newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

వైసీపీలోకి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్సీలు జంప్‌..?

27-12-201927-12-2019 12:11:05 IST
Updated On 27-12-2019 12:25:24 ISTUpdated On 27-12-20192019-12-27T06:41:05.512Z27-12-2019 2019-12-27T06:41:01.954Z - 2019-12-27T06:55:24.680Z - 27-12-2019

వైసీపీలోకి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్సీలు జంప్‌..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ టీడీపీ ఎమ్మెల్సీలు అధికార వైసీపీ నేత‌లకు ట‌చ్‌లో ఉన్నారా? ఈ రాజ‌కీయ ప‌రిణామం కాస్తా ఎన్నో సంవ‌త్స‌రాల అనుభ‌వం ఉన్న టీడీపీ అస్థిత్వానికే ప్ర‌మాద‌క‌రంగా మార‌నుందా? పార్టీ శ్రేణుల్లో భ‌ద్ర‌తా భావాన్ని క‌ల్పించ‌డంలో అధినేత చంద్ర‌బాబు విఫ‌ల‌మ‌య్యాడా? అన్న ప్ర‌శ్న‌ల‌కు రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే సమాధానాలు వినిపిస్తున్నాయి.

ఏపీ ప్ర‌జ‌ల్లో తెలుగుదేశంపై న‌మ్మ‌కం క‌ల‌గ‌క‌పోవ‌డం, చంద్ర‌బాబు త‌రువాత ఆ పార్టీని ఎవ‌రు న‌డిపిస్తారు..? వ‌ంటి ప్ర‌శ్న‌లు తెర‌మీద‌కు వ‌చ్చిన‌ప్పుడు కింది స్థాయి కేడ‌ర్ నుంచి నేత‌ల వ‌ర‌కు పార్టీలో ఉండి లాభం లేద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేస్తున్నారు. ఇలా టీడీపీ బ‌ల‌హీన‌త‌ను గ‌మ‌నించిన వైసీపీ ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వేగ‌వంతంగా దూసుకెళ్తోంది.

ఎన్నిక‌ల ఫలితాల‌కు ముందు ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో రాష్ట్ర‌మంతా క‌లిగియ తిరిగి ప్ర‌భంజ‌నం సృష్టించిన వైసీపీ.. అధికారం చేప‌ట్టిన ఆరు నెల‌ల్లోనే అంత‌కు మించిన మైలేజ్‌ను ప్ర‌జ‌ల నుంచి సొంతం చేసుకుంది. అంత‌లా సీఎం జ‌గ‌న్ అమ‌లు చేసిన  సంక్షేమ కార్య‌క్ర‌మాలు ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యాయి. ఇలా వినూత్న ఆలోచ‌న‌ల‌తో అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా పాల‌న సాగిస్తున్న వైసీపీకి రాష్ట్రంలోని అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి సంపూర్ణ మ‌ద్ద‌తు ల‌భిస్తోంది.

సాధార‌ణ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన రిజ‌ల్టే.. రానున్న జ‌న‌వ‌రిలో జ‌ర‌గ‌నున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ రిపీట్ అవుతుంద‌ని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. ఇలా కేవ‌లం ఒక్క స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లే కాదు.. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ రూపొందిస్తున్న ప్ర‌ణాళిక‌ల‌ను ప‌రిశీలిస్తే టీడీపీ వంటి అనుభ‌వం ఉన్న పార్టీకి ప్ర‌స్తుతం ఉన్న సీట్లు కూడా గ‌ల్లంత‌వుతాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ప్ర‌జా సంక్షేమ‌మే ప‌ర‌మావ‌ధిగా పాల‌న సాగిస్తూ, రానున్న 20 ఏళ్ల‌లోనూ వైసీపీనే అధికారంలో ఉండేలా ప‌థ‌కాలు రూపొందిస్తున్నారు సీఎం జ‌గ‌న్. ఇలా వైసీపీ వ్యూహాన్ని ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలిస్తున్న ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన కొంద‌రు దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాలి అన్న చందంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. వారి నిర్ణ‌యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి అతి త్వ‌ర‌లోనే భారీ సంఖ్య‌లో చేరిక‌లు ఉండే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

కాగా, ప్ర‌స్తుత శాస‌న మండ‌లిలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ బ‌లం చెప్పుకోద‌గ్గ రీతిలోనే ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ కార‌ణంగానే జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకుంటున్న ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌ను మండ‌లిలోని టీడీపీ స‌భ్యులు వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్నారు. ఈ త‌ర‌హా ఘ‌ట‌న ప్ర‌భుత్వానికి ఇబ్బంది క‌లిగించే అంశమే.

ఇలా ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేసేందుకు రూపొందించిన ప్ర‌తి బిల్లుకు మండ‌లిలోని టీడీపీ స‌భ్యులు అడ్డు త‌గులుతున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ స‌ర్కార్ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌తీసి టీడీపీ నుంచి ఎమ్మెల్సీల చేరిక‌ను ప్రోత్స‌హించాల‌ని వైసీపీ నిర్ణ‌యించిన‌ట్టు రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. వైసీపీ తీసుకున్న ఈ నిర్ణ‌యం అమ‌లైతే మాత్రం శాస‌న మండ‌లిలోనూ టీడీపీకి ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే చెప్పాలి.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle