newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

వైసీపీ జూనియర్ నామస్మరణ మర్మమేంటి?

24-11-201924-11-2019 11:58:06 IST
2019-11-24T06:28:06.774Z24-11-2019 2019-11-24T06:28:04.000Z - - 15-12-2019

వైసీపీ జూనియర్ నామస్మరణ మర్మమేంటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇప్పుడు ఓ వ్యక్తి హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఆయనే జూనియర్ ఎన్టీఆర్. గత పదేళ్లుగా అయన రాజకీయాలకు చాలా అంటే చాలా దూరంగా ఉన్నారు. ఎప్పుడో 2009 ఎన్నికలకు తన తాత స్థాపించిన పార్టీకి తన అవసరం ఉందంటూ ముమ్మర ప్రచారంలో రాష్ట్రాన్ని చుట్టేసిన జూనియర్ అప్పుడే ఘోర ప్రమాదం నుండి బయటపడి హాస్పిటల్ బెడ్ మీద నుండి కూడా పార్టీకి ప్రచారం చేశారు.

అయితే ఆ ఎన్నికలలో పార్టీ విజయం సాధించకపోగా పార్టీలో విభేదాల కారణంగానే అయన పార్టీకి దూరమయ్యారని రాజకీయాలలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఇన్నాళ్లుగా అప్పుడప్పుడు తన పేరు వినిపించినా అది కొద్దిపాటి చిరుగాలిలా మాత్రమే వీచింది. జూనియర్ కూడా ఎక్కడా పొలిటికల్ ప్రస్తావన తెచ్చేందుకు ఇష్టపడలేదు. అయితే ఇప్పుడు మాత్రం పెనుగాలిలా జూనియర్ నామస్మరణ జరిగిపోతుంది.

కానీ అదేదో టీడీపీలో ఓ వర్గమో.. లేక నందమూరి అభిమానులో.. పార్టీ ముఖ్యులో ఎన్టీఆర్ రావాలని కోరడం లేదు. పార్టీతో విబేధాలొచ్చి వెళ్లిన నేతలు, పక్కా ప్రత్యర్థి పార్టీ నేతలే ఇప్పుడు జూనియర్ రావాలని.. లేకపోతే పార్టీ బ్రతకలేదని సలహాలిస్తున్నారు. మరి వైసీపీ జూనియర్ నామస్మరణ వెనుక కారణమేంటి? అన్న విశ్లేషణలు కూడా రాష్ట్రలో తీవ్రంగా జరిగిపోతున్నాయి.

ఆ విశ్లేషణలను నిశితంగా గమనిస్తే ఇది వైసీపీ పార్టీ సరికొత్త ఎత్తుగడగా అనిపించకమానదు. ప్రస్తుతం వైసీపీ నేతలు ఎన్టీఆర్ రావాలని ఓ వైబ్రేషన్ తీసుకురావడం వెనుక పెద్ద స్కెచ్ ఉన్నట్లే భావించాల్సి ఉంటుందంటున్నారు. ఈ తరహా ప్రచారంతో ప్రస్తుతం అధినేతగా ఉన్న చంద్రబాబు పని అయిపోయిందని సంకేతాలు తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది.

వయసు రీత్యా చంద్రబాబు కుమారుడు లోకేష్ కి పట్టాలు అప్పగించేందుకు చూస్తున్నారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే దీని వెనుక కూడా అంతేస్థాయిలో కారణాలు కనిపిస్తున్నాయి. ఓటమి బాధల్లో ఉన్న పార్టీని.. అసంతృప్తి పరిస్థితిలో అయోమయ స్థితిలో ఉన్న పార్టీలో.. భారీగా ఉన్న నందమూరి బలాన్ని దూరం చేస్తే పార్టీకి కోలుకోలేని దెబ్బగా మారుతుంది.

పదేపదే ఎన్టీఆర్ పేరుతో జరిగే ఈ ప్రచారాన్ని ఖండించే క్రమంలో.. వైసీపీ నేతలకు ధీటైన జవాబిచ్చే క్రమంలో టీడీపీ నేతలు ఏ మాత్రం జూనియర్ విషయంలో నోరు జారినా ఎంతోకొంత నందమూరి అభిమానుల్లో ఇప్పుడున్న అధినాయకత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది. అది వైసీపీ విజయంగానే మారుతుంది. అందుకే టీడీపీ నేతలు సహనంతో సమాధానమిస్తున్నా వైసీపీ రోజుకో విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.

నిజానికి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నారు. అగ్రస్థాయి కథానాయకుడిగా కొనసాగుతున్న జూనియర్ ఇప్పట్లో రాజకీయల వైపు చూసే పరిస్థితి కనిపించడం లేదు. తాను ఎలాగూ రాలేడు కనుక అయన పేరు చెప్పి ఇప్పుడున్న నాయకత్వం అవుట్ డేటెడ్ గా ఫోకస్ చేయడమే వైసీపీ పనిగా కనిపిస్తుంది. అటు జూనియర్ రాకపోగా.. పార్టీ సమర్ధమైన నాయకత్వంలో లేదని భావన కలిగిస్తే పార్టీలో నిస్సహాయత పెరిగిపోతుంది.

ఎక్కడైనా ఏ పార్టీ అయినా ప్రత్యర్థి బలహీనమైతే చూడాలి అనుకుంటారు. ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీ బలహీనపడితే మరికొన్నాళ్లు వైసీపీ రాజ్యమేలుకోవచ్చు. కొన్నేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉండిపోవచ్చు. కానీ ప్రత్యర్థి పార్టీకి జూనియర్ లాంటి బలమైన నాయకుడు రావాలని కోరుకోవడం వెనుక ఆ పార్టీని నైతికంగా దెబ్బతీసే సన్నాహాలనే రచించినట్లుగా కనిపిస్తుంది. మరి ఈ పరిస్థితి నుండి టీడీపీ ఎలా బయటపడుతుందో చూడాల్సి ఉంది.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle