వైసీపీ 'కలర్స్ మిషన్'.. ఎన్నికలొస్తే రంగుపడాల్సిందేనా?
01-11-201901-11-2019 09:33:38 IST
2019-11-01T04:03:38.944Z01-11-2019 2019-11-01T04:03:36.913Z - - 09-12-2019

గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఇంతకు ముందు అధికారంలోకొచ్చిన ఏ పార్టీ కూడా చేయనంత ముమ్మరంగా ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వం 'కలర్స్ మిషన్' చేపట్టింది. ఇంతకు ముందు ప్రభుత్వాలలో అధికారిక భవనాలకు ఒక అధికారిక రంగు ఉండేది. గతంలో అధికారంలోకొచ్చిన టీడీపీ హయంలో అధికారిక భవనాలను వదిలి తమ హయంలో మొదలుపెట్టిన సంక్షేమ పథకాలు.. ఆయా కార్యక్రమాల కోసం నిర్మించిన భవనాలకు వారి పార్టీ పసుపు రంగులను అద్దింది. ఇక ఇప్పుడు అధికారంలోకొచ్చిన వైసీపీ అయితే ఇక్కడా.. అక్కడా అని లేకుండా.. ఇదీ.. అదీ అనే తేడా లేకుండా ప్రభుత్వానికి చెందిన ఏ భవనమైనా.. చిన్న ప్రహరీ గోడకు సైతం తమ పార్టీ మూడు రంగులను నింపేసింది. గుడి, బడి అని లేకుండా ప్రభుత్వానిదయిదే చాలు తమ పార్టీదే అన్న చందంగా మారిన ఈ రంగుల పిచ్చి ఎంతవరకు వెళ్లిందంటే చివరికి స్మశానాలు, సామూహిక మరుగుదొడ్లకు కూడా తమ పార్టీ రంగులను వేసేసుకునే వరకు వెళ్ళింది. తాజాగా రెండు రోజుల క్రితమే రాష్ట్రంలోని ఓ పంచాయతీ భవనానికి జాతీయ జెండాలోని మూడు రంగులు ఆకర్షణగా వేసి ఉండగా వైసీపీ నేతలు దగ్గరుండి మరీ జాతీయ జెండా రంగుల స్థానంలో తమ పార్టీ మూడు రంగులను వేయించారు. ఈ వ్యవహారం మన తెలుగు మీడియా పెద్దగా పట్టించుకోకపోయినా.. జాతీయ మీడియా ఏకిపారేసింది. జగన్ సర్కార్ పైత్యపు పోకడలు పరాకాష్టకు చేరింది అంటూ దేశవ్యాప్తంగా వినిపించేలా తూర్పార పట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ఈ కలర్స్ మిషన్ కు గాను ఏకంగా పదమూడు వందల కోట్లు ఖర్చు పెడుతున్నట్లుగా ఓ అంచనా ప్రభుత్వ వర్గాలలో వినిపిస్తుంది. అయితే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. సహజంగానే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా పార్టీలకు చెందిన వ్యక్తుల విగ్రహాల దగ్గర నుండి పార్టీలకు చెందిన రంగుల వరకు అన్నిటిని ఈసీ కనిపించకుండా చేస్తాయి. అందుకు గాను విగ్రహాలకు ముసుగులు వేయడం.. పార్టీ రంగులున్న చోట వాటిని తొలగించాలని అదేశిస్తుంది. మరి అప్పుడు ఈ ప్రభుత్వం వేస్తున్న రంగులు కోడ్ ఉల్లంఘన కిందకు రావా? ఎన్నికల కమిషన్ ఈ రంగుల వ్యవహారాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించి తొలగించాలని ఆదేశించడం ఖాయమని మేధావులు అభిప్రాయపడుతున్నారు. మరి అప్పుడు ఈ రంగులను తొలగించి తెలుపు లేదా ప్రభుత్వ అధికారికంగా ఉపయోగించే గోధుమ రంగును వేయాల్సి ఉంటుంది. అంటే అప్పుడు మరో పదమూడు వందల కోట్ల రూపాయలు రంగుల కోసం కేటాయించాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ అంతటితో ఉంటారా? మరోసారి తమ పార్టీ రంగులని వేయాలని భావిస్తే మరో పదమూడువందల కోట్లుకావాల్సి ఉంటుంది. ఆర్ధికంగా దివాళా తీసిందని రాష్ట్రంలో రంగుల కోసం వందల కోట్లను ఖర్చు పెట్టడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తుతుండగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఆసక్తిగా మారింది. ఎన్నికల కమిషనును మ్యానేజ్ చేయాలి.. లేదా తమ పార్టీ రంగులనే అధికారిక రంగులుగా మార్చేస్తారా? రంగులదేముంది ఎన్నిసార్లయినా వేసుకోవచ్చులే దానిదేముంది? అంటారా!!

చంద్రబాబుపై ఆనం వ్యాఖ్యకు పడిపడి నవ్విన జగన్.. విభేదాలు తొలగినట్లేనా?
11 minutes ago

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్.. విప్ జారీ
an hour ago

ఓడిపోయాం. ఒప్పుకుంటున్నాం.. కర్నాటక్ బైపోల్స్పై శివకుమార్
2 hours ago

20 మంది ఎమ్యెల్యేలను ఎదుర్కొనడానికి 150 మందికి శిక్షణా?
2 hours ago

పవన్లో అసహనం పెరుగుతోందా?
3 hours ago

ఉల్లి కష్టాలపై పవన్ సూటి ప్రశ్న
3 hours ago

రహస్య జీవోలు.. జగన్ పారదర్శకత చేతల్లో చూపించరే?
4 hours ago

విషాదం.. ఎస్కేయూ వైస్ ఛాన్సలర్ జయరాజ్ హఠాన్మరణం
5 hours ago

అధికారుల గొడవలు.. నివురుగప్పిన నిప్పులా ఏపీ సచివాలయం
6 hours ago

‘‘అంతా శరద్ పవారే చేశారు’’
8 hours ago
ఇంకా