newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

వైసీపీలోకి మరో టీడీపీనేత..!

01-10-201901-10-2019 15:53:16 IST
2019-10-01T10:23:16.257Z01-10-2019 2019-10-01T09:55:27.829Z - - 25-05-2020

వైసీపీలోకి మరో టీడీపీనేత..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. ఇతర పార్టీల్లోని నేతలు ఒక్కొక్కరిగా వైసీపీ బాట పడుతున్నారు. ఇప్పటికే టీడీపీ పార్టీ నుంచి పలువురు వైసీపీలో చేరగా.. తాజాగా విశాఖపట్టణం జిల్లా టీడీపీ సీనియర్‌ నేత వైసీపీలో చేరుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సదరు నేత వైసీపీ పెద్దలతో మంతనాలు జరిపినట్లు ప్రచారం సాగుతుంది.. ఈనెల 8న ఆయన వైకాపా కండువా కప్పుకోనున్నట్లు విస్తృత ప్రచారం సాగుతుంది. ఆయనెవరా.. అనుకుంటున్నారా.. టీడీపీ సీనియర్‌ నేత పంచకర్ల రమేష్‌ బాబు. ఆయన గతకొంతకాలంగా టీడీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

పంచకర్ల రమేష్‌బాబు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, విశాఖ రూరల్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు. ప్రజారాజ్యం పార్టీ తరపున 2009లో పెందుర్తి నుంచి పోటీచేసి గెలుపొందాడు. తరువాత పీఆర్‌పీ విలీనంతో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగాడు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్‌ తీరును ఎండగట్టి బయటకు వచ్చారు. 2014లో టీడీపీలో చేరిన పంచకర్ల విశాఖ ఉత్తర నియోజకవర్గం సీటును ఆశించారు. టీడీపీ, బీజేపీ పొత్తు నేపథ్యంలో ఆ స్థానం బీజేపీ ఖాతాలోకి చేరింది. దీంతో పంచకర్ల రమేష్‌బాబును యలమంచలి నుంచి చంద్రబాబు బరిలోకి దించారు. నియోజకవర్గం కొత్త అయినప్పటికీ టీడీపీ కంచుకోట కావటంతో పంచకర్ల విజయం సాధించారు.

రమేష్‌బాబు చురుకైన నాయకుడు కావటం, కాపు సామాజిక వర్గం నేతకావటంతో విశాఖ రూరల్‌ జిల్లాకు అధ్యక్షునిగా అధిష్టానం నియమించింది. 2019లో జరిగిన ఎన్నికల సమయంలో పంచకర్ల చూపు మళ్లి విశాఖ ఉత్తర నియోజకవర్గంపై పడింది. బాబుసైతం విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి బరిలోకి దింపేందుకు హామీ ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో గంటా శ్రీనివాస్‌కు విశాఖ ఉత్తర నియోజకవర్గం సీటును అధిష్టానం కేటాయించింది. దీంతో చేసేదేమీలేక మళ్లి పంచకర్ల యలమంచలి నుంచి పోటీచేయాల్సి రావటం, ఓడిపోవటం జరిగింది.

సుధీర్ఘకాలం పార్టీలో కొనసాగుతున్న సీనియర్‌ నేతలే తనను కావాలని ఓడించారని రమేష్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాంబెల్లి, యలమంచలి మండలాల్లో తనకు పడ్డ ఓట్లను ప్రత్యర్థులకు పడ్డ ఓట్లను లెక్కలు తీసి అధిష్టానం వద్ద తన ఓటమికి తెదేపాలోని సీనియర్లే కారణమంటూ వెల్లడించారని తెలుస్తుంది. దీనికితోడు యలమంచిలి మున్సిపాలిటీలో ఎంపీ అభ్యర్థికి, తనకు 5వేల ఓట్ల తేడా ఉందని, దీని వెనుక కుటిల రాజకీయాలను ఉన్నాయని పంచకర్ల వాదిస్తూ వచ్చారు. దీంతో ఎన్నికల తరువాత పంచకర్ల మౌనంగా ఉండిపోయారు. రూరల్‌ విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి పంచకర్ల.. యలమంచలిలో తన ఓటమికి కారణాలపై పోస్ట్‌ మార్టం జరపాలని అధిష్టానంను డిమాండ్‌ చేసినట్లు సమాచారం.

ఇదే సమయంలో వైసీపీ పెద్దలు పంచకర్లను తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు చర్చ సాగుతుంది. పంచకర్ల సైతం టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు భరించలేక, అధిష్టానం తీరు నచ్చక వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు ప్రచారం సాగుతుంది. ఇప్పటికే పలు సందర్భాల్లో వైసీపీ పెద్దలతో పంచకర్ల మతనాలు చేసినట్లు విశాఖ రూరల్‌ జిల్లాలో చర్చసాగుతుంది. ఈనెల 8న పంచకర్ల వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.

ఇదిలా ఉంటే పంచకర్ల కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఇంట్లో ఏదైనా శుభకార్యాలు నిర్వహించాలన్నా శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీర్వాదం తీసుకోవటం ఆనవాయితీగా వస్తుంది. పార్టీ మారుతున్నట్లు జిల్లాలో చర్చ సాగుతున్న నేపథ్యంలో పంచకర్ల స్వరూపానందేంద్ర స్వామిని కలిసి ఆశీర్వాదం తీసుకోవటం వైసీపీలో చేరికకు బలం చేకూరుతుందని జిల్లా ప్రజలు పేర్కొంటున్నారు. మరి పంచకర్ల టీడీపీని వీడకుండా ఎలాంటి బుజ్జగింపులకు దిగుతుందో, లేదా పంచకర్ల వెళ్లినా తమకు వచ్చే నష్టం ఏమీలేదని భావించి ఊరుకుంటుందో వేచి చూడాల్సిందే.

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   18 hours ago


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   20 hours ago


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   21 hours ago


లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

   21 hours ago


డోసు పెంచిన కమలనేతలు.. ప్రభుత్వంపై గవర్నరుకు ఫిర్యాదు!

డోసు పెంచిన కమలనేతలు.. ప్రభుత్వంపై గవర్నరుకు ఫిర్యాదు!

   a day ago


ప్రయాణికులకు గుడ్ న్యూస్.... తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్ కౌంటర్లివే

ప్రయాణికులకు గుడ్ న్యూస్.... తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్ కౌంటర్లివే

   a day ago


శ్రీవారి అస్తులకే ఎసరు.. అమ్మకానికి సిద్ధమైన టీటీడీ!

శ్రీవారి అస్తులకే ఎసరు.. అమ్మకానికి సిద్ధమైన టీటీడీ!

   a day ago


చరిత్రలో కలిసిపోయిన మూడులాంతర్ల స్థూపం.. విమర్శల పర్వం

చరిత్రలో కలిసిపోయిన మూడులాంతర్ల స్థూపం.. విమర్శల పర్వం

   23-05-2020


వరద రోజుల్లో వాడుకున్న నీటిని కోటాలో కలిపేస్తారా.. కృష్ణా బోర్డుపై ఏపీ గుస్సా

వరద రోజుల్లో వాడుకున్న నీటిని కోటాలో కలిపేస్తారా.. కృష్ణా బోర్డుపై ఏపీ గుస్సా

   23-05-2020


ఇప్పుడు జూనియ‌ర్‌పైనే ఆశ‌లు పెంచుకుంటున్నారా..?

ఇప్పుడు జూనియ‌ర్‌పైనే ఆశ‌లు పెంచుకుంటున్నారా..?

   23-05-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle