newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

వైసీపీలోకి వలసల వెల్లువ

18-03-201918-03-2019 07:42:50 IST
2019-03-18T02:12:50.788Z18-03-2019 2019-03-18T02:12:31.628Z - - 25-02-2020

వైసీపీలోకి వలసల వెల్లువ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈ ఎన్నికల్లో ఊహించని రాజకీయ మలుపులు విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తున్నాయట. విభజన తర్వాత వైసీపీలో చేరి ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఎట్టకేలకు మరోసారి వైసీపీలో చేరుతున్నారు. మొన్నటి దాకా ఆయన టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది. అనకాపల్లి ఎంపీ సీటు నుంచి కొణతాల పోటీ చేస్తారని టీడీపీ నేతలు లీకులు కూడా ఇచ్చారు. కానీ టిక్కెట్ ఇచ్చే అంశం మీద చంద్రబాబు నుంచి కొణతాలకు స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆయన వైసీపీలో చేరారు.

Image may contain: 4 people, people smiling

ఇక ఒంగోలు ఎంపీ సీటు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఒప్పుకోని మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కూడా వైసీపీలో చేరారు. కొంత కాలంగా మాగుంట వైసీపీలో చేరతారని వార్తలు రావడంతో ఒంగోలు సీటు నుంచి శిద్దా రాఘవరావును బరిలో దింపుతున్నారు చంద్రబాబు. ఇప్పుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగితే పోటీ రసవత్తరంగా మారనుంది.

వీరితో పాటు మాజీ ఎంఎల్ఏలు వంగా గీత, ద్రోణంరాజు శ్రీనివాస్ కూడా వైసీపీలో చేరారు. వీరితో పాటు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా కర్నూలు ఎంపీ సీటు నుంచి గెలిచిన బుట్టా రేణుక, ఆ తర్వాత టీడీపీలో చేరారు.

Image may contain: 3 people, people smiling, people standing

తన చేరిక సమయంలో 2019లో కూడా కర్నూలు ఎంపీ టిక్కెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కర్నూలు ఎంపీ టిక్కెట్ ఖరారు అవ్వడంతో, చంద్రబాబు మీద ఆగ్రహంగా ఉన్నారు బుట్టా రేణుక. చంద్రబాబు ఎంఎల్ఏ టిక్కెట్ ఇస్తానన్నా, రాజ్యసభకు పంపుతానన్న బుట్టా రేణుక ఒప్పకోలేదట.

తనకు గెలిచే సత్తా ఉన్నప్పుడు టిక్కెట్ ఎందుకు ఇవ్వరని చంద్రబాబును ఆమె ప్రశ్నించినట్లు సమాచారం. అయినా చంద్రబాబు నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వైసీపీలో చేరారు బుట్టా రేణుక. మొత్తానికి ఈ తాజా పరిణామాలు అన్ని పార్టీల కార్యకర్తల్లో టెన్షన్ పెంచుతున్నాయి.

Image may contain: 2 people, people smiling, people standing


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle