newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

వైసీపీ అధికారంలోకొచ్చాక మంచోళ్ళైన పోలీసులు!

21-10-201921-10-2019 09:46:18 IST
Updated On 21-10-2019 15:46:07 ISTUpdated On 21-10-20192019-10-21T04:16:18.111Z21-10-2019 2019-10-21T04:16:14.372Z - 2019-10-21T10:16:07.941Z - 21-10-2019

వైసీపీ అధికారంలోకొచ్చాక మంచోళ్ళైన పోలీసులు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాలకు.. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు భజన చేయడం అన్నది ప్రస్తుతం సాధారణంగా మారిపోయిందేమో అనిపిస్తుంది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలే పక్షపాత మచ్చలు పూసేసుకున్న తర్వాత పోలీస్ లాంటి వ్యవస్థలు అధికారానికి కొమ్ముకాయడం పెద్ద విషయమేమీ కాదేమో. పోలీసులు పరోక్షంగా అధికార పార్టీలకు కార్యకర్తలుగా పనిచేస్తున్నారన్నది ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతిపక్షాల నోట గట్టిగా వినిపిస్తున్న మాట. ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్లు, పోస్టింగులు అవసరం ఏదైనా ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉండాలన్నదే ఇప్పుడు పోలీస్ వాలకంగా కనిపిస్తుందని కొందరు విశ్లేషకులు సైతం బహిరంగంగా చెప్పేస్తున్నారు.

ఇక ఈ పోలీస్ పక్షపాత విషయంలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం గరంగరంగా రగిలిపోతుంది. ఏపీ పోలీసులు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గొడుగు పట్టేసి చట్టం-ధర్మం-న్యాయం అన్న పదాలకు ఆమడదూరంగా ఉన్నారన్నది అక్కడి పార్టీలే చేస్తున్న విమర్శలు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ నేతలకు, ప్రభుత్వానికి పోలీసులు ఊడిగం చేస్తున్నారని, అందరినీ సమానంగా చూడాల్సిన పోలీస్ వ్యవస్థ కొందరికి మాత్రమే న్యాయం చేస్తుందని ప్రతిపక్ష టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మరికొందరైతే సీఎం జగన్ స్టిక్కర్లను కూడా అంటిస్తూ ఆ పార్టీ కార్యకర్తలుగా మారిపోయారని కూడా విమర్శలు చేశారు.

అయితే ఇంతకు ముందు రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వైసీపీ నేతలు ఇదే పోలీసుల మీద ఇంతకు మించిన ఘాటు ఆరోపణలు చేశారు. అసలు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అన్నదే లేకుండా పోయిందని.. తమకు రాష్ట్ర పోలీసుల మీద నమ్మకమే లేదని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే తీవ్ర ఆరోపణలు చేశారు. విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడికత్తి కేసు కావచ్చు.. పులివెందుల వైఎస్ వివేకానందరెడ్డి హత్య కావచ్చు.. ఏపీ పోలీసులు ఆ కేసులను ముట్టుకుంటే తాము ఒప్పుకొనే ప్రసక్తే లేదని వైసీపీ నేతలు మీడియాలకెక్కి రచ్చరచ్చ చేశారు.

ఎన్నికలకు ముందు చంద్రబాబు సభ పరిసరాలలో ఓ రైతు ఆత్మహత్య ప్రయత్నం చేస్తే వైసీపీ నేతలు అది పోలీసుల పనేనన్నారు. రాష్ట్రంలోని పోలీసులంతా చంద్రబాబు మనుషులేనని దేశంమొత్తం వినిపించేలా అప్పుడు గగ్గోలు పెట్టేశారు. కానీ రోజులు తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకొచ్చాక ఇప్పుడు ఆ పోలీసులు మంచోళ్ళైపోయారా అనిపిస్తుంది. దీనికి కారణం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ మాదిరే ఇప్పుడు టీడీపీ కూడా విమర్శలు చేస్తుంది. అయితే ఇప్పుడు మాత్రం వైసీపీ నేతలు టీడీపీ ఆరోపణలు ససేమీరా ఒప్పుకోవడం లేదు.

ఏకంగా పోలీస్ వ్యవస్థనే టీడీపీ నేతలు అవమానిస్తున్నారంటూ ప్రస్తుతం రెచ్చగొట్టి ఉసిగొల్పుతున్నట్లుగా కనిపిస్తుంది. ఏకంగా పోలీసుల మీద టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. చంద్రబాబు పోలీస్ వ్యవస్థను కించ పరిచేలా మాట్లాడుతున్నారంటూ, పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు అరండల్ పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మరి ఐదు నెలల ముందు వరకు అసలు నమ్మకమే లేదన్న పోలీసులు ఇప్పుడు మంచోళ్లేలా అయ్యారన్నదే ఆసక్తిగా మారింది. దేశంలోనే అత్యంత అసమర్ధమైన వ్యవస్థగా నాడు పేర్కొన్న నేతలకు ఇప్పుడు ఆ వ్యవస్థలో అంతటి సమర్ధత ఎలా కనిపించింది? ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షం-పోలీస్ వ్యవస్థ మధ్య మీసాలు మెలేసి తొడలు కొట్టుకుంటూ సవాళ్లు చేసుకొనే పరిస్థితి వస్తే అధికార పక్షానికి మాత్రం పోలీస్ నీతివంతంగా ప్రజలకు సమన్యాయం చేసే వ్యవస్థగా ఎలా మారిపోయింది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నిజానికి రాష్ట్రంలో టీడీపీ లేవనెత్తుతున్న కొన్ని కేసులు అటు అధికార పక్షానికి కంటిలో నలుసుగా మారితే పోలీస్ వ్యవస్థ అసమర్ధ వ్యవస్థగా కనిపిస్తుంది. ఉదాహరణగా వైఎస్ వివేకా హత్య కేసు, కోడికత్తి కేసుల విషయంలో పోలీస్-అధికార వ్యవస్థలఫై టీడీపీ టార్గెట్ చేసి విమర్శలు చేస్తుంది. దీనికి తగ్గట్లుగానే వివేకా హత్య కేసు గురించి ఎవరూ మాట్లాడకూడదన్నట్లుగా పోలీసుల తీరు కనిపిస్తుంది. దీంతో ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడంలో ఇప్పుడు అధికార-పోలీస్ వ్యవస్థలు ఎదురుదాడి మొదలుపెట్టినట్లుగా కనిపిస్తుందని కొందరి వాదన. మరి ఈ ముక్కోణపు యుద్ధంలో ఇంకెన్ని మలుపులు చూడాల్సి వస్తుందో!

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle