newssting
BITING NEWS :
*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

వైసీపీ అగ్రెసివ్ లీడ‌ర్‌పై హాట్ న్యూస్‌..!

22-11-201922-11-2019 10:13:28 IST
2019-11-22T04:43:28.016Z22-11-2019 2019-11-22T04:43:26.200Z - - 15-12-2019

వైసీపీ అగ్రెసివ్ లీడ‌ర్‌పై హాట్ న్యూస్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎమ్మెల్యే ఆర్‌కే రోజా, అగ్రెసివ్‌గా లీడ‌ర్ల‌లో ఒక‌రు. ఆమె వాగ్ధాటికి ఎంత‌టి వారైనా సైలెంట్ అయిపోవాల్సిందే. రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు పొందిన రోజా ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీ అధికారంలోకి రాద‌నే టాక్ కూడా ఉండేది. కానీ, ఆ టాక్‌ను ప‌టా పంచ‌లు చేస్తూ ఆమె ఉన్న వైఎస్ఆర్‌సీపీ తొలిసారిగా అధికారంలోకి వ‌చ్చింది.

దీంతో అధికార వైసీపీలో రోజా హ‌వా ఒక రేంజ్‌లో ఉంటుంద‌ని అంద‌రూ భావించారు. ఆమె రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు ఇదొక అవ‌కాశం అన్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు అప్ప‌టి అధికార ప‌క్ష‌మైన తెలుగుదేశం పైనా.. దాని అధినేత‌పైనా.. నేత‌ల‌పైనా ఆమె చేసిన వ్యాఖ్య‌లు పెద్ద సంచ‌ల‌న‌మే రేపాయి.

అప్ప‌ట్లోనే అంత దూకుడు చూపిన రోజా ఇప్పుడు అధికార ప‌క్షంలో మ‌రింత రెచ్చిపోతార‌ని ప్ర‌తి ఒక్క‌రూ అనుకున్నారు. కానీ, ఎందుకో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన కొద్ది కాలానికే ఆమె పూర్తిగా సైలెంట్ అయిపోయారు.

ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు త‌న పార్టీ అధినేత వైఎస్ జ‌గన్‌పై ఈగ కూడా వాల‌నిచ్చేవారు కాదు రోజా. విప‌క్ష పార్టీలు జ‌గ‌న్‌పై కామెంట్ చేస్తే అందుకు త‌గ్గ‌ట్టుగా గ‌ట్టిగా స‌మాధానం ఇచ్చేవారు. విప‌క్షాల‌పై ఎదురు దాడికి దిగేవారు. కానీ, ఇప్పుడు అస్స‌లు నోరు మెద‌ప‌డం లేదు. క‌నీసం మీడియా ముందుకు కూడా రావ‌డం లేదు. ఇదే విష‌యం ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అంత అగ్రెసివ్‌గా ఉండే రోజా అస‌లు ఏమైపోయారు...?  కొత్త‌గా చేప‌ట్టిన బాధ్య‌త‌ల్లో అంత బిజీ అయిపోయారా..? అని రాజ‌కీయాల‌ను ఫాలో చేస్తున్న నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

రాష్ట్రంలో వివిధ అంశాల‌పై రాజ‌కీయంగా పెద్ద ఎత్తున ర‌చ్చ జ‌రుగుతోంది. ఒక‌టి కాదు.. రెండు కాదు.. ప్ర‌తీది ఇప్పుడు వివాద‌స్ప‌ద అంశ‌మే. టీడీపీ, జ‌న‌సేన, బీజేపీ ఇలా పార్టీల‌న్నీ జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. వీటిపై మంత్రులు, ఇత‌ర నేత‌లు కౌంట‌ర్లు ఇస్తుంటే రోజా మాత్రం ఒక్క‌సారి కూడా మీడియా ముందుకు రాలేదు.

ఈ క్ర‌మంలో కొంద‌రు మంత్రి ప‌ద‌వి రాలేద‌ని రోజా అలిగిన‌ట్టు ఉన్నార‌ని అంటుండ‌గా మ‌రికొంద‌రు మాత్రం అలాంటిదేమీ లేదు. ఆమెను కొంచెం సైలెంట్‌గా ఉండాల‌ని పార్టీయే స‌ల‌హా ఇచ్చింద‌ని  చెప్పుకొస్తున్నారు. ఈ కార‌ణంగానే రోజా త‌న ప‌నేదో తాను చేసుకుంటున్నారే త‌ప్ప ఇత‌ర విష‌యాలు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తెలుస్తుంది.

 

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle