newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

వైసీపీ ఎమ్మెల్యేల‌ను పెడ‌చెవిన పెడుతున్న అధికారులు..!

21-09-201921-09-2019 10:26:56 IST
2019-09-21T04:56:56.467Z21-09-2019 2019-09-21T04:56:53.038Z - - 04-08-2020

వైసీపీ ఎమ్మెల్యేల‌ను పెడ‌చెవిన పెడుతున్న అధికారులు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విజ‌య‌న‌గ‌ జిల్లాలోని మొత్తం తొమ్మిది నియోజ‌క‌వ‌ర్గాలు ఒక‌ప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచు కోట‌లు. కానీ, ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో ఆ కోట‌లను బ‌ద్ద‌లు కొడుతూ ఊహించ‌ని రీతిలో వైసీపీ విజ‌య‌ఢంకా మోగించింది. కొత్త‌, పాత అన్న తేడా లేకుండా ప్ర‌తి వైసీపీ అభ్య‌ర్ధి వేల‌ల్లో మెజార్టీ సాధించి రికార్డుల‌ను సొంతం చేసుకున్నారు.

ఎన్నిక‌ల్లో విజ‌య దుందుభి మోగించి ఎంతో ఉత్సాహంతో ప్ర‌జ‌ల ముందు గ‌ర్వంగా నిలిచారు. ఇక‌పై తాము చెప్పిందే వేదం. అభివృద్ధి  త‌మ‌కే సాధ్య‌మ‌నుకున్నారంతా. అదే విష‌యం త‌మ అనుచ‌రుల‌కు కూడా చెప్పారు. కానీ, అధికారుల తీరు ఇప్పుడు వారికి మింగుడుప‌డ‌టం లేదు. ముఖ్యంగా ఈ జిల్లాలో ఏజెన్సీని ఆనుకుని మూడు నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో సాలూరు, కురుపాం నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు సీనియ‌ర్లు.

ఇక పార్వ‌తీపురంలో ఎమ్మెల్యే తొలిసారి గెలిచారు. అయితే వారంతా అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్న‌వారే. కానీ, ఇక్క‌డ చిక్కంతా అధికారుల‌తో వ‌చ్చిప‌డింద‌ని వారు వాపోతున్నారు. జిల్లాలోని అధికారులు త‌మ మాట విన‌డం లేద‌ని, త‌మ‌కు తెలియ‌కుండానే ప‌నులు చేసుకుపోతున్నార‌ని అధిష్టానం వ‌ద్ద మొర‌పెట్టుకుంటున్నారు.

ముఖ్యంగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సాలూరు ఎమ్మెల్యే రాజ‌న్న‌దొర విష‌యంలో ప్రోటోకాల్ పాటించ‌లేద‌ని, క‌నీసం త‌మ‌ను ప‌రిగ‌ణ‌లోకి కూడా అధికారులు తీసుకోవ‌డం లేద‌ని ఇటీవ‌ల మంత్రుల వ‌ద్ద మొర‌పెట్టుకున్నారు. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే ఇక ప్ర‌జ‌ల్లో తాము తిర‌గ‌లేమ‌ని, పార్టీకి, ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తేవ‌డంత‌ప్పితే తాము చేయ‌గ‌లిగింది ఏమీ లేదంటూ జిల్లా స‌మీక్ష‌లో స్వ‌యంగా ఎమ్మెల్యే రాజ‌న్న దొర విన్న‌వించుకోవ‌డం విశేషం.

ఇక కురుపాం ఎమ్మెల్యేగా రెండోసారి గెలుపొందిన పుష్ప శ్రీ‌వాణి ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో డిప్యూటీ సీఎం హోదాలో గిరిజ‌న సంక్షేమశాఖ మంత్రిగా ఉన్నారు. ఆమె జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న స‌మ‌యంలో ప్రోటోకాల్ గురించి అధికారులు పెద్ద‌గా ఆలోచ‌న చేయ‌లేద‌ని, మొక్కుబ‌డిగా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారే త‌ప్ప ఆమె ప‌ర్య‌ట‌న‌ల్లో మ‌న‌సుపెట్టి అధికారులు పాల్గొన‌డం లేదంటూ ఆమె అనుచ‌ర‌గ‌ణం చెబుతోంది.

దీంతోపాటు జిల్లాలో మ‌రో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు ఇచ్చిన మ‌ర్యాద‌, ప్రాధాన్య‌త కూడా త‌న‌కు ఇవ్వ‌డం లేద‌ని విచారంగా ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే పార్వ‌తీపురం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అలజంగి జోగారావు విష‌యంలో అధికారులు మ‌రీ విప‌రీత దోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారని, ఆయ‌న చెప్పిన అంశాల‌పై అస‌లు దృష్టిపెట్ట‌డం లేద‌ని తెలుస్తుంది. దీంతో జోగారావు తీవ్ర మ‌న‌స్థాపానికి గుర‌వుతున్నార‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు.

దీనికి తోడు ఇటీవ‌ల ఐటీడీఏ పీఓ తీరు ఇబ్బందిగా మారిందంటూ, ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం లేద‌ని ఎమ్మెల్యేలు ఇప్ప‌టికే అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశార‌ని విజ‌య‌వ‌న‌గ‌రం వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. దీంతో అధికారులు ఎవ‌రి అండ‌తో ఇలా రెచ్చిపోతున్నార‌న్న అనుమానాలు వ‌స్తున్నాయి. తాజాగా పార్వ‌తీపురం ఐటీడీఏ పీవోను బ‌దిలీ చేయడం వెనుక వారి హ‌స్తం ఉంద‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. పీవోగా డా.వినోద్ కుమార్ బాధ్య‌త‌లు చేప‌ట్టి మూడు నెల‌లే అయింది. ఇంత త్వ‌ర‌గా ఆయ‌న్ను బ‌దిలీ చేయ‌డంతో అధికారుల తీరుపై ఎమ్మెల్యేలు చాలా సీరియ‌స్‌గా ఉన్నార‌ని దాని ఫ‌లిత‌మే పీవో బ‌దిలీ అని జిల్లా అంతా భావిస్తోంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle