newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

వైసీపీలోకి మాజీ మంత్రి, ఎమ్మెల్యే.. .. చంద్రబాబుకి షాకేనా?

23-07-202023-07-2020 18:14:43 IST
Updated On 23-07-2020 18:18:23 ISTUpdated On 23-07-20202020-07-23T12:44:43.429Z23-07-2020 2020-07-23T12:44:38.036Z - 2020-07-23T12:48:23.570Z - 23-07-2020

వైసీపీలోకి మాజీ మంత్రి, ఎమ్మెల్యే.. .. చంద్రబాబుకి షాకేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆయన ఏ ప్రభుత్వం వచ్చినా అందులో క్రియాశీలక పాత్ర పోషిస్తారు. ఒకవేళ వేరే పార్టీలో వున్నా అధికారంలో వున్న పార్టీలోకి వచ్చేస్తారు. ఆయన అక్కడ కీలకంగా వ్యవహరిస్తారు. తనతో పాటు తన సహచరులను కూడా లాగేస్తారు. కానీ ఈ మధ్య కాలంలో ఆయన టైం బాగున్నట్టు లేదు. అందుకే విపక్ష పార్టీలోనే వుండిపోయారు. అనేక సార్లు అధికార పార్టీలోకి జంప్ జిలానీ అవుదామన్నా టైం కుదరలేదంటారు. ఆ పార్టీలోని కీలక వ్యక్తి ఈయన ఎంట్రీ ‘రెడ్డీ’గా లేరని అంటారు. చివరాఖరికి శ్రావణమాసం వచ్చాక ఈయన రూట్ క్లియర్ అయినట్టుంది. సదరు కింగ్ మేకర్ లేకుండానే అధికార పార్టీలోకి వచ్చేయడానికి లైన్ క్లియర్ చేసుకున్నారు. 

ఇంతకీ ఎవరనేగా మీ డౌట్ ఆయనే టీడీపీ నేత, ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. వైసీపీలోకి గంటా ఎంట్రీ షురూ అవుతోంది. ఆయన త్వరలో టీడీపీకి గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం జగన్‌తో సన్నిహితంగా మెలిగే కీలక నేతలతో మంతనాలను కూడా ముగించినట్లు సమాచారం. గంటా చేరికకు సీఎం జగన్ నుంచి క్లియరెన్స్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. 

ఈ మేరకు ఆయనతో మంతనాలు చేసినట్లు గంటా సన్నిహితులు పేర్కొంటున్నారు. ఆగస్టు 15 న ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని జగన్ ప్రభుత్వం భావించింది, ఈ కార్యక్రమం వేదికగానే గంటా వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. అయితే వైసీపీలో గంటా చేరికపై... సీనియర్లైన మంత్రి అవంతి శ్రీనివాస్, విజయసాయి రెడ్డి కాలడ్డుతున్నట్లు సమాచారం.

అయినప్పటికీ వైసీపీలో గంటా చేరిక ఖాయమైపోయినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా టీడీపీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీలో చేరనున్నారన్న ప్రచారం ఊపందుకుంది. నెంబర్ 2, రాజ్యసభ ఎంపీ అయిన విజయసాయిరెడ్డికి తెలియకుండా పావులు కదిపిన గంటా అందులో విజయం సాధించాలరని తెలుస్తోంది. 

సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడైన విజయసాయికి తెలియకుండా ఇదంతా జరిగిందా? వైసీపీలో చీమ చిట్టుక్కుమన్నా సరే... ఆయనకు తెలియాల్సిందే. దాదాపు పార్టీ వ్యవహారాలన్నీ కూడా ఆయన కనుసన్నల్లోనే నడుస్తాయని కేడర్‌ విశ్వాసం. ఎవరు వైసీపీలోకి రావాలన్నా... పదవులు లభించాలన్నా ఆయన తప్పని సరిగా జోక్యం చేసుకుంటారు. ఇంతటి కీలకమైన విజయ సాయి రెడ్డికే తెలియకుండా వైసీపీలో చేరిపోవడానికి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస రావు పావులు కదిపినట్లు సమాచారం.

ఇక మరో కీలక నేత, గంటా ప్రత్యర్థి అయిన మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కూడా ఈ విషయం అసలు తెలియదట. అలా గంటా శ్రీనివాస రావు వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.సీఎం జగన్‌తో సన్నిహితంగా మెలిగే కీలక నేతలతో ఈ తతంగాన్ని గంటా పూర్తి చేసేశారు. అంతేకాకుండా సీఎం జగన్ కూడా ఈయన రాకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

అయితే గంటా రాకను రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎలాగైనా సరే.. గంటా ఆగమనానికి బ్రేక్ వేయాలని శతధా ప్రయత్నించినట్లు సమాచారం. అయినా... గంటా వేసిన పాచికలతో వీరిద్దరూ ఇరుకున పడినట్లు సమాచారం.విజయసాయి రెడ్డికి సైడ్ కొట్టేసి... తతంగం పూర్తి చేశారు గంటా. ఇటీవలి కాలంలో గంటాను టార్గెట్ చేస్తూ ఇరువురూ తీవ్ర విమర్శలకు దిగారు. మంత్రి అవంతి శ్రీనివాస్ అయితే ఓ అడుగు ముందుకేసి.. గంటా అరెస్ట్ తప్పదని ప్రకటించారు కూడా. 

గంటా పార్టీలోకి వస్తే... తమ ప్రాధాన్యం తగ్గిపోతుందని వీరిద్దరూ భయపడుతున్నట్లు సమాచారం. గంటాను మొదటి నుంచీ అవంతి శ్రీనివాస్ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇక ఎంపీ విజయ సాయిరెడ్డి కూడా ఇదే బాటలో ఉన్నారు.తనకు తెలియకుండా గంటా గనుక వైసీపీ తీర్థం పుచ్చుకుంటే.. తన ప్రాధాన్యం పార్టీలో తగ్గిపోయిందని విమర్శలు వస్తాయని విజయసాయి రెడ్డి భావనగా ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. గంటా అరెస్ట్ అవుతారని సంచలన వ్యాఖ్యలు చేసిన అవంతి శ్రీనివాస్ లాగే.. విజయ సాయి రెడ్డి కూడా గంటాపై తీవ్ర విమర్శలే చేశారు. 

గంటా మంత్రిగా ఉన్న సమయంలో సైకిళ్ల కుంభకోణం చేశారంటూ తిట్టిపోశారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో వైసీపీలో చేరడానికి గంటా విజయ సాయి రెడ్డి ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు మాత్రం పార్టీలో నెంబర్ 2 గా చెలామణి అవుతున్న విజయసాయి రెడ్డికి సైడ్ కొట్టేసి... నేరుగా జగన్ కోటరీతో గంటా మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది.

పార్టీకి సంబంధించి ఉత్తరాంధ్ర వ్యవహారాలన్నీ విజయసాయి రెడ్డే చూస్తున్నారు. అంతటి కీలకమైన బాధ్యతల్లో ఉన్న విజయసాయికే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన గంటా చేరికపై సమాచారం లేకపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. మరికొద్దిరోజుల్లో టీడీపీలో సునామీ తప్పదని విశాఖ టీడీపీలో పెద్ద దిక్కు వైసీపీలోకి రావడం ఖాయమయిందనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. 

అధికారంలేకుంటే గంటా ఉండలేరని ఆయన ప్రత్యర్ధులే చెబుతున్నారు. కాంగ్రెస్ లో మంత్రిగా చేసిన గంటా 2014లో టీడీపీలోకి వచ్చి మళ్ళీ మంత్రి అయ్యారు. 2019 ఎన్నికలకు ముందే ఆయన జగన్ పంచన చేరతారని భావించారు. కానీ అది కుదరలేదు. ఈసారి ఆయన వైసీపీలోకి రావడం పక్కా అయిపోయింది.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle