newssting
BITING NEWS :
*కలకత్తా జాదవ్ పూర్ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత*రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత*కాంగ్రెస్‌ అగ్నికి ఆజ్యం పోస్తోంది.. ‘పౌరసత్వ’ ఆందోళనలకు పరోక్ష సహకారం: మోడీ *కేంద్ర మాజీ మంత్రి ఐడీ స్వామి కన్నుమూత *ఏపీ అసెంబ్లీలో 11 కీలక బిల్లులు...ప్రభుత్వ ప్రజా రవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

వైసీపీ గెలుపు లెక్కలు ఇవేనా..?

14-04-201914-04-2019 11:01:13 IST
Updated On 14-04-2019 11:02:59 ISTUpdated On 14-04-20192019-04-14T05:31:13.525Z14-04-2019 2019-04-14T05:31:06.301Z - 2019-04-14T05:32:59.975Z - 14-04-2019

 వైసీపీ గెలుపు లెక్కలు ఇవేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాక తమ విజయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలా ధీమా కనిపిస్తోంది. సామాన్య కార్యకర్త నుంచి అధినేత జగన్ వరకు ఈసారి తప్పకుండా గెలిచి అధికారం చేపడతామని ధీమాగా ఉన్నారు. ఇందుకోసం రకరకాల లెక్కలు కట్టుకొని తమ విజయావకాశాలపై అంచనాలు వేసుకుంటున్నారు.

తమకు పట్టున్న జిల్లాల్లో గత ఎన్నికల్లో సాధించిన సీట్లను కాపాడుకోవడంతో పాటు ఇతర జిల్లాల్లో సీట్ల సంఖ్య పెంచుకోవడం ఖాయమని వైసీపీ భావిస్తోంది. దీంతో గెలుపు ఖాయమని అంచనాకు వచ్చారు. గత ఎన్నికల్లో వైసీపీ 67 సీట్లు గెలుచుకుంది. టీడీపీ 102 స్థానాల్లో విజయం సాధించింది. వైసీపీకి రాయలసీమలోని కడప, కర్నూల్, చిత్తూరుతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువ సీట్లు వచ్చాయి. 

ఈసారి కూడా రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు సీమ పక్కనే ఉండే ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో కలుపుకుని మొత్తం 74 నియోజకవర్గాల్లో కనీసం 50 సాధిస్తామని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ ఆరు జిల్లాల్లో 42 సీట్లను వైసీపీ గెలుచుకుంది. ఈసారి కర్నూల్ జిల్లాలో వైసీపీకి కొన్ని సీట్లు తగ్గవచ్చు అనుకుంటున్నారు. ఇక్కడ గత ఎన్నికల్లో 14 స్థానాల్లో వైసీపీ ఏకంగా 10 సీట్లను గెలుచుకుంది. ఈసారి కోట్ల, భూమా, గౌరు కుటుంబాల చేరికతో జిల్లాలో టీడీపీ బలం పుంజుకుంది.

కర్నూలులో వైసీపీకి కొన్ని సీట్లు తగ్గినా అనంతపురం జిల్లాలో బాగా పెరుగుతాయని అంచనా వేసుకుంది. గత ఎన్నికల్లో అనంతపురంలోని 14 సీట్లలో టీడీపీ 12 సీట్లను గెలుచుకుంది. ఈసారి వైసీపీకి సీట్లు పెరుగుతాయని ఆ పార్టీ అంచనా వేస్తోంది. మొత్తంగా ఈ ఆరు జిల్లాల్లోని 74 సీట్లలో 50 వైసీపీ గెలిస్తే అధికారం చేపట్టడం కష్టమేమీ కాదు అని ఆ పార్టీ నాయకులూ భావిస్తున్నారు. 

ఇక్కడే 50 సీట్లు గెలిస్తే అధికారం చేపట్టడానికి ఇంకా 38 సీట్లు కావల్సి ఉంటుంది. ఈ ఆరు జిల్లాలను మినహాయిస్తే మిగతా ఏడు జిల్లాల్లో 101 సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభావం ఈ జిల్లాలో తక్కువగా ఉంది. కేవలం 23 సీట్లను మాత్రమే వైసీపీ గెలవగా టీడీపీ, బీజేపీ కూటమి 77 సీట్లలో గెలిచింది. అయితే, ఈసారి ఈ అన్ని జిల్లాల్లో వైసీపీ బలపడిందని ఆ పార్టీ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. 

పెద్దగా బలం లేకున్నా గత ఎన్నికల్లో ఈ ఏడు జిల్లాల్లో 23 సీట్లు గెలిచినందున ఈసారి కచ్చితంగా 50 సీట్లకు పైనే గెలుస్తామని భావిస్తుంది. మొత్తంగా ఈసారి కనీసం 100 సీట్లు గెలుచుకొని అధికారం చేపట్టడం ఖాయమని వైసీపీ లెక్కలు వేస్తుంది. తమ అంచనాలు తగ్గినా మేజిక్ ఫిగర్ 88 సీట్లు మాత్రం దక్కడం పక్కా అని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. మరి, వైసీపీ లెక్కలు నిజంగానే టాలీ అయ్యి అధికారం చేపడతారో  లేదో చూడాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle