newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

వైసీపీ ఎమ్మెల్యేల మ‌ధ్య వాట‌ర్ వార్‌..!

15-11-201915-11-2019 08:45:43 IST
Updated On 15-11-2019 16:36:54 ISTUpdated On 15-11-20192019-11-15T03:15:43.838Z15-11-2019 2019-11-15T03:15:17.633Z - 2019-11-15T11:06:54.029Z - 15-11-2019

వైసీపీ ఎమ్మెల్యేల మ‌ధ్య వాట‌ర్ వార్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అనంత‌పురం జిల్లా ఎమ్మెల్యేల‌ను అదుపు చేయాల‌న్నా.. ఆ ప్రాంత స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌న్నా అంత సుల‌భం కాదు. ఈ సంగ‌తి వైసీపీ అధిష్టానానికి ఇటీవ‌లె తెలిసొచ్చింది.

జిల్లా వైసీపీ ప్ర‌జా ప్ర‌తినిధుల తీరు ఇంత ఆల‌స్యంగా బోధ‌ప‌డ‌టానికి కార‌ణాలూ లేక‌పోలేదు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక జిల్లా అభివృద్ధి మీద ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన‌ మూడు రివ్యూలు ఆ విష‌యాన్ని స్ప‌ష్టం చేశాయి.

జిల్లా అభివృద్ధి విష‌య‌మై ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన రివ్యూల‌లో ఒక‌టి  జిల్లా మంత్రి శంక‌ర‌నారాయ‌ణ ఆధ్వ‌ర్యంలో మ‌రొక‌టి పాత ఇన్‌చార్జి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది.

మూడ‌వ‌ది ప్ర‌స్తుత జిల్లా ఇన్‌చార్జి, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆధ్వ‌ర్యంలో ఇలా ముచ్చ‌టగా మూడు రివ్యూలు జిల్లా అభివృద్ధి విష‌య‌మై జ‌రిగాయి. అయితే, ఈ మూడు స‌మావేశాల్లోనూ చ‌ర్చ‌లు కొలిక్కి రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అంత‌కు ముందు జ‌రిగిన సాగునీటి స‌ల‌హా మండ‌లి స‌మావేశంలో కూడా అంతే. ఎమ్మెల్యేలంతా ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న చందంగా వ్య‌వ‌హ‌రించారు. నీటి విష‌యంలో ఏ ఎమ్మెల్యే కూడా త‌గ్గ‌లేదు. 

అనంత‌పురం జిల్లాకు ఉన్న నీటి వ‌న‌రుల్లో ప్ర‌ధాన‌మైన‌వి రెండు. ఒక‌టి తుంగ‌భ‌ద్ర ఎగువ‌కాల్వ అయిన హెచ్ఎల్‌సీ, రెండ‌వ‌ది శ్రీ‌శైలం బ్యాక్ వాట‌ర్ మీదుగా ఏర్పాటైన హంద్రీనీవా ప్రాజెక్టు. ఈ రెండే జిల్లాకు ప్ర‌ధాన‌మైన ఆధారం.

అయితే, ఇప్పుడు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు నీరు కావాల‌ని డిమాండ్ పెట్ట‌డంతో మంత్రులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఇటీవ‌లె కొత్త ఇన్‌చార్జి మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అనంత‌పురం వ‌చ్చీరాగానే ఎమ్మెల్యేల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.

దీంతో వారి వారి మాట‌ను బ‌లంగా వినిపించేందుకు ఎమ్మెల్యేలంతా ఎవ‌రికి వారు త‌మ నియోజ‌క‌వ‌ర్గానికి నీళ్లు కావాలంటే.. త‌మ నియోజ‌క‌వ‌ర్గానికి నీళ్లు కావాలంటూ కావాలంటూ మైక్ అందుకుని మ‌రీ ఉప‌న్యాసాల మీద‌ ఉప‌న్యాసాలు ఇచ్చారు

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన స‌మావేశంలో పాల్గొన్న‌ మెజార్టీ ఎమ్మెల్యేలంతా వైసీపీ నేత‌లే అయినా వారి మ‌ధ్య కో ఆర్డినేష‌న్ లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు తేల్చేశారు. దీంతో ఇన్‌చార్జి మంత్రి ఏం చేయాలో తెలీక తిక‌మ‌క ప‌డుతున్నార‌ని స‌మాచారం. ఎమ్మెల్యేల మ‌ధ్య స‌ఖ్యత లేక‌పోవ‌డంతో మంత్రి కొంత అస‌హ‌నానికి గుర‌య్యార‌ని, దీంతో అనంత‌పురం ఎమ్మెల్యేల తీరు ఇప్పుడు వైసీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారిందంటూ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో జోరుగా చ‌ర్చ జరుగుతోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle