newssting
BITING NEWS :
*శబరిమల వివాదంపై సుప్రీం తీర్పు.శబరిమల వివాదం విస్తృత ధర్మాసనానికి బదిలీ *రాఫెల్‌ డీల్‌ : కేంద్రానికి క్లీన్‌చిట్‌ .. రివ్యూ పిటిషన్లు కొట్టివేత *రాహుల్ గాంధీకి రిలీఫ్.. పరువునష్టం కేసుపై సుప్రీం తీర్పు *వైసీపీలో చేరనున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్*ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సహాని...నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్....ఇవాళ బాధ్యతలు స్వీకరించిన నీలం సహాని *ఇసుక కొరతపై చంద్రబాబు దీక్ష...12 గంటల పాటు దీక్షలో కూర్చున్న బాబు* ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన...మనబడి నాడు - నేడు కార్యక్రమానికి శ్రీకారం*విశాఖ: బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ సోదాలు.. మన శాండ్ ఆన్‌లైన్ ఇసుక సరఫరా వెబ్‌సైట్ హ్యాక్ చేసినట్టు అనుమానం*ఢిల్లీ: అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు.. పార్లమెంట్‌లో అయోధ్య ట్రస్ట్ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం*ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన హైకోర్ట్*అమరావతి: పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయనడం కరెక్ట్ కాదు.. చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి బొత్స

వైసీపీ క‌మిటీలా టీటీడీ ఎల్ఏసీ..!

28-10-201928-10-2019 08:19:16 IST
2019-10-28T02:49:16.485Z28-10-2019 2019-10-28T02:48:37.279Z - - 14-11-2019

వైసీపీ క‌మిటీలా టీటీడీ ఎల్ఏసీ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ)లో రాజ‌కీయ జోక్యం ఉండొద్ద‌ని త‌ర‌చూ స్వామాజీలు, పీఠాధిప‌తులు, ఆధ్యాత్మికవేత్త‌లు కొరుతూ ఉంటారు. కానీ, ఏ ప్ర‌భుత్వం ఉన్నా టీటీడీలో రాజ‌కీయ జోక్యం మ‌రింత పెరుగుతునూ ఉంది కానీ త‌గ్గ‌డం లేదు. ఇక‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక ఇది మ‌రింత పెరిగింది.

టీటీడీ బోర్డులో స్థానం కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి ప్ర‌ముఖులు, రాజ‌కీయ ప‌లుకుబ‌డి ఉన్న వారు పోటీప‌డుతుంటారు. ఈసారి కూడా టీటీడీ ప‌ద‌వి కోసం విప‌రీత‌మైన పోటీ ఉంది. ఈ పోటీ చూసి, వ‌స్తున్న సిఫార్సుల‌ను చూసి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా ఆశ్చ‌ర్య‌పోయారు. మొత్తానికి పాత క‌మిటీ కంటే స‌భ్యుల సంఖ్య పెంచి వీలైనంత‌వ‌ర‌కు ఎవ‌రినీ నొప్పించ‌కుండా టీటీడీ బోర్డులో స్థానం క‌ల్పించారు.

జంబో క‌మిటీ వేసినా ఇంకా చోటు ద‌క్క‌ని వారు అసంతృప్తిగానే ఉన్నారు. కాగా, టీటీడీ బోర్డులో స్థానం ద‌క్క‌ని వారికి ఇత‌ర క‌మిటీల్లో చోటు క‌ల్పిస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రాంతానికి గానూ వేసిన టీటీడీ లోక‌ల్ అడ్వైజ‌రీ క‌మిటీ(ఎల్ఏసీ) చూస్తుంటే ఒక రాజ‌కీయ పార్టీకి కార్య‌వ‌ర్గంలా క‌నిపిస్తోంది. తెలంగాణ వైసీపీకి చెందిన వారితోనే స‌గం క‌మిటీ నిండిపోయింది.

తెలంగాణ‌లో వైసీపీ మొద‌ట్లో బ‌లంగా ఉండేది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ముఖ్య‌నేత‌లంతా పార్టీని వీడారు. అయినా కొంత‌మంది మాత్రం పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నారు. ఇటువంటి వారిలో చాలామంది టీటీడీ బోర్డు మెంబ‌ర్ ప‌ద‌విని ఆశించారు. కానీ, తెలంగాణ నుంచి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు శివ‌కుమార్, పుత్తా ప్ర‌తాప్ రెడ్డికి మాత్రమే చోటు ద‌క్కింది.

దీంతో లోక‌ల్ అడ్వైజ‌రీ క‌మిటీలో చాలా మంది వైసీపీ నేత‌ల‌కు ఛాన్స్ ఇచ్చారు. ఈ క‌మిటీకి ఉపాధ్య‌క్షుడిగా జ‌గ‌న్‌కు, కేటీఆర్‌కు స‌న్నిహితంగా ఉండే ఓ వెబ్ మీడియా అధినేత‌కు అవ‌కాశం క‌ల్పించారు. ఇక‌, కార్య‌ద‌ర్శిగా వైసీపీ సీనియ‌ర్ నేత కొండా రాఘ‌వ‌రెడ్డిని నియ‌మించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆయ‌న వైసీపీ త‌ర‌పున మీడియాలో క‌నిపిస్తుంటారు

మ‌రో వైసీపీ నేత ద‌ర్గ సుఖేంద‌ర్ రెడ్డికి స‌భ్యుడిగా అవ‌కాశం ఇచ్చారు. ఈయ‌న అయితే వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రి చేయాల‌ని ఆయ‌న తిరుమ‌ల‌కు పాద‌యాత్ర చేశారు. బొడ్డు సాయినాథ్ రెడ్డి, వెల్లాల రామ్మోహ‌న్‌, వ‌ల్ల‌పు రాము హైద‌రాబాద్‌కు చెందిన వైసీపీ నేత‌లు. వీరూ టీటీడీ ఎల్ఏసీలో స‌భ్యుల‌య్యారు.

వివిధ తెలంగాణ జిల్లాల‌కు చెందిన వైసీపీ నేత‌లు బీష్వ ర‌వీంద‌ర్‌, సింగిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, గౌరిరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి, బెజ్జంకి అనీల్‌కుమార్ వంటి వారినీ ఈ క‌మిటీలోకి తీసుకున్నారు. అనీల్ కుమార్ అయితే జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యే వ‌ర‌కు చెప్పులు వేసుకోనని మొక్కుకొని, ప‌దేళ్ల త‌ర్వాత జ‌గ‌న్ సీఎం అయ్యాక చెప్పులు వేస‌కోవ‌డం ప్రారంభించారు.

ఈ కమిటీలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి స‌తీమ‌ణి కోమ‌టిరెడ్డి ల‌క్ష్మీకి కూడా చోటిచ్చారు. జ‌గ‌న్‌తో కోమ‌టిరెడ్డి సోద‌రుల‌కు మంచి సంబంధాలు ఉండ‌టంతో ఆమెను క‌మిటీలోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి పార్టీ తెలంగాణ‌లో బ‌త‌క‌ద‌ని తెలిసినా వైసీపీ జెండా మోస్తున్న నేత‌ల‌కు జ‌గ‌న్ ఈ ర‌కంగా న్యాయం చేశారు.

కానీ, ఇలా పార్టీ కోసం, త‌న కోసం క‌ష్ట‌ప‌డ్డ వారికి వేరే ర‌కాలుగా న్యాయం చేయవ‌చ్చు కానీ శ్రీవారి సేవ కోసం ప‌ని చేసే క‌మిటీని రాజ‌కీయ క‌మిటీగా మార్చేయ‌డం ప‌ట్ల మాత్రం విమ‌ర్శ‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే టీటీడీ జంబో క‌మిటీ రాజ‌కీయ నేత‌లు, వ్యాపార‌వేత్త‌ల‌తో నిండిపోగా ఇప్పుడు ఎల్ఏసీలు కూడా రాజ‌కీయ క‌మిటీలుగా మార్చేశారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle