newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

‘‘వైసీపీ అఖండ విజయం ఖాయం’’

12-04-201912-04-2019 08:41:45 IST
Updated On 06-07-2019 15:31:23 ISTUpdated On 06-07-20192019-04-12T03:11:45.589Z12-04-2019 2019-04-12T03:01:43.038Z - 2019-07-06T10:01:23.805Z - 06-07-2019

‘‘వైసీపీ అఖండ విజయం ఖాయం’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐదేళ్ళ కష్టం.. .జగన్ కళ్ళల్లో కనిపిస్తోంది. ఈవీఎంలలో జనం ఇచ్చిన తీర్పు ఎలా వున్నా.. వైసీపీ నేతలు మాత్రం విజయంపై ధీమాతో ఉన్నారు. ఎన్నికలు సజావుగా జరగకుండా చేసేందుకు, ఓటింగ్ శాతం తగ్గించేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నారంటూ వైసీపీ అధినేత జగన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికలు ముగిశాక గురువారం రాత్రి ఆయన హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లో మీడియాతో మాట్లాడారు.

80 శాతం పైచిలుకు ప్రజలు బ్రహ్మాండంగా ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు కృషిచేశారని, వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఏ పార్టీకి తాము ఓటు వేసిందీ ప్రజలు స్పష్టంగా వీవీప్యాట్‌ ద్వారా చూడగలిగారని, అలాంటి తరుణంలో ఈవీఎంలపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు జగన్‌ స్పందిస్తూ.. ప్రజల దయ, దేవుడి ఆశీస్సులతో వైకాపా అఖండ విజయం సాధించబోతోందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఆయన మాటల్లో గెలుపు తమదే అన్న విశ్వాసం కనిపిస్తోంది.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle