం ఒక మెట్టు కింద‌కుజారి వైసీపీలో చేరాల‌నుకుంటే అటు నుంచి సానుకూల సంకేతాలు రాక‌పోవ‌డం వీర శివారెడ్డికి మింగుడు ప‌డట‌రం లేదు. ఎన్నిక‌ల‌కు ముందు వీర శివారెడ్డి వ‌ద్ద‌కు వ‌చ్చి మ‌ద్ద‌తు కోరిన నేత‌లు కూడా మొహం చాటేశార‌ని ఆయ‌న అనుచ‌రులు చెప్పుకొస్తున్నారు. స్వ‌యంగా సీఎం జ‌గ‌న్ అపాయింట్ మెంట్ కోసం చేసిన య‌త్నాలు కూడా ఫ‌లించ‌క‌పోవ‌డంతో వీర శివుడు డైల‌మాలో ప‌డ్డ‌ట్టు తెలుస్తుంది.

అంతేకాకుండా డీసీసీబీ చైర్మ‌న్‌గా కాల‌ప‌రిమితి ముగిసిన త‌న కుమారుడు అనీల్ కుమార్‌రెడ్డికి సొసైటీ ఎన్నిక‌లు జ‌రిగే వ‌ర‌కు కొన‌సాగింపు ఇస్తార‌ని ఆశించారు. అయితే జ‌గ‌న్ ఈ విష‌యంలో కూడా వీర శివారెడ్డికి ఝ‌ల‌క్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. దీంతో తాను భంగ‌పాటుకు గుర‌య్యాన‌ని భావించిన వీర శివారెడ్డి రాజ‌కీయంగా ఎద‌గాలంటే ఏదో ఒక పార్టీ అండ ఉండాల‌ని భావించి క‌మ‌లం గూటికి వెళ్లాల‌ని భావిస్తున్న‌ట్టు సమాచారం.

ఈ నేప‌థ్యంలో జిల్లాకు చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్ బీజేపీలో చేరి ఇటీవ‌ల జిల్లా ప‌ర్య‌ట‌న‌కు  వ‌చ్చిన సంద‌ర్భంగా వీర శివుడు సీఎం ర‌మేష్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా పార్టీలోకి వ‌స్తే మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని సీఎం ర‌మేష్ చెప్పార‌ని, అప్ప‌టికే వైసీపీలో త‌లుపులు మూసుకుపోవ‌డంతో వీర శివుడు ఈ ప్ర‌దిపాద‌న‌ప‌ట్ల సానుకూలంగా స్పందించిన‌ట్టు తెలుస్తుంది. మొత్తానికి త్వ‌ర‌లో క‌మ‌లం కండువా క‌ప్పుకుంటాన‌ని వీర శివుడు త‌న అనుచ‌రుల‌తో చెప్పార‌ట‌. ఏదేమైనా వీర శివారెడ్డి బీజేపీలో చేర‌డం ఖాయ‌మ‌న్న ప్ర‌చారం జిల్లాలో జోరుగా సాగుతోంది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle