newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

వైసీపీలో చేర‌ను కానీ.. టీడీపీ ఎమ్మెల్యే మ‌ద్దాలి అస‌లు వ్యూహం ఇదే..!

31-12-201931-12-2019 12:08:21 IST
2019-12-31T06:38:21.931Z31-12-2019 2019-12-31T06:38:20.065Z - - 22-01-2020

వైసీపీలో చేర‌ను కానీ.. టీడీపీ ఎమ్మెల్యే మ‌ద్దాలి అస‌లు వ్యూహం ఇదే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలేలా ఉంది. గుంటూరు జిల్లా ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరిధ‌ర్‌రావు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని క‌లిశారు. మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావుతోపాటు సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ద్దాలి గిరిధ‌ర్‌రావు అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేశారు.

జ‌గ‌న్‌ను క‌లిసిన త‌రువాత మీడియాతో మాట్లాడిన మ‌ద్దాలి గిరిధ‌ర్ త‌న భ‌విష్య‌త్తుపై ప‌రోక్షంగా స్ప‌ష్ట‌త ఇచ్చారు. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి నిధుల కోస‌మే తాను సీఎంను క‌లిశాన‌ని చెప్పిన గిరి అదే స‌మ‌యంలో చంద్ర‌బాబుపై ప‌లు ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

ఐదేళ్ల‌పాటు అధికారంలో ఉండి రాజ‌ధాని రైతుల‌కు ఏం చేశామ‌న్న‌ది చంద్ర‌బాబు ఆలోచ‌న చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అమ‌రావ‌తిలో రాజ‌ధానిని నిర్మించాలంటే మౌలిక స‌దుపాయాల‌కే ల‌క్ష కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు అవుతుంద‌ని, అంత భారం మోసే స్థితిలో రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ లేద‌ని టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

ఐదేళ్ల‌లో చంద్ర‌బాబు రాజ‌ధానికి కేవ‌లం రూ.5 వేల 500 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేశార‌ని, క‌నుక‌, ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌తో రాజ‌ధాని నిర్మాణం సాధ్యం కాద‌ని గిరి అభిప్రాయ‌ప‌డ్డారు. అమ‌రావ‌తిలోనే శాస‌న వ్య‌వ‌స్థ ఉంటుంద‌ని, ఇక్క‌డ ఎడ్యుకేష‌న్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసే యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంద‌ని, జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మంచి ఆలోచ‌న‌తో ముందుకు వెళుతున్నార‌ని గిరి కితాబిచ్చారు.

పేద ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో ఇంగ్లీషు మీడియం కోరుకుంటున్నార‌ని, ఆ విష‌యాన్నే తాను చంద్ర‌బాబుకు వివ‌రించాన‌ని, అయినా ఆయ‌న మాత్రం తాను చేప్పిన గ్రౌండ్ రిపోర్టును ప‌ట్టించుకోకుండా ద్వంద వైఖ‌రిని అనుస‌రించార‌ని గిరి విమ‌ర్శించారు. గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం గ‌త ఐదేళ్ల‌లో బాగా నిర్ల‌క్ష్యానికి గురైంద‌ని, అందుకే రూ.25 కోట్లు విడుద‌ల చేయాల్సిందిగా ముఖ్య‌మంత్రిని విజ్ఞ‌ప్తి చేయ‌గా, త‌క్ష‌ణం ఆయన అధికారుల‌ను పిలిపించి నిధుల‌ను విడుద‌ల చేయాల్సిందిగా త‌న‌కు సంతోషంగా ఉంద‌న్నారు.

వైసీపీలో చేరుతున్నారా..? అని ప్ర‌శ్నించ‌గా, తాను ఏ పార్టీలో కూడా చేర‌డం లేద‌ని సూటిగా స‌మాధానం చెప్పారు. మ‌రి అసెంబ్లీలో మీరు కూడా వ‌ల్ల‌భనేని వంశీ మాదిరిగానే ప్ర‌త్యేక స‌భ్యుడిగా గుర్తింపు అడుగుతున్నారా..? అన్న ప్ర‌శ్న‌కు టీడీపీ త‌న‌ను అంగీక‌రించ‌క‌పోతే ప్ర‌త్యేక స‌భ్యుడిగా గుర్తించాల్సిందిగా తాను కూడా కోరుతాన‌ని గిరి స్ప‌ష్టం చేశారు.

ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరి చెప్పిన‌దానిబ‌ట్టి చూస్తుంటే ఆయ‌న నేరుగా వైసీపీలో చేరే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. అలా అని టీడీపీతో ప‌య‌నించే సూచ‌న‌లు కూడా లేవు. వ‌ల్ల‌భ‌నేని వంశీ త‌ర‌హాలోనే ప్ర‌త్యేక స‌భ్యుడిగా ఉండేందుకు ఆయ‌న ఇష్ట‌ప‌డుతున్న‌ట్టుగా ఉంది.

గ‌తంలో వ‌ల్ల‌భ‌నేని వంశీ కూడా సీఎం జ‌గన్ మోహ‌న్‌రెడ్డిని క‌లిసిన‌ప్పుడు తాను నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల మీదే ముఖ్య‌మంత్రిని క‌లిశాన‌ని చెప్పినాస‌రే టీడీపీ మాత్రం ఆయ‌న‌పై వేటు వేసింది. ఇప్పుడు మ‌ద్దాలి గిరిని కూడా టీడీపీ స‌స్పెండ్ చేస్తుందా..?  లేదా..? అన్న‌ది చూడాలి. ఒక‌వేళ టీడీపీ వేటువేస్తే ప్ర‌త్యేక స‌భ్యుడిగా మ‌ద్దాలి గిరిని గుర్తించే అవ‌కాశం ఉంటుంది. ఏది ఏమైనా మొన్న‌టి ఎన్నిక‌ల్లో గుంటూరు జిల్లాలోని 17 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ 15 స్థానాల్లో గెల‌వ‌గా, టీడీపీ కేవ‌లం 2 చోట్ల మాత్ర‌మే విజ‌యం సాధించింది. ఇప్పుడు ఆ ఇద్ద‌రు స‌భ్యుల్లో ఒక‌రు తిరుగుబావుటా ఎగుర‌వేయ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చనీయాంశ‌మైంది.

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle