newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

వైసీపీ గూటికి అఖిలప్రియ..ఎంట్రీకి జగన్ ఒప్పుకుంటారా?

12-07-201912-07-2019 09:05:52 IST
Updated On 12-07-2019 12:29:57 ISTUpdated On 12-07-20192019-07-12T03:35:52.889Z12-07-2019 2019-07-12T03:35:45.430Z - 2019-07-12T06:59:57.984Z - 12-07-2019

వైసీపీ గూటికి అఖిలప్రియ..ఎంట్రీకి జగన్ ఒప్పుకుంటారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తండ్రి భూమా నాగిరెడ్డితో పాటు టీడీపీలోకి వచ్చిన భూమా అఖిలప్రియ తాజాగా తన భవిష్యత్తు కోసం ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆమె రూటెటు? టీడీపీలో ఉండడానికి ఆమె ఇష్టపడడం లేదు.

అయితే పాత గూటికి చేరాలని ఉన్నా.. అక్కడ ఎంట్రీ కష్టంగా ఉందని తెలుస్తోంది. భూమా చేరికను వైసీపీ కర్నూలు నేతలు అస్సలు ఒప్పుకోవడం లేదట. బీజేపీ నేతలు కూడా ఆమెకు ఆహ్వానాలు పంపుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీలో చేరేందుకు ఆమె అంత సుముఖంగా లేరు. 

భూమా నాగిరెడ్డి మరణం తరువాత చంద్రబాబునాయుడు అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చారు. దీంతో ఆమె రాజకీయంగా ముందుకు సాగారు. కానీ ఇప్పుడు తండ్రి లేకపోవడం, తెలుగుదేశం పార్టీ పవర్‌లో కూడా లేదు. దీంతో ఒక్కసారిగా అఖిల ప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డిల పొలిటికల్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.

టీడీపీలో కొనసాగేందుకు అఖిల ప్రియ ఏ మాత్రం ఆసక్తిగా లేరని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి వైసీపీ వైపు చూస్తూనే ఉన్నారు. సొంత గూటికి వెళ్లేందుకు మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు. కానీ పరిస్థితులు అనుకూలించడం లేదని తెలుస్తోంది. 

ఆఖరి ప్రయత్నంగా జగన్ తల్లి విజయమ్మతో కూడా మాట్లేందుకు అఖిల ప్రియ ప్రయత్నించింది. జగన్ అన్నను క్షమాపణ అడిగి మళ్ళీ వైసీపీ నీడలోకి రావాలని ఆమె ప్రయత్నించారు.

మరోవైపు తమ చిరకాల ప్రత్యర్థి గంగుల కుటుంబం వైసీపీలో ఉండగా.. భూమా అఖిల ప్రియ ఎంట్రీకి వారు ఏ మాత్రం అంగీకరించరని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక పార్టీ మారొద్దని టీడీపీ బుజ్జగింపులు చేస్తోంది. మరి అఖిలప్రియ ఏం చేస్తారో చూడాలి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle