newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

వైసీపీలో ఎందుకీ గంద‌ర‌గోళం..?

26-11-201926-11-2019 12:59:43 IST
Updated On 26-11-2019 14:07:53 ISTUpdated On 26-11-20192019-11-26T07:29:43.164Z26-11-2019 2019-11-26T07:29:41.254Z - 2019-11-26T08:37:53.956Z - 26-11-2019

వైసీపీలో ఎందుకీ గంద‌ర‌గోళం..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నారు అంటూ ఏపీ బీజేపీ కీల‌క నేత సుజ‌నా చౌద‌రి చేసిన వ్యాఖ్య‌లు వైసీపీలో ఒక్క‌సారిగా అల‌జ‌డి రేపాయి.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీని, జ‌గ‌న్ హ‌వాతో గెలిచిన కృత‌జ్ఞ‌త‌ను వీడి ఎంపీలు రాష్ట్రంలో బ‌ల‌హీనంగా ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరుతారా అనే విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీలో ఒక గంద‌ర‌గోళం అయితే నెల‌కొన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

పార్ల‌మెంట్ స‌మావేశాల ప్రారంభానికి ముందు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎంపీల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. పార్ల‌మెంటులో అనుస‌రించాల్సిన వ్యూహం వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ చేసిన సూచ‌న‌లు కొంత అనుమానించాల్సివిగా ఉన్నాయి.

ఎంపీలు ఎవ‌రూ ఒంట‌రిగా వెళ్లి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రుల‌ను క‌ల‌వ‌ద్ద‌ని, విజ‌య‌సాయిరెడ్డి, మిథున్‌రెడ్డితో మాత్ర‌మే వెళ్లాల‌ని జ‌గ‌న్ స్ప‌ష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

బీజేపీ త‌మ ఎంపీల‌పై ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ మొద‌లుపెడుతుందేమోన‌నే అనుమానంతోనే జ‌గ‌న్ ఈ ఆదేశాలు ఇచ్చార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక‌, పార్ల‌మెంటు స‌మావేశాల మొద‌టి రోజే న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు తెలుగుపై చేసిన వ్యాఖ్య‌లు వైసీపీని ఇబ్బంది పెట్టాయి.

ఈ వ్యాఖ్య‌ల‌పై జ‌గ‌న్ అసంతృప్తి వ్య‌క్తం చేసి, ఆయ‌న‌ను పిలిపించి మాట్లాడారు. మ‌రోసారి పార్టీ లైన్‌ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల‌ని సున్నితంగా హెచ్చ‌రించారు. అయినా ర‌ఘురామ‌కృష్ణంరాజు మ‌రోసారి ఊహాగానాల‌కు తెర‌లేపారు. సోమ‌వారం ఆయ‌న బీజేపీ పార్ల‌మెంట‌రీ పార్టీ కార్యాల‌యంలో ప్ర‌త్య‌క్షం అయ్యారు.

అయితే, కేవ‌లం త‌న‌కు ఢిల్లీలో కేటాయించాల్సిన క్వార్ట‌ర్స్ గురించి మాట్లాడేందుకే ఆయ‌న అక్క‌డ‌కు వెళ్లినా, ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో వెళ్ల‌డం మాత్రం మ‌రోసారి పార్టీకి త‌ల‌నొప్పి త‌చ్చేలా ఉంది.

మ‌రోవైపు ఎంపీల్లో కేవ‌లం విజ‌య‌సాయిరెడ్డి, మిథున్‌రెడ్డికి మాత్ర‌మే ప్రాధాన్య‌త ఇస్తున్నార‌నే అసంతృప్తి వైసీపీ ఎంపీల్లో ఉంద‌నే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. వారిద్ద‌రూ వెంట లేనిదే ఎవ‌రినీ క‌ల‌వొద్ద‌ని జ‌గ‌న్ ఆదేశాలు ఇచ్చారు.

అయితే, సోమ‌వారం ఢిల్లీ వెళ్లిన గ‌వ‌ర్న‌ర్‌ను మాత్రం విజ‌యసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి ప్ర‌త్యేకంగా వెళ్లి క‌లిశారు. త‌ర్వాత ఎంపీల‌ను వెళ్లి క‌లిసి రావాల‌ని సూచించారు.

తమ‌తో వారిద్ద‌రూ వ‌స్తార‌ని ఎంపీలంద‌రూ భావించి, చివ‌ర‌కు వేరుగా వెళ్లి క‌లిశారు. ఇది ఎంపీల్లో కొంత అసంతృప్తికి కార‌ణ‌మైంది. 22 మంది లోక్‌స‌భ స‌భ్యుల‌తో దేశంలోనే నాలుగో అతి పెద్ద పార్టీగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీని నడిపించ‌డంలో మాత్రం స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి.

ఎంపీలంతా కొత్త వారు కావ‌డం ఇందుకు ఒక కార‌ణ‌మైతే, ఎక్కువ‌గా అనుభ‌వం లేని, మొద‌టిసారి ఎంపీ అయినా విజ‌య‌సాయిరెడ్డి పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌గా, రెండోసారి గెలిచిన మిథున్‌రెడ్డి లోక్‌స‌భా ప‌క్ష నేత‌గా ఉండ‌టంతో ఎంపీల‌కు స‌రైన మార్గ‌ద‌ర్శ‌కం లేనట్లు క‌నిపిస్తోంది.

రాష్ట్రం నుంచి ఉన్న 25 మందిలో 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ పార్ల‌మెంటులో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేయాల్సి ఉంటుంది. ఐక్యంగా ఏపీ గొంతును వినిపించాల్సిన అవ‌స‌రం ఉంటుంది. కానీ, ఎంపీల్లోనే ఈ గంద‌ర‌గోళం కేవ‌లం వైసీపీకి మాత్ర‌మే కాకుండా రాష్ట్రానికి కూడా న‌ష్టం చేసే అవ‌కాశాలు ఉన్నాయి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle